అధికముగా ఉన్న లాలాజల స్రావం మరియు కోపం 02806...Malaysia
ఒక 19 ఏళ్ళ యువకుడు ఒక ఏడాదిపాటు అధికముగా ఉన్న లాలాజల స్రావం సమస్యతో భాధపడ్డాడు. ఈ తెలివైన వ్యక్తి ఒక సంతోషమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరగలేదు.అందువలన ఇతనికి కోపం అధికముగా ఉండేది. ఇతను అభ్యాసకుడిని సంప్రదించడానికి ముందుగా అనేక వైద్య నిపుణుల్ని సంప్రదించి వైద్యం తీసుకోవడం జరిగింది. కాని ఏ వైద్యము ఇతనికి పనిచేయలేదు. 2014 ఆగస్ట్ 31న ఇతనికి క్రింద వ్రాసిన వైబ్రో మందులు ఇచ్చాను
#1. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders…TDS
ఆరు వారాల తర్వాత ఈ వ్యక్తి తన రోగ లక్షణాలలో ఏ మార్పు లేదని తెలియజేసాడు.ఇతనికి CC 11.5 చేర్చి ఇచ్చాను
#2. CC11.5 Mouth infections + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders…TDS
ఈ మార్పుతో ఈ వ్యక్తికి 5 వారాలలో సమస్య 30% తగ్గింది. ఇవే మందులు కొనసాగించడంతో మరో 3 వారాలలో 50% తగ్గి, ఆపై 2 వారాల తర్వాత 70% నయమైంది. డిసంబర్ 28న ఈ వ్యక్తికి 12 వారాల చికిత్స తర్వాత రోగ లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి. జూలై 29కి ఇతను ఆరోగ్యంగా ఉన్నాడు.
సంపాధకుని వ్యాఖ్యానం:
దీర్ఘకాలిక కేసులలో మందులను హటాత్తుగా ఆపివేయకుండా మెల్లగా తగ్గించాలి.