దీర్ఘకాలిక జ్వరలక్షణము 02786...Russia
అర్జంటినాకు చెందిన 34 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళ ప్రశాంతి నిలయంలో ఉన్న వైబ్రో చికిత్సా నిపుణులను క్రింది రోగ లక్షణాల చికిత్స కొరకు సంప్రదించింది: గత 14 సంవత్సరాల పాటు నిరంతర జ్వరం, గొంతు నొప్పి, శ్వాసనాళాల వాపు వంటివి. ఈమె వైద్యులు సలహాపై రక్త పరీక్షలతో సహా వివిధ పరీక్షలు చేయించుకున్నప్పటికి, వైద్యులు రోగనిదానము చేయలేకపోయారు. రోగితో మాట్లాడిన తర్వాత, చికిత్సా నిపుణులు, ఈమెకు ఇరవై సంవత్సరాల వయసున్నప్పుడు ఈమె యొక్క స్నేహితుడు తీవ్రమైన మలేరియా జ్వరంతో భాధపడినప్పుడు, ఆశ్పత్రిలో మూడు రోజులు అతనికి తోడుగా ఉండి సేవ చేసిందని తెలిసింది. ఈమెకున్న జ్వరలక్షణం ఆ సమయం నుండి ప్రారంభమైంది. అయితే, ఆ సమయంలో మలేరియా పరీక్ష చేయించుకుంటే మలేరియా లేదని తెలిసింది.
ఈమె భావావేశపూరితమైన వ్యక్తి కాబట్టి, తనకు ప్రియమైన వ్యక్తి అనారోగ్యంతో భాదపడుతున్న సమయంలో ఒత్తిడి మరియు భయాలకు గురియైన కారణంగాను, ఇతర మలేరియా రోగులున్న వాతావరణంలో ఉన్న కారణంగాను, మలేరియా వ్యాధి యొక్క వైబ్రేషణ్ (స్పందనం) ఆమె యొక్క ప్రాణమయకోశము లేదా ఛాయాదేహములోకి ప్రవేశించిందని చికిత్సా నిపుణులు తలచి క్రింది వైబ్రో మిశ్రమాలను ఈ రోగికి ఇచ్చారు:
CC9.2 Infections acute + CC9.3 Tropical diseases…TDS
అనేక సంవత్సరాల పాటు కొనసాగుతున్న జలుబు మరియు జ్వర లక్షణాల కొరకు CC9.2 Infections acute ఇవ్వబడింది. CC9.3 Tropical diseases ఇవ్వడం ద్వారా మలేరియా నుండి రోగికి ఉపశమనం కలుగుతుందని నిపుణులు ఆశించారు. చికిత్స ప్రారంభించిన మూడు రోజుల తర్వాత, బలమైన తీసివేత (పుల్ అవుట్) కారణంగా రోగికి తీవ్రమైన వాంతులు ప్రారంభమయ్యాయి. ఆపై వారం రోజుల తర్వాత తన స్వదేశమైన అర్జంటినాకు తిరిగి చేరుకున్న రెండు వారాలకు, చికిత్సా నిపుణులకు ఈ-మెయిల్ ద్వారా తనకు పూర్తిగా నయమైందని వారికి కృతజ్ఞ్యతలు తెలిపుకుంది.