డిప్రెషన్ , కీళ్ళ వాపు, ముక్కు నుండి రక్త స్రావము 02779...Japan
ఒక 75 ఏళ్ళ మహిళ తన భర్త చనిపోవడంతో మనసు క్రుంగి వ్యాకులత పడింది. కీళ్ళ వాపు వలన ఆమెకు నడవడం చాలా కష్టంగా ఉండేది. 2011 నవంబెర్ లో ముక్కులో రక్త స్రావము వల్ల ఈమెను ఆస్పత్రిలో చేర్చారు. ఈమె స్నేహితురాలు ఈమెను ఒక వైబ్రో అభ్యాసకునితో పరిచయం చేసింది. ఈ మహిళకు ఈ కింద రాయబడిన మందులు ఇవ్వడం జరిగింది.
CC3.2 Bleeding + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis…TDS
ఈ మందులు తీసుకోవడం మొదలు పెట్టాక వారం రోజులలో ఈమెకు ముక్కునుండి నెత్తురు కారుట తగ్గిపోయింది. మూడు నెలల తర్వాత కీళ్ళవాపులు 60% తగ్గాయి కాని తనకు ధైర్యము ఉత్సాహము కలగటం లేదని అభ్యాసకునికి తెలియచేసింది. తను రోజు పాలు ఎక్కువ సార్లు తాగుతున్నట్లుగా చెప్పింది.అభ్యాసకులు ఈమెను పాలు తాగడం తగ్గించమని సలహా ఇవ్వడం జరిగింది. ఐదు నెలల తర్వాత ఈమె 80% నయం అయ్యింది. ఇప్పుడు(2015 జూలై) తను 95% కోలుకుంది. రోజుకి ఒక మారు మందు తీసు కుంటున్నది.
రోగి వ్యాఖ్యానము:
మనం తీసుకునే ఆహారం యొక్క ప్రభావం మన ఆరోగ్యం పైన ఎంతగానో ఉంటుందని నాకు ఇప్పుడు తెలిసింది. నా కళ్ళు తెరిపించి నాకు చాలా మంచి విషయాలు తెలియ చేసిన వైబ్రో అభ్యాసకునికి నా కృతజ్ఞ్యతలు.