మలభాద్దకము మరియు గ్రహణ శక్తిలో బలహీనత 02779...Japan
ఒక 85 ఏళ్ల మహిళ గత రెండున్నర సంవత్సరాలుగా మలభాద్దకము మరియు మెదడులో స్ట్రోక్(ఆఘాతం) ప్రభావం వల్ల బాధపడుతూ ఉండేది. ఈ రోగ చికిత్సకై వైద్యుడు తనకు ఇచ్చిన మందులు వల్ల గొంతులో నొప్పి మరియు గుండెలో మంటా కలిగాయి. ఈమెకు నడవడం కూడా కష్టంగా ఉండేది. అక్టోబేర్ 22వ తేదిన ఈమె కుమార్తె వైబ్రియోనిక్స్ అభ్యాసకుడిని సంప్రదించింది. ఈ రోగికి ఈ కింద రాయబడిన రేమడీలు (మందులు) ఇవ్వబడినాయి:
CC4.4 Constipation + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.4 Brain stroke …TDS
అభ్యాసకుడు రోగిని నీరు ఎక్కువుగా త్రాగమని సలహా ఇచ్చారు. మూడు రోజులలో రోగికి పేగుల కదలికలు కొంత్తమేరకు మెరుగుపడ్డయీ. రెండు నెలల తర్వాత ఈ మహిళ పునర్వవస్థీకరణ కేంద్రానికి వెళ్లి వ్యాయాముము చేసుకో కలిగినది. ఈమె స్వయంగా అభ్యాసకుడికి కృతజ్ఞ్యతతో నిండిన లేఖలు రాసింది.మూడు నెలల చికిత్సానంతరము ఈ మహిళ 90% కోలుకున్నట్లుగా సమాచారం అందచేసింది.ఈమె ఇప్పుడు ఈ రేమడీలు రోజుకి ఒకమారు తీసుకుంటున్నది(OD). 2015 జులైలో ఈ మహిళ పూర్తిగా నయమై, ఆరోగ్యంగా ఆనందంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నది.
రోగి వ్యాఖ్యానం:
నేను ఈ మందుల్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటున్నాను. ప్రొద్దున్న పూట ఎక్కువ నీరు తాగుతున్నాను. నేను నీటిలో విబూతి కలుపుకొని తాగుతూ ఉంటాను. బాబాని గురించి తెలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.