ఆప్టిక్ న్యురైటిస్ (ఆప్టిక్ నరంలో వాపు) మరియు ట్రాకోమా( కొయ్యకండల వ్యాధి) 02817...India
అభ్యాసకుడు ఇట్లు వ్రాస్తున్నారు: ఒక 23 ఏళ్ళ యువకుడుకు ఆరు సంవత్సరాలు తీవ్రమైన కంటి సమస్యలతో భాధపడేవాడు. అతనికి ఆప్టిక్ న్యురైటిస్ మరియు ట్రాకోమా(కొయ్యకండల వ్యాధి) ఉన్నట్లు వైద్యులు నిర్ధారణ చేసారు. అతను స్టెరాయిడ్ మాత్రలు వాడేవాడు. ఈ రోగ సమస్యల ప్రభావం అతని చదువు మీద పడింది. అతని కళ్ళు ఎప్పుడు నీళ్ళు కారుతూ, ఎర్రగా మరియు నొప్పిగా ఉండడంతో అతను ఏడ్చేవాడు. ముంబైలో కాలుష్యం అధికంగాను మరియు వాతావరణం చాలా వేడిగాను ఉంటుందని వైద్యులు ఆ రోగి కుటుంబాన్ని ముంబైని వదిలి వెళిపోమన్నారు కాని అతని తండ్రి ముంబైలో వ్యాపారం నడుపుతూ ఉండడం వలన అక్కడే ఉండిపోయారు. ఆ యువకుడికి ఎవరితోనూ మాట్లాడడం కాని ఎక్కడికయినా వెళ్ళడం కాని ఇష్టముండేది కాదు.అతని తల్లి నన్ను వైబ్రో చికిత్స కోసం సంప్రదించింది. అతనికి ఈ క్రింద వ్రాసిన మందులు ఇవ్వబడినాయి
CC3.7 Circulation + CC7.3 Eye infections + CC7.6 Eye injury + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC20.4 Muscles & Supportive tissue + a nosode of his steroids (prepared with the SRHVP machine)…TDS
ఇదే మందుల్ని కంటి చుక్కలు వలె ఉపయోగించడానికి పన్నీరులో తయారు చేయబడింది. రెండు రోజుల్లో, అతని కళ్ళ ఎరుపు,మంట మరియు నీళ్ళు కారడం వంటి లక్షణాలు 50% వరకు తగ్గిపోయాయి. మరో పది రోజుల సమయం లో అతను తన కళ్ళలో మధ్యాహ్నం పూట కొద్దిగా అసౌకర్యం మాత్రం ఉందని, 90% నయమైందని చాలా ఆనందముగా తెలిపాడు. మరో నెల రోజులలో అతనికి సంపూర్ణంగా నయమైందని తెలిపాడు. అతను ఇప్పుడు రోజువారి ఒకసారి (OD) ఈ మందుల్ని పిల్స్ రూపంలో మరియు కళ్ళ చుక్కలు వలె తీసుకోవడం కొనసాగిస్తున్నాడు.