చిల్లుపడిన ఆంత్రం (ఎపెండిక్స్) 02733...India
ఒక 16 ఏళ్ళ యువకుడు, గత మూడు నెలలుగా తన ఉదరం కుడి భాగంలో నిరంతరమైన నొప్పి మరియు గ్యాస్ ఏర్పడడం సమస్యతో భాధపడేవాడు. ఒక అల్ట్రాసౌండ్ పరీక్షలో ఈ రోగి యొక్క ఆంత్రం తీవ్రంగా వాచిందని మరియు చిల్లుపడియుందని తెలిసింది. ఉదర కుడి భాగంలో ఒక గడ్డ ఉందని కూడా తెలిసింది. డాక్టర్ వెంటనే ఆపెరేషణ్ చేయాలని చెప్పారు కాని ఆర్ధిక సమస్యల కారణంగా తల్లి తండ్రులు ఆపరేషన్ చేయించడానికి నిరాకరించి ఒక వైబ్రియానిక్స్ సాధకుడిని సంప్రదించారు. ఈ రోగికి ఈ క్రింద వ్రాసిన మందులు ఇవ్వబడ్డాయి:
CC4.3 Appendicitis + CC21.11 Abscess + CC3.1 Heart Tonic...6TD
ఆరు వారాల తర్వాత ఉదర భాగంలో ఉన్న గడ్డ మాయమైంది. ఆ రోగికి 75% వరకు నొప్పి తగ్గింది కాని గ్యాస్ ఏర్పడడం సమస్య అప్పుడప్పుడు ఉండేది. ఇతనికి ఈ విధంగా మందును మార్చడం జరిగింది:
CC4.3 Appendicitis + CC21.11 Abscess + CC4.10 Indigestion
ఒక నెల తర్వాత రోగికి నొప్పి 90% వరకు తగ్గినప్పడికి, గ్యాస్ సమస్య కొనసాగుతూనే ఉండేది. ఇతనికి బలం కోసం CC12.2 Children’s Tonic పైన ఇవ్వబడిన మందుతో చేర్చి ఇవ్వబడింది. మరో నెల తర్వాత ఇతనికి నొప్పి పూర్తిగా తగ్గింది. గ్యాస్ సమస్య కొనసాగడంతో సాధకుడు ముందు ఇచ్చిన మందులో CC4.2 Liver and Gall Bladder Tonic చేర్చి ఇచ్చారు.
రెండు నెలల తర్వాత ఇతనికి గ్యాస్ సమస్య పూర్తిగా తగ్గడం కారణంగా ఈ యువకుడు చాలా ఆనందంగాను ఉత్సాహంగాను కనిపించాడు. వైబ్రో మందులు వేసుకోవడం, మెరుగుపడిన తన ఆరోగ్యం స్థిరపడడం కోసం, ఈ యువకుడు కొంత కాలం కొనసాగించాడు.