కుక్క లో స్ట్రోక్ మరియు ప్రేగు సంక్రమణ 00829...Australia
2014 జూన్ లో ఒక సోమవారం ఉదయం అభ్యాసకుడు తన కుక్క దీదీ విషయంలో ఏదో మార్పు జరిగిందని గమనించారు. అది కొద్దిగా వాంతి చేసుకుంది మరియు నడవలేక పోతోంది. పశు వైద్యుని వద్దకు తీసుకువెళ్లారు. దీదీకి స్ట్రోక్ వచ్చిందని బహుశా వృద్ధాప్యం కారణంగా ( దీదీ వయస్సు 15 సంవత్సరాలు) ఇలా జరిగి ఉండవచ్చని తెలిపారు. దీదీకి జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఇన్ఫెక్షన్ కూడా ఉందని ఇది ఇన్ఫెక్షన్ సోకిన మరొక దాని నుండి (ఇది పొరుగున ఉన్న కుక్క నుండి) పొంది ఉండవచ్చని తెలిపారు . దీదీకి మెదడులో వాపు నిమిత్తం కార్టిజోన్ ( cortisone) (2 టాబ్లెట్లు BD) రెండు రోజులకు మరియు ఇన్ఫెక్షన్ కోసం మూడు రోజులు యాంటీబయాటిక్స్ ఒక టాబ్లెట్ BD గా ఇచ్చారు. వైబ్రియానిక్స్ చికిత్స కూడా వెంటనే ప్రారంభించబడింది. సోమవారం(మొదటిరోజు) క్రింది నివారణ ఇవ్వబడింది:
#1. CC3.5 Arteriosclerosis + CC18.4 Paralysis…ప్రతి గంటకు
మంగళవారం (రెండో రోజు) మోతాదు ప్రతి రెండు గంటలకు ఒకసారి ఇచ్చే విధంగా మార్చబడినది. అదే సమయంలో ఇన్ఫెక్షన్ లేదా సంక్రమణ మరియు మంట కోసం అదనపు నివారణ కూడా ఇవ్వబడింది:
#2. CC9.2 Infections acute…every 2 hours
బుధవారం(మూడ వ రోజు) #1 మరియు #2 ను 6TD. వద్ద కొనసాగించారు. కార్ట్ జోన్ ఆకలిని ప్రేరేపిస్తుందనీ పశు వైద్యుడు చెప్పినప్పటికీ మూడవరోజు నాటికి కూడా అలా జరగలేదు. దీదీ ఇంకా ఏదైనా తినడానికి లేదా త్రాగటానికి నిరాకరిస్తూనే ఉన్నది. నడవడానికి ప్రయత్నించినప్పుడల్లా అది పడిపోతోంది. అది ఉన్నచోటనే పడుకుంటూ ఉన్నది. ఆ సాయంత్రం అభ్యాసకుడు దీదీని వేరొక పశు వైద్యుని వద్దకు తీసుకువెళ్ళారు. అనియంత్రిత వేగవంతమైన కంటి కదలికల కారణంగా వికారం కలుగుతూ ఉండవచ్చని ఆ వైద్యు డు తెలిపారు. అప్పుడు అభ్యాసకుడు కార్టిజోన్ మరియు యాంటీబయాటిక్స్ ఆపివేసి క్రింది నివారణ ప్రారంభించారు:
#3. CC4.10 Indigestion…6TD
గురువారం నాలుగవ రోజు ప్రారంభంలో దీదీ సాధారణంగా నడవడం ప్రారంభించింది కానీ దాని తల వంగి ఉంటోంది. ఆమె గిన్నెలో పిల్లి మాంసం ఉన్న ఆహారం మొత్తం తిని నీరు త్రాగడం ప్రారంభించింది. అభ్యాసకుడు శుక్రవారం ఐదో రోజు తర్వాత #3 ఆపివేసి #1 & #2 రెండింటిని 6TD వారాంతం వరకు (7 వ రోజు), అనంతరం మరొక వారం (8-14) TDS గా చివరిగా మరొక వారం (17-22) OD గా ఇచ్చిఆపివేశారు. స్ట్రోక్ వచ్చిన సుమారు నెల తర్వాత దీదీ మొరగటం, ఆడటం,పరిగెత్తడం, మళ్లీ సాధారణ మయ్యాయి. అది మునుపటి వలె మారిపోయింది. కానీ దాని తల మాత్రం స్వల్పంగా వంగి ఉంది.