చేతులమీద కాలిన గాయాలు 11520...India
డిసెంబరు 2013 లో 53 ఏళ్ల వ్యక్తి రెండుచేతుల్లో కరిగిన ప్లాస్టిక్ కర్ర వలన, కలిగిన రెండో డిగ్రీ కాలిన గాయాలతో అభ్యాసకుని వద్దకు వచ్చేడు. అతనికి చాలా నొప్పిగా వున్నది. అరచేతులు ఎర్రగా, బొబ్బలెక్కి ఉన్నవి. వాపు వలన అతను అరచేతులను, వేళ్ళను కదల్చలేక, తన రోజువారీ పనిని చేసుకోలేక, తన దుస్తులను మార్చుకోలేక బాధపడుతున్నాడు. రోగి చాలా పేదవాడు కనుక అల్లోపతి చికిత్స పొందలేడు. చన్నీళ్ళలో తనచేతులు ఉంచడం మాత్రమే అతనికి సాధ్యమైన పరిహారం. అతనికి క్రింది రెమెడీ ఇవ్వబడింది:
CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC14.1 Male tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.1 SMJ tonic + CC21.1 Skin tonic + CC21.4 Stings & Bites + CC21.11 Wounds & Abrasions…6TD
8రోజుల్లో రోగిలక్షణాలు 50% వరకు మెరుగైనవి. అరచేతుల వాపు పోయింది. అతను నొప్పితగ్గి, నెమ్మదిగా తనవేళ్లు కదలిస్తున్నాడు. అప్పుడు మోతాదు 6TDనుండి TDS వరకు తగ్గించిరి. 7రోజుల తర్వాత 100% మెరుగైంది. అరచేతులపై చర్మం మునుపటి వలె ఆరోగ్యంగా తయారైపోయింది. రోగి తన దైనందిన కార్యక్రమాలను, పనులను తిరిగి ప్రారంభించాడు. కాలిన గాయాలన్నీ మొత్తం 15 రోజుల్లో పూర్తిగా నయం చేయబడ్డాయి.