Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

మూత్రపిండాల వైఫల్యం 00971...Japan


ఒక 64 ఏళ్ళ మహిళ తన మూత్రపిండాలలో వైఫల్యం కలిగే సంభావన ఉందని ఒక వైద్యుడు ద్వారా తెలుసుకోవడంతో 2014 ఆగష్టు 24వ తేదిన అభ్యాసకుడిని సంప్రదించింది. రక్త పరిశోదనలో తన క్రియాటినిన్ స్థాయి చాలా అధికంగా ఉందని తనకు డయాలిసిస్ ప్రక్రియ తప్పకుండా చెయ్యాలని తెలిసింది. ఈమెకు డయాలిసిస్ చేయించుకోవడం ఇష్టం లేదు. ఈమె ఎక్కువుగా తీసుకునే మాంసాహారం మరియు ఉప్పుని  తగ్గించమని అభ్యాసకుడు సలహా ఇచ్చారు.ఈమె బలంలేని ఆహరం తీసుకోవడమే కాకుండా నీరు కూడా తక్కువుగా తాగేది. ఈమె ఇకనుండి నియమబద్ధముగా పుష్టికరమైన ఆహారాన్న మాత్రమే తీసుకుంటానని అభ్యాసకునికి మాట ఇచ్చింది. ఈమె తన తల్లి తండ్రుల్ని చిన్న వయసులోనే కోల్పోయింది. అంతేకాకుండా తనకు అత్తగారితో బాంధవ్యం సామరస్యంగా ఉండేది కాదు. దీనివలన ఈమె మానసికంగా వ్యాకులత చెందుతూ ఉండేది. క్రింద వ్రాసిన మందులు ఈమెకు ఇవ్వబడినాయి.

#1. NM12 Combination 12 + NM63 Back-up + NM83 Grief + SM2 Divine Protection + SR360 VIBGYOR…QDS for 3 days

#2. SM2 Divine Protection + CC12.1 Adult tonic + CC13.4 Kidney failure + CC15.1 Mental & Emotional tonic + CC17.2 Cleansing…TDS     

#3. SM2 Divine Protection + CC4.1 Digestion tonic + CC4.4 Constipation + CC6.2 Hypothyroid + CC15.4 Eating disorders…TDS     

సెప్టెంబర్ 22వ తేదిన చేసిన రక్త పరిశోధనలో క్రియాటినిన్ స్థాయి సాధారణ స్థాయికి తగ్గిన్నట్లుగా తెలిసింది. వైద్యుడు ఆశ్చర్యపడి ఇది ఎలా సాధ్యమైందని అడిగితే "పధ్యం" అని సమాధానమిచ్చింది. ఈమె బరువుకూడా 5 కిలోలు తగ్గింది. ఈమె #2 మరియు #3 ఆరు నెలలుకు రోజుకు మూడుసార్లు తీసుకుంది.2015 జూలై 10వ తేదీకి ఈమె బరువు 10 కిలోలు తగ్గింది. తన జీవన విధానంలో మరియు దృక్పధంలో ఎంతో మార్పు కలిగిందని తను తెలియచేసింది. తను ఉత్సాహంగా మరియు ఆనందంగా ఉంది. ఈమె మందుల్ని రోజుకి ఒకమారు తీసుకుంటున్నది. పూర్తిగా నయమైనందువల్ల త్వరలోనే మందులు తీసుకోవడం మానేస్తుంది.