పిరుదులమీద కురుపులు 11210...India
ఒక 50ఏళ్ల వ్యక్తి తన పిరుదులపై వచ్చిన కురుపులవల్ల, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. కురుపులు ఒక్కొక్కటిగా వస్తూ, వాచి, చీముపట్టి, చితికిపోతున్నవి. కాని కొత్తవి వస్తూనే వున్నవి. కొన్ని శస్త్రచికిత్స ద్వారా 2సార్లు తొలగించిరి. రోగికి మొదటగా క్రింది రెమెడీ ఇవ్వబడింది:
#1. CC12.1 Adult tonic + CC21.2 Skin infections...TDS
1వ నెలలో 20% మెరుగైంది. కురుపుల సంఖ్య తగ్గింది, కాని మిగిలినవి తీవ్రంగా సలుపుతున్నవి. ఈ కాంబో మార్చబడింది:
#2 CC15.1 Mental & Emotional tonic + CC21.1 Skin tonic + CC21.11 Wounds & Abrasions.
2 నెలల్లో 50% మెరుగుదల ఉంది. పైన చెప్పిన పరిహారం, 6 నెలలకు అనగా క్రమంగా రోగి కురుపులన్నీ పూర్తిగా తగ్గి, కూర్చొని సుఖంగా పని చేసుకోగలిగేవరకు ఇవ్వబడింది. అప్పుడు మోతాదు ODకు తగ్గించబడింది. తరువాత మరల కురుపులు తిరిగిరాకుండా నివారించడానికి, మోతాదు 2TWకు మరింత తగ్గించబడింది.
సంపాదకుని వ్యాఖ్యానం:
కురుపులు శరీరంలో చేరిన విషపరిస్థితికి సంకేతం, అందువల్ల CC17.2 శుభ్రపరచుటకు యిచ్చి, అట్లే రోగి తీసుకొను ఆహారం సక్రమంగా వుండేలా చూచుట, మరియు రోగి చుట్టూవుండే వాతావరణంలో వుండే విషవాయువు అతను శ్వాసతో పీల్చటం వంటి కారణాలు కూడా ఉన్నాయా లేవా అని గమనించి జాగ్రత్త తీసుకోవాలి.