హైపోథైరాయిడిజం, పాదాల వాపు, కీళ్ల నొప్పి, మానసిక వ్యాకులత 02817...India
అభ్యాసకుడు ఇట్లు వ్రాస్తున్నారు: మేము వైబ్రో మందులు తీసుకుంటున్నఒక స్నేహితుడి ఇంట్లో ఒక 73 ఏళ్ల మహిళను కలుసుకున్నాము. ఆ స్త్రీ గత 15 సంవత్సరాల పాటు అనేక సమస్యలతో భాధపడింది: ఆమె అరికాళ్ళలో మంట,అరికాళ్ళు మరియు కాలి వేళ్ళలో వాపు నొప్పివలన ఆమెకు నడవడం కష్టమయింది. దీనివలన మానసిక ఆందోళనకు గురయింది. గత ఐదు సంవత్సలుగా ఆమె కీళ్ళ నొప్పులు,ఆపుకొనలేని మూత్ర విసర్జన మరియు హైపోథైరాయిడిజం సమస్యలతో కూడా భాద పడింది. ఆమె అనేక సంవత్సరాలు అల్లోపతి చికిత్స తీసుకుంది కాని ఆమె పరిస్థితిలో మెరుగుదల లేదు. ఆమెకున్న ఆపుకొనలేని మూత్రవిసర్జన సమస్యవల్ల ఆమె ఇల్లు వదలి ఎక్కడికి వెళ్ళేది కాదు. ఆమె పరిస్థితికి తనను తాను నిందించుకుంటూ ఉండేది. ఆమె నా చేతులు పట్టుకుని ఏడుస్తూ తనకు వైబ్రియానిక్స్ మందులు ఇవ్వమని కోరింది. ఆమె తన భర్తనుండి విడిపోయి ఇరవై సంవత్సరాలు అయినట్లు ఆమతో మాట్లాడాక తెలుసుకున్నాను. ఆమె అనారోగ్యానికి ఇదే మూల కారణమని నాకు అనిపించింది. చికిత్స ప్రారంభంలో, ఆమె రోజువారీ 12 వివిధ అల్లోపతి మాత్రలు తీసుకునేది. నేను ఆమె డాక్టర్ని అడగకుండా ఏ అల్లోపతి మందుని ఆపవద్దని చెప్పి ఈ క్రింద వ్రాసిన మందుల్ని ఇచ్చాను
CC3.1 Heart tonic + CC3.7 Circulation + CC6.2 Hypothyroidism + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC13.1 Kidney & Bladder tonic + CC13.3 Incontinence + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis…TDS
ఈ పేషంటు నాలుగు రోజుల తరవాత నాకు ఫోన్ చేసి ఆమె అల్లోపతి మందులు తీసుకోవడం ఆపేసినట్లు మరియు చాలా ఆనందంగా ఉన్నట్లు చెప్పింది. ఆమెకున్న రోగ లక్షణాలు 50% వరకు తగ్గిపోయాయని చెప్పింది. నేను ఆమె వైద్యుడిని సంప్రదించకుండా అల్లోపతిక మందులు ఆపడానికి వీలు లేదని చెప్పినా ఆమె వినలేదు.
15 రోజుల తరవాత ఆమె మందుల రీఫిల్ కొరకు నన్ను సంప్రదించినప్పుడు ఆమెకు 70% నయమైందని చెప్పింది. ఆమె నాతో "నేను ఈ అద్భుతమైన మందుల్ని మాత్రమే తీసుకుంటాను" అని చెప్పింది. ఆమె మొదటి సందర్శన జరిగిన ఒక నెల తరువాత ఆమెకు చాలావరకు తన సమస్యలు తగ్గినట్లు చెప్పింది. కొద్ది వారాల తరవాత పూర్తిగా ఆమెకు నయమైంది. ఇప్పుడు ఆమె ఆరోగ్యంగాను ఆనందంగాను ఉంది. క్రమం తప్పకుండా ఆమె అమృతంగా భావించే ఈ వైబ్రో మందుల్ని తీసుకోవడం కొనసాగిస్తోంది.