పుట్టుకతో వచ్చిన గుండె వ్యాధి 02640...India
పుట్టుకతో వచ్చిన గుండె వ్యాధి సమస్యతో ఒక ఆరు నెలల పాపను ఒక వైబ్రో చికిత్సా నిపుణుడు వద్ద తీసుకు రావడం జరిగింది. అల్లోపతి డాక్టరైన ఈ వైబ్రో సాధకుడు శిశువును పరీక్షించి, శిశువు యొక్క హృదయంలో వ్యాధి ఉందని నిర్ధారించారు. బిడ్డ యొక్క తల్లి తండ్రులకు శాస్త్రచికిత్స చేయించే ఆర్ధిక స్తోమత లేనందువల్ల వైబ్రో చికిత్సా నిపుణులు ఈ క్రింద వ్రాసిన మందులను ఇవ్వడం జరిగింది:
CC3.1 Heart Tonic + CC3.4 Heart Emergencies + CC12.2 Children Tonic
మొదటి కొన్ని వారాలు ఈ మందులను నీటిలో రోజుకి నాలుగు సార్లు ఇవ్వడం జరిగింది. ఆపై రోజుకి మూడు సార్లు (TDS ) ఇవ్వడం జరిగింది. ఈ చికిత్సను ఒకటిన్నర సంవత్సరాలు శిశువుకిచ్చారు.
రెండేళ్ళ వయస్సున్న ఈ శిశువును పరిశీలించిన హృదయ వ్యాధి నిపుణుడు, 2D ఎకో పరీక్ష మరియు ఇతర నివేదికలను చూసి, గుండె వ్యాధి లక్షణాలు ఏవీ లేవని ఎంతో ఆశ్చర్యంతో చెప్పారు.