పేలవమైన దృష్టి (మాక్యులర్ హోల్) 02799...UK
57 ఏళ్ల వ్యక్తి కంటి దృష్టి సరిగా లేనందువలన చికిత్స కోసం 2013 ఆగస్టు 14న, అభ్యాసకుని వద్దకు వచ్చారు. అతని కుడి కంటిలో దృష్టిని కోల్పోయారు. అతని యొక్క ఎడమ కంటి పాపలో రంధ్రం కారణంగా అతని ఎడమ కంటి దృష్టి 30 శాతం మాత్రమే ఉంది . ఈ రంధ్రం దానంతట అదే మూసుకు పోకపోతే అతను అంధుడు అవుతాడని నేత్ర వైద్యుడు చెప్పారు. అతను గత సంవత్సర కాలంగా కంటి ఆసుపత్రి నుండి చికిత్స పొందుతూనే ఉన్నారు కానీ పర్యవేక్షణ ప్రకారము అతనిలో మెరుగుదల 10 శాతం మాత్రమే కనిపించింది. అతనికి క్రింది నివారణ ఇవ్వబడింది:
CC7.1 Eye tonic + CC7.2 Partial Vision + CC7.4 Eye defects + CC7.5 Glaucoma + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic…QDS రెండు వారాల తర్వాత TDS
2013 సెప్టెంబర్ 17న, రోగి ఒక నేత్ర చికిత్స నిపుణుడిని కలిసినప్పుడు ఎడమ కంటికి OCT(ఆప్టికల్ కోహేరేన్స్ టొమోగ్రాఫి) పరీక్ష నిర్వహించబడింది. ఎడమ కన్ను లోని రంధ్రము పూర్తిగా మూసివేయబడి ఉండడం నేత్ర చికిత్స నిపుణుడు కనుగొన్నారు. రోగి అప్పటినుండి తన దృష్టి ముందటి కంటే మెరుగ్గా ఉందని చికిత్స నిపుణునికి తెలిపారు ఇప్పుడు రోగి కుడికంటిలో కూడా ఏదో ఒక అనుభూతిని అనుభవిస్తున్నారు. కుడి కన్ను నుండి కన్నీళ్లు వస్తున్నాయి. అయితే ఇంతకు ముందు ఈ అనుభూతి గాని కన్నీళ్లు గాని రాలేదు. అక్టోబర్ 2013 నాటికి అతను పై నివారణను TDS గా కొనసాగిస్తున్నారు.
రోగి యొక్క వివరణ: ( 2013 సెప్టెంబర్ 30న అభ్యాసకుడికి పంపిన ఈ మెయిల్ ప్రకారం):
“ గతంలో మీరు చూసిన నివేదిక ప్రకారం మాక్యులర్ రంధ్రం కొంచెం తెరుచుకొని ఉంది కానీ ప్రస్తుతం OCT రిపోర్టు ప్రకారము మూసివేయబడినట్లుగా చూపిస్తున్నది. నివేదికలో పేర్కొన్నట్లుగా ఈ రంధ్రం ఇంతకు ముందు పూర్తిగా మూసి వేయబడి లేదు పాక్షికంగా తెరుచుకుని వుంది. నేను 2013 సెప్టెంబర్ 17న OCT పరీక్ష చేయించుకున్నప్పుడు, రంధ్రం పూర్తిగా మూసుకు పోయిందని నివేదిక తెలిపింది. నేను ఆగస్టు 14న మీ వద్దకు వచ్చాను . ఆ తేదీ నుండి నాకు ఇచ్చిన నివారణ OCT పరీక్ష సమయం వరకు తీసుకుంటూ ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాను. మీరిచ్చిన నివారణల ద్వారానే రోగ నివారణ జరిగిందని పూర్తిగా నమ్ముతున్నాను.
ఈ చికిత్సపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా కుడి కంటి దృష్టి కూడా తిరిగి వస్తుందని నమ్ముతున్నాను కాబట్టి మాత్రలతో కొనసాగుతున్నాను ధన్యవాదాలు ”.
ప్రాక్టీషనర్ వ్యాఖ్య:
“నాకు ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి ముఖ్యంగా గ్లూకోమా కేసులు, వివిధ సమస్యలతో బాధపడుతున్న రోగులు స్వామి అనుగ్రహంతో మంచి ఫలితాలు పొందుతున్నారు”.