Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

UTI మరియు ఆస్తమా 02707 & 02766...UK


ఈ అభ్యాసకురాలి మేనల్లుడు (46 ఏళ్ళ వయస్సు) 2014 ఎప్రల్ 28 న విపరీతమైన వాంతులతో ఆశ్పత్రిలో చేర్చపడ్డాడు. అతనికి అనేక దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు కూడా ఉండేవి: నడవలేకపోవడం, మాట్లాడలేక పోవడం, ఎపిలెప్సి(అపస్మారం), శాశ్వత పక్షవాతం ద్వారా భాదితమైన ఒక చేయి మరియు కీళ్ళ వ్యాధి. ఇంతేకాకుండా అతనికి ఆస్తమా మరియు అల్లర్జీల వల్ల శ్వాస తీసుకోవడం మరియు ఆహారాన్ని మింగడం ఇబ్భందికరంగా ఉండేది. ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పడికి అతను అందరితోను ప్రేమగాను ఆనందంగాను సంవదించగలిగేవాడు.

ఒత్తిడి మరియు అనారోగ్యంవల్ల ఆశ్పత్రిలో అతనికి నిద్ర పట్టేదికాదు.

మే 1న పేషంటు మేనత్తైన వైబ్రో అభ్యాసకురాలు రాత్రి 8.30కి ఆశ్పత్రికి చేరుకున్నాక పేషంటును ఒక నిశబ్ధమైన గదిలోకి తరలించారు. అక్కడ అభ్యాసకురాలు పేషంటుకు హామీ ఇచ్చి అతను సురక్షితంగా మరియు ప్రశాంతంగా ఉండడానికి సహాయపడింది. ఆ రాత్రి 10కి డాక్టర్ పేషంటుకు తీవ్రమైన మూత్ర సంక్రమణ ఉందని పేషంటు రోగ చరిత్ర దృష్టిలో పెట్టుకొని, అతను కోలుకోవడం చాలా కష్టమని చెప్పారు. పేషంటుకి గాడ యాన్టిబయాటిక్లు ఇస్తే ఉపశమనం కలుగవచ్చని చెప్పారు.

ఏదేమైనప్పటికీ అభ్యాసకురాలు భగవాన్ మీద పూర్తి విశ్వాంతో వైబ్రో అభ్యాసకుడైన తన భర్తకు ఫోన్ చేసి SRHVPయంత్రం ద్వారా ఈ క్రింద వ్రాసిన మందుల్ని ప్రసారం చేయమని(బ్రాడ్ కాస్టింగ్) చెప్పింది.

UTI కోసం:
#1. CC13.2 Kidney & Bladder infections…6TD

శ్వాస సమస్య కోసం:
#2. "Breathe Well" (CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic)…6TD

ఆ రోజు పేషంటు ఏమి తాగినా వాంతి చేసుకున్నాడు కాని ఆ ముందు ఉన్నదానికన్నా అతని పరిస్థితిలో మెరుగు ఏర్పడింది. మరుసటి రోజు అభ్యాసకురాలు పేషంటుకు వీటబిక్స్(ధాన్యంలో ఒక రకం) తినిపించింది. ఆ తర్వాత అతనికి ఆశ్పత్రిలో చేరాక మొదటిసారి నిద్ర పట్టింది. అతను క్రమంగా ఆహారం తీసుకోవడం ప్రారంభించాడు. మరో రెండు రోజులలో అతను అన్ని వేళలు ఆహరం తీసుకోవడం మొదలుపెట్టాడు.

పేషంటుకు అత్తైన ఈ అభ్యాసకురాలు ప్రతి రోజు అతనితో ఉదయం 8.30నుండి సాయంత్రం 5.30 వరకు ఉండేది. అభ్యాసకురాలి ప్రేమ, సంరక్షణ మరియు వైబ్రో మందులు కారణంగా పేషంటుకు పూర్తిగా నయమై మే 6న అతన్ని ఆశ్పత్రినుండి డిశ్చార్జ్ చేసారు.

క్రింద వ్రాసిన విధంగా పేషంటు వైబ్రో మందుల మోతాదుని క్రమంగా తగ్గించుకున్నాడు. మరో మూడు రోజులకు #1.మూడు సారులు(TDS) తీసుకున్నాడు, ఆపై మూడు రోజులకు రెండు సార్లు(BD), ఆపై ఒక వారానికి మూడు సార్లు (3TW) , ఆ తర్వాత కొన్ని వారాలకు వారానికి ఒకసారి(OW). అభ్యాసకురాలు క్రమానుగతంగా ఒక నివారణ చర్యగా ఈ మందుల్ని ప్రసారం చేయడం కొనసాగిస్తోంది.