మొక్కలలో ఒత్తిడి 02864...USA
అభ్యాసకురాలు వ్రాస్తున్నారు : వైబ్రియోనిక్స్ సమావేశం సంపుటంలోని నా వ్యాసంలో, నేను 2013ఆగస్ట్ లో మరోప్రదేశం తరలి వెళ్ళే సమయంలో బాగాపాడైన వివిధరకాల ఇంట్లో పెరిగే మొక్కలు, వైబ్రియోనిక్స్ వాడుకవల్ల ఆరోగ్యంగా పెరిగిన సంగతి తెల్పితిని.
నేను వాటికి యిచ్చినవి: #CC1.2 Plant tonic + CC15.1 Mental & Emotional tonic... 3TW నీటిలో కలిపితిని.
2 నెలల పైచికిత్సతో మొక్కలన్నీ కోలుకుని, ఆరోగ్యంగా అయినవి. ఇప్పుడు మీకు ఆ తరువాతి విషయాలను వివరిస్తాను. పై రెమెడీ 2TW గా కొనసాగించబడింది. పెద్దమొక్కలకు 6-8కప్పుల మందునీటిని, చిన్నవాటికి 2కప్పులు పోస్తున్నాము. సుమారు ఏడాది తరువాత మొక్కలు ఆకుపచ్చగా, రెట్టింపుగా పెరుగుట ఫోటోలలో చూడవచ్చు! ఎదుగుదలలో మార్పు ఫెర్న్ మొక్కలో ప్రస్పుటంగా ఫోటోలో కనపడటం మనం గమనించవచ్చు. ఈ ఫెర్న్ మొక్కే ఎక్కువగా తరలి వెళ్ళే సమయంలో పాడైంది. కాని తర్వాత ఆగష్టు2013లో, అక్టోబర్ 2013 లో, మరో ఏడాదితర్వాత 2014 అక్టోబరులో తీసిన ఫోటోలలో మొక్క యొక్క అద్బుతమైన ఎదుగుదల మనం చూడవచ్చు.
ఇంట్లో పెరిగే dracaena fragrans (indoor corn plant) మొక్కజొన్నమొక్కలో భారీమార్పులు పై విబ్రియో మందులు వాడాక కనిపించాయి. ఈ మొక్క ప్రతి సంవత్సరం తియ్యని మల్లె పూల లాంటి వాసన గల పుష్పాలతో వికశిస్తుంది. కానీ 2013లో ఈ మొక్క పుష్పించలేదు. 2014లో ఇది పెద్దపువ్వులతో, ఇంకా తియ్యని ఘాడమైన సువాసనతో ఇల్లంతా నింపుతోంది. క్రింది ఫోటోలు ఈ కార్న్ మొక్క ఇంట్లోకి తెచ్చిన ఆగష్టు 2013, ఆ తరువాత అక్టోబర్ 2013 మరియు అది బాగా వికసించిన అక్టోబర్ 2014 నెలలో తీసినవి.