క్లిష్టమైనగర్భధారణ 11476...India
అక్టోబర్ 2012 లో 33 ఏళ్ల స్త్రీ అభ్యాసకుని వద్దకు చికిత్సకై వచ్చినది. ఆమె బిడ్డకోసం గత 7–8 ఏళ్లుగా ఆలోపతి చికిత్స పొందుతున్నను ఫలితం కలగలేదు. ఆమె తన హైపోథైరాయిడిజం (Hypothyroidism) కోసం (Thyronam25μg OD) అల్లోపతిమందు 2008 సం. నుండి మరియు మధుమేహం కొరకు 2005 సం. నుండి(CentapinXR tablet OD) తీసుకుంటోంది. ఆమెకు క్రింది రెమెడీ ఇవ్వబడింది:
#1. CC6.2 Hypothyroid + CC6.3 Diabetes + CC8.1 Female tonic + CC8.4 Ovaries & Uterus...TDS
పై పరిహారం తీసుకున్న 10 రోజులలో ఆమె గర్భవతి అయ్యింది. ఆమె తన మధుమేహం, థైరాయిడ్ కారణంగా, ఆమె శిశువు యొక్క భద్రత గురించి ఆందోళన చెందుతున్నది, కనుక అభ్యాసకుడు తన పరిహారంను క్రింది విధంగా మార్చాడు:
#2. CC6.2 Hypothyroid + CC6.3 Diabetes + CC8.2 Pregnancy tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic...TDS
రోగి యొక్క ఆందోళనవల్ల, అభ్యాసకులు ఆమె గర్భవతిగా వున్నన్నాళ్లు, ఆమెను పర్యవేక్షిస్తూనే వున్నారు. ఈ సమయంలో రోగి జాగ్రత్తగా తన చక్కెర మరియు థైరాయిడ్ స్థాయిలు పరిశీలించిరి. గర్భం దాల్చిన 5వనెలనుండి, రోగి మధుమేహం కోసం ఇన్సులిన్ పంపు నుండి ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకుంటూ, తన హైపోథైరాయిడ్ మందులను 50μg ODకు పెంచిరి. రోగి గర్భవతిగా వున్నన్నాళ్లే కాక, ప్రసవమైన నెలవరకు కూడా తన విబ్రియోనిక్స్ చికిత్సను కొనసాగించిరి.
2012 జూలై 17 న, ఆమెకు 2.4 కేజీ ల బరువుతో ఆరోగ్యమైన కుమార్తె, సి-సెక్షన్ ఆపరేషన్ చేయగా కలిగింది. తల్లిపాలే బిడ్డ త్రాగినది. బిడ్డ పుట్టిన తరువాత, ఆమె మధుమేహం పూర్తిగా తగ్గింది మరియు ఆమె థైరాయిడ్ స్థాయి, తైరోనార్మ్ 25 μg వద్ద మునుపటి వలె సాదారణ స్తాయిలో ఉండసాగింది.