Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

శ్లేష్మ పొర యొక్క శోధనము (Gustatory rhinitis) 02870...USA


వృత్తి రీత్యా డాక్టర్ గానూ మరియు ప్రాక్టీషనర్ తండ్రి ఐనట్టి  82 సంవత్సరాల వృద్దుడు గత 10 సంవత్సరాలుగా గస్టేటరీ రైనిటిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఏదైనా తినడం ప్రారంభించగానే ఇతని ముక్కు కారడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా వేడిగానూ, మషాలాల తోనూ ఉన్న భోజనం అది మధ్యాహ్నం కానీ లేదా రాత్రి గానీ  తినడం ప్రారంభించగానే ఇది ప్రారంభమవుతుంది. ఇలా  కారడం కూడా నిరంతరాయంగానూ ఎక్కువగానూ ఉండి తను తినే ఆహారంలో కూడా పడిపోతూ ఉండడంతో తినేటప్పుడు కూడా నిరంతరాయంగా టిస్యు పేపరుతో తుడుచుకుంటునే ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. పేషంటు తన సహచరులైన కొందరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులను 2013 పూర్వ భాగంలో సంప్రదించారు. వారి సూచన మేరకు యాంటిహిస్టమిన్ డిస్లోరేటడిన్ (antihistamine Desloratadine) 5 mg ను రాత్రి భోజన అనంతరం వేసుకునేవారు. కానీ పరిస్తితిలో 25% మెరుగుదల కనిపించండము తప్ప ప్రయోజనమేమి కలగలేదు, ముక్కు కారడం మానలేదు.

2014,ఫిబ్రవరి 18 న అతనికి క్రింది రెమిడి ఇవ్వబడింది:

CC19.1 Chest tonic + CC19.2 Respiratory allergies...TDS

వీరికి రెమిడి ఫిబ్రవరి లోనే ఇచ్చినప్పటికీ దీనితో నిజంగా తగ్గుతుందా అనే సంశయంతో సరిగా వేసుకునేవారు కాదు. కానీ ఏప్రిల్ చివరిలో కంటిన్యూ గా రోజుకు రెండు సార్లు వేసుకోవడం ప్రారంభించాక తినేటప్పుడు తన ముక్కు కారడం తగ్గిందని గమనించారు. మే 1 వ తేది మొదటిసారి తను తినేటప్పుడు తిన్న తర్వాత ముక్కు కారలేదని తెలిపారు. మే 29 నాటికి స్థిరమైన మెరుగదల కనిపించి 90% సమస్య పరిష్కారం ఐనట్లు తెలిపారు. జూన్  2014, నాటికి పూర్తిగా 100% తగ్గిపోవడమే కాక జూలై ఆగస్టు కూడా ఇదే రీతిగా ఫలితం కనిపించింది. కానీ దురదృష్టవశాత్తూ ఈ రెమిడి కొనసాగించమని ఎన్ని సార్లు చెప్పినా ఇతను వినక ఆగస్టు తర్వాత మందు వేసుకోవడం మానేయడంతో  సెప్టెంబర్ వరకూ బాగానే ఉండి ఆ తర్వాత అక్టోబర్ నుండి ముక్కు కారడం తిరిగి ప్రారంభమయ్యింది.  2015 మార్చ్ 16 నాటికి వీరి పరిస్థితి వైబ్రో రెమిడి తీసుకోక ముందు ఎలా ఉందో అలాంటి పరిస్థితి ఏర్పడింది.  

ప్రాక్టీషనర్ వ్యాఖ్య :

ఈ కేసు వైబ్రియోనిక్స్ మందులు నిత్యమూ క్రమశిక్షణతో వేసుకోవాలనే విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. 

సంపాదకుని వ్యాఖ్య : వైబ్రియోనిక్స్ రెమిడి డోసేజ్ విషయంలో నిర్దిష్టమైన రిడక్షన్ (క్రమంగా తగ్గించే విధానము) తప్పనిసరిగా పాటించాలి.