Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అజీర్ణం 11618...India


35 ఏళ్ల ఫైనాన్షియల్ అనలిస్ట్ 2013 నుంచి ఏడు సంవత్సరాలుగా పై పొత్తికడుపులో నొప్పితో బాధపడుతున్నారు. ప్రారంభంలో నొప్పి స్వల్పంగా ఉండేది. ప్రతి 3–4 నెలలకు ఒకసారి వచ్చి, 2–3 రోజులు కొనసాగేది. మజ్జిగ తాగడం మరియు విశ్రాంతి తీసుకోవడం వల్ల ఉపశమనం లభించేది. 2015 నాటికి, నొప్పి ప్రతి 1–2 నెలలకు ఒకసారి రావడం ప్రారంభమైంది. ముఖ్యంగా రాత్రి షిఫ్టుల్లో పనిచేసేటప్పుడు తీవ్రమైన వికారం కూడా ఉండేది. క్రమం లేని పని వేళల కారణంగా ఏర్పడిన అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి మరియు తరచుగా జంక్ ఫుడ్ తీసుకోవడం దీనికి కారణమని ఆయన భావించారు.

2016లో, డాక్టర్ ఆయనకు అజీర్ణం ఉన్నట్లు నిర్ధారించి కడుపులోని ఆమ్లాన్ని తగ్గించే మందులు సూచించారు. వాటిని మూడు నెలలు తీసుకున్న సమయంలో లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే మరో మూడు నెలల తరువాత మళ్లీ లక్షణాలు ప్రారంభమయ్యాయి. మందుల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఆందోళనతో, ఈ చికిత్సను కొనసాగించడానికి ఆయన ఇష్టపడలేదు. అక్టోబర్ 2017లో ఆరు నెలల పాటు హోమియోపతి చికిత్స తీసుకున్నారు. జూలై 2018లో మూడు నెలల పాటు ఆయుర్వేద చికిత్సకు మారారు. ఈ రెండు చికిత్సలతో మంచి ఉపశమనం లభించినప్పటికీ, మందులు ఆపిన కొద్దికాలానికే లక్షణాలు మళ్లీ రావడం కొనసాగింది. తరువాతి రెండు సంవత్సరాల్లో ఆయన పరిస్థితి క్రమంగా మరింత తీవ్రమైంది. ఇప్పుడు తీవ్రమైన నొప్పి దాడులతో పాటు వికారం, అప్పుడప్పుడు మలబద్ధకం మరియు స్వల్పంగా రక్తం కలిసిన మలం కూడా ఉండేవి. ఈ ఘటనలు ప్రతి 2–3 నెలలకు ఒకసారి వచ్చి, సుమారు ఒక వారం పాటు కొనసాగేవి.

పరిస్థితి తీవ్రత పెరుగుతున్నప్పటికీ, ఇతర సమయాల్లోనూ మరియు కార్యాలయ సమయంలో కూడా తరచుగా కొద్దిసేపు నడవడం మినహా ఆయన ఎలాంటి ఇతర చికిత్స తీసుకోలేదు; ఇలా నడవడం ఆయనకు కొంత ఉపశమనాన్ని కలిగించేది. అయన పనిచేసే చోట ఒక సహోద్యోగి ద్వారా వైబ్రియానిక్స్ గురించి తెలుసుకుని, 14 జూన్ 2020న ప్రాక్టీషనర్‌ను సంప్రదించారు. అదే సమయానికి ఆ నొప్పి రెండు రోజుల క్రితమే ఆయనకు ప్రారంభమైంది. ప్రాక్టీషనర్‌ ఆయనకు ఈ క్రింది రెమెడీ ఇచ్చారు:

CC4.2 Liver & Gallbladder tonic + CC4.4 Constipation + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic…TDS

దీనితో పాటు తన దినచర్యలో క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేర్చుకోవాలని, వీలైనంత వరకు అర్ధరాత్రి సమయంలో తినడం నివారించాలని సూచించారు.

చికిత్స పురోగతి:

ఆగస్టు 2025 నాటికి, సమస్య మళ్లీ పునరావృతం కాలేదు. రోగి ఇప్పటికీ ప్రతిరోజూ క్రమం తప్పకుండా తన నడకను కొనసాగిస్తున్నారు.