Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ఉర్టికేరియా (దీర్ఘకాలిక దద్దుర్లు) 11483...India


ఒక 32 ఏళ్ళ మహిళ విపరీతమైన ఉర్టికేరియాతో  (దద్దుర్లు) భాధపడేది. పది నెలలుగా అల్లోపతి మరియు హోమియోపతి వైద్యాలతో ఫలితం లేకపోయేసరికి ఈమె వైబ్రో అభ్యాసకుడిని సంప్రదించింది. ఈ కింద వ్రాసిన మందులు ఈమెకు ఇవ్వబడినాయి

NM21 KBS + NM36 War + NM46 Allergy 2 + NM62 Allergy B + OM28 Immune system + SR268 Anacardium (200C) + SR270 Apis Mel + SR319 Thyroid Gland + SR322 Urtica Urens + SR353 Ledum (200C) + SR497 Histamine…6TD, in water

ఈ మందులు తీసుకున్న రెండు రోజులకి ఈమెకు పుల్ అవుట్ వచ్చిందని తెలిసి ఈమెను అభ్యాసకుడు ఒక రోజు మందులు తీసుకోవడం ఆపమని చెప్పారు. క్రమంగా ఈమెకు మందులు OD నుండి BD,TDS వరకు పెంచడం జరిగింది.రెండు వారాల తరవాత ఈమెకు 75% నయమైంది. ఆరు వారాల తరవాత ఈమెకున్న దద్దుర్లు పూర్తిగా తగ్గిపోయాయి. మరో మూడు నెలలకు ఈమెకు డోసేజ్ వారానికి ఒక సారిగా(OW) తగ్గించబడింది.

రోగి వ్యాఖ్యనాలు:
నేను 2013లో శివరాత్రి భజనలు పాడుతుండగా దురదతో కూడిన  దద్దుర్లు నా కాళ్లు మరియు చేతులు మీద వ్యాపించి ఉండటం చూసి ఒక డెర్మటాలజిస్ట్ ని  సంప్రదించాను. నాకున్న వ్యాధి యుర్టికేరియా యని వైద్యుడు ద్వారా తెలిసిందిదాని తరవాత ఎనిమిది నెలలకు నాకొచ్చిన చర్మ వ్యాధి మరింత ఎక్కువయ్యింది. ప్రతి రోజు నేను అంటి హిస్టమైన్లు తీసుకోవాల్సి వచ్చింది.ఆపై ఐదు నెలల తరవాత 2014 మే లో వ్యాధి తీవ్రమైంది. ప్రాణానికి అపాయం లేకపోయినా వ్యాధి నాకు చాలా అసౌకర్యాన్ని కలిగించింది.

ఆరు నెలలపాటు అల్లోపతి మరియు హోమియోపతి వైద్యాలు తీసుకొని  అలిసిపోయానుఒక రోజు నేను మా ఇంటికి వెళుతుండ్డగా దారిలో ఒక చిన్న స్వామీ పటం రోడ్డు మీద పడియుండడం చూసాను పటం వెనుక సాయి వై బ్రియానిక్స్ గురించి వ్రాసియుండడం చూసి అది స్వామి నాకిచ్చిన  సందేశమని అనిపించింది.

వెంటనే నాకు ఎంతో ప్రియమైన మరియు గుర్గౌన్ (Gurgoan) లో వైద్య శిబిరాలలో నాతో పాటు పని చేసిన ఒక అభ్యాసకురాలు గుర్తుకు వచ్చింది. ఆమె నాకు వైబ్రో మందులు వెంటనే ఇచ్చింది.

రెండు రోజులలో నాకు వ్యాధి తీవ్రమైంది కాని రెండు వారాల తరవాత నాకు చర్మ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. వైద్యం తీసుకున్న ఆరు నెలల తరవాత కూడా నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. ఇదంతా స్వామి దయ వల్లే జరిగింది.