ఒక కుక్కకు గుదము సంక్రమణ 11572...India
జైరాయనే ఒక ఏడున్నర ఏళ్ళ ఆడ గోల్డెన్ రిట్రీవర్కు తీవ్రమైన గుదము సంక్రమణ కలిగింది. గుదము ప్రాంతం చుట్టూ చీము కారుతుండేది. దానికి జ్వరం లేదుకాని నీరసంగా ఉండేది. చీము కారే ప్రాంతంనుండి దుర్వాసన వస్తుండేది. దానికి అల్లోపతి కాని ఇంకే విధమైన వైద్యం కాని చేయించలేదు. 2015 ఎప్రల్ 23న అభ్యాసకుడు ఈ క్రింద వ్రాసిన మందుల్నిచ్చి కుక్కకు సోకిన వ్యాధిని నయం చేసింది
#1. CC1.1 Animal tonic + CC4.4 Constipation + CC21.11 Wounds & Abrasions…6TD
#2. CC4.4 Constipation + CC21.11 Wounds & Abrasions…6TD, applied externally in water
ఈ మందులిచ్చిన రెండోరోజుకి చీము కారడం తగ్గింది. కాని పుండు తగ్గలేదు. ఈ మందుల్ని మరో నాలుగు రోజులు కొనసాగించడంతో 80% నయమైంది. ఏడో రోజునుండి మోతాదు TDSగా తగ్గించబడింది. పది రోజుల తర్వాత ఆ కుక్కకు 100% నయమైంది.