Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

చర్మ రోగం (Atopic Dermatitis), ఆమ్ల ఉధృతి, (Hyperacidity) & జలుబు 10001...India


జూన్ 2013లో, 18 సంవత్సరాల వయసున్న మగ రోగి, తీవ్రమైన చర్మరోగం (atopic dermatitis),  జీర్ణకోశ ఆమ్లాల ఉధృతులతో (hyperacidity) వచ్చాడు. 5 సంవత్సరాల వయసు నుంచి అతనికి ఈ రెండు రుగ్మతలూ ఉన్నాయి. నల్ల మచ్చలు, సెగ్గడ్డలు మొత్తం శరీరెంతో పాటు ప్రధానంగా చేతులూ, పాదాలమీద కనుపిస్తున్నాయి. పుళ్ళకు దురద ఉంది. ఈ దురద రాత్రిపూట తీవ్రమై నిద్ర లేని స్థితి వచ్చింది. సాయి వైబ్రియానిక్స్ వల్ల అధిక రక్తపోటు, స్పోండైలైటీస్ (spondylitis) ల నుంచి కోలుకున్న మరొక రోగి ఇతనికి ఈ వైద్యం సూచించాడు.  

ఈ క్రింది వైద్యం జరిగింది.

#1. CC10.1 Emergencies… 2 రోజూల పాటు గంటకు 3 సార్లు                                        

ఆ తరువాత క్రింది వైద్యాలు:

#2. CC4.1 Digestion tonic + CC4.10 Indigestion...TDS

#3. CC21.1 Skin tonic + CC21.3 Skin allergies + CC15.1 Mental & Emotional tonic + CC15.6 Sleep disorders...TDS

15 రోజులకు సెగ్గడ్డలు, మచ్చలు, దురద 50% కు తగ్గాయి. ఒక నెలకు పూర్తిగా పోయాయి. రోగి ఇప్పుడు సుఖంగా నిద్రపోతున్నాడు.

ఐదు నెలల తరువాత దగ్గు, జలుబులతో పాటు పాదాల మీద పగుళ్ళతో వచ్చాడు. క్రింది మందులు వాడాము:

#4. CC9.2 Infections acute + CC19.6 Cough chronic...6TD

#5. CC21.1 Skin tonic + CC21.3 Skin allergies + CC21.5 Dry Sores...TDS

వారం రోజులకు జలుబు దగ్గులు 100% పోయాయి. వాటితో పాటే పాదాల మీద పగుళ్ళు కూడా. అతను సుఖంగా ఉన్నాడు. ఇప్పుడు జీర్ణకోశ ఆమ్లాల ఉధృతికి వైద్యం కొనసాగింది.

#6. CC4.1 Digestion tonic + CC4.10 Indigestion + CC21.3 Skin allergies + CC15.1 Mental & Emotional tonic...BD

మార్చ్ 2014 నాటికి, రోగిలో 70% మెరుగుదల వచ్చి వైద్యాన్ని కొనసాగించుకుంటున్నాడు. తన చర్మం పూర్తిగా మామూలు స్థితికి వచ్చిందనీ, ఇంటి పనుల కోసం ప్రయాణాలు చేయగలననీ సంబర పడుతున్నాడు.