మూత్రాశయ రుగ్మత & మధుమేహం 11520...India
మధుమేహానికి వైబ్రియో చికిత్స(క్రింది నివారణ చూడండి) పొందుతున్న ఒక వృద్ధుడు (80) 2014 జూలై 17న, సిస్టిటిస్ లేదా మూత్రాశయ శోధము గురించి నివారణ కోరారు. అతనికి 102 F ( 38.9C) జ్వరం ఉంది. మూత్రంలో చీము కణాలు 80-100/hpf.ఉన్నాయి. వారం క్రితం నుండి, అతనికి తరచూ మూత్ర విసర్జన, మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి మరియు మంట, మూత్రం ఆపుకోలేని తనము ఉన్నాయి. ఇతనికి దీర్ఘకాలిక మలబద్ధకం (30 సంవత్సరాలు నుండి) మరియు మధుమేహం (38 సంవత్సరాలు నుండి) ఉన్న చరిత్ర కూడా ఉంది.
తీవ్రమైన లక్షణాలు కోసం ఇతనికి ఈ క్రింది నివారణ ఇవ్వబడింది:
#1. NM21 KBS + NM36 War + SM27 Infection + SR456 Bladder (Urinary) + SR536 Urethra + CC10.1 Emergencies …TDS
జులై 22న, అనగా నివారణ ఇచ్చిన ఐదు రోజుల తర్వాత రోగి 50% ఉపశమనం కలిగినట్లుగా తెలిపారు. మూత్ర విసర్జన చేసేటప్పుడు అతనికి నొప్పి మరియు మంట లేదు. జ్వరం కూడా పోయింది కాబట్టి అతని ఉష్ణోగ్రత సాధారణ స్థాయిలో ఉంది.
జులై 26న రోగి 99 శాతం ఉపశమనం కలిగిందని తెలిపారు. అతను ఎక్కువ మూత్ర విసర్జన చేయవలసిన అవసరం రాలేదు. మూత్రాన్ని నిలుపుకోగల శక్తి ఏర్పడింది. అలాగే మూత్రంలో చీము కణాల సంఖ్య సాధారణ స్థితికి 3-4/hpf కి చేరుకుంది.
రెండవరకం మధుమేహం చికిత్స కోసం రోగి గతంలో అనగా 2012 డిసెంబర్లో అభ్యాసకుని వద్దకు వచ్చారు. అతనికి మధుమేహ కుటుంబ చరిత్ర కూడా ఉంది. అతని తల్లి మరియు అతని సోదరీ సోదరులు అందరూ మధుమేహ బాధితులే. అతను 1982 లో అతనికి 42 సంవత్సరాల వయసులో మధుమేహం నిర్ధారింప బడి అలోపతి చికిత్స తీసుకున్నారు. అతను Volibo M 0.3mg టాబ్లెట్లు BD మరియు Ozomet PG 2 ట్యాబ్లెట్లు TDS గా తీసుకుంటున్నారు. కానీ నిరాహారంగా ఉన్నప్పుడు బ్లడ్ షుగర్ స్థాయి 185-200mg/dL ఉంది. అతనికి క్రింది నివారణ ఇవ్వబడింది:
#2. CC6.3 Diabetes + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS
11 నెలల రెండు వారాల వైద్య చికిత్స తర్వాత నిరాహారంగా ఉన్నప్పుడు అతని రక్తంలో చక్కెర 80-120mg/dL ఉంది. అతని వైద్యుడు Ozomet మోతాదు BD కి తగ్గించారు .
2014 మార్చిలో, అభ్యాసకుడు SVP శిక్షణ పూర్తి చేసుకున్నాక నివారణను ఈ క్రింది విధంగా మార్చి ఇచ్చారు:
#3. NM6 Calming + NM21 KBS + NM36 War + NM63 Back-up + BR2 Blood Sugar + SM5 Peace and Love Alignment + SM17 Diabetes...TDS
2014 జూలై చివరి నాటికి, రోగి యొక్క వైద్యుడు అలోపతి మందులను ప్రారంభ మోతాదులో 50 శాతానికి తగ్గించారు మరియు రోగి వైబ్రో నివారణలు కొనసాగిస్తున్నారు. రోగికి స్వీట్లు మరియు మేక మాంసం తినడం చాలా ఇష్టం. అతను క్రమం తప్పకుండా రోజుకు ఒక స్వీటు తింటున్నప్పటికీ నిరాహారంగా రక్తంలో చక్కెర 110mg/dL గానే ఉంది.
పేషెంట్ వ్యాఖ్య:
“నా వయసు 40 సంవత్సరాలు నాకు మధుమేహం ఉంది మరియు తీవ్రమైన యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది. నేను వైబ్రో చికిత్సలు గత సంవత్సరం నుంచి తీసుకుంటున్నాను. అలోపతి మందులు సగానికి తగ్గించిన తర్వాత కూడా నా మధుమేహం ఇప్పుడు నియంత్రణలో ఉంది. పది రోజుల్లో నా మూత్రం లో ఇన్ఫెక్షన్ లో (80-100 చీము కణాలు ) నుండి సాధారణ స్థాయికి (3-4 చీము కణాలు ), చేరింది మరియు మూత్రం వెళ్లేటప్పుడు నొప్పి మరియు మంట కూడా పోయింది నా ఆరోగ్యం మెరుగు పడింది. నా సమస్యలను సమర్థవంతంగా చికిత్స చేసినందుకు ధన్య వాదాలు”.