ఫుడ్ పాయసనింగ్ , IBS సమస్య 11968...India
ఒక 60 ఏళ్ళ మహిళకు ఒక ఫంక్షన్లో ఆహారం తీసుకున్న అనంతరం తీవ్ర ఫుడ్ పాయిసనింగ్ లక్షణాలు మొదలయ్యాయి. ఆమె దాదాపు పదేళ్ళ నుండి ఇరిటబుల్ బవల్ సిండ్రోం నుండి భాద పడుతోంది. ఆమె అభ్యాసకుడిని సంప్రదించిన సమయంలో ఒక చుక్క నీరుకూడా తాగలేన పరిస్థితిలో ఉంది.
అభ్యాసకుడు వెంటనే నీటిలో ఈ క్రింద వ్రాసిన మందుల్ని ఇచ్చారు:
CC4.1 Digestion tonic + CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC12.1 Adult tonic…TDS
ఒక గంటలో 25% నయమయినట్లుగా ఆమె ఫోన్ చేసి చెప్పింది. రెండు రోజులు ఈ మందుల్ని నీటిలో తీసుకోవడంతో ఆమెకు వాంతులు మరియు విరోచనాలు పూర్తిగా తగ్గి, ఆహారాన్ని కొంచం తీసుకోవడం మొదలుపెట్టింది.
ఆమెకు అంతకు ముందున్న IBS సమస్య కూడా నయమైనట్లుగా తెలియచేసింది. ఆమెకున్న ఈ IBS సమస్య వల్ల ఆమెను తరచుగా ఆసుపత్రి లో చేర్చవలసి వచ్చేది. ఈ మందులు తీసుకోవడం వలన ఆసుపత్రి లో చేరే అవసరం రాలేదని ఆమె ఎంతో ఆనందంగా తెలియచేసింది.
అభ్యాసకుని వ్యాఖ్యానం:
ఇది విన్నాక నాకు ఎంతో ఆనందంగాను సంతృప్తిగాను ఉంది.