మధుమేహం, అధికరక్తపోటు & మానసికంగా నిరాశ 10001...India
మే 2008 లో, ప్రాక్టీషనర్ యొక్క దూరపు బంధువైన, 52 సం.ల. ఒక స్త్రీ రోగి, మధుమేహం మరియు అధిక రక్తపోటుకోసం చికిత్స కోరింది. ఆమెకు 10 ఏళ్ల క్రితమే మధుమేహం వున్నట్లు కనుగొనిరి. ఆమె ఇప్పుడు ఇన్సులిన్ మీద ఆధారపడుతోంది. ఆమె ప్రతి రోజు, రెండు పూటలా భోజనం ముందు 15 యూనిట్లు ఇన్సులిన్ తీసుకుంటున్నది. దీనివల్ల ఆమె (రాండమ్) రక్తoలోచక్కెర 150 లో వున్నది. అంతేకాక, ఆమె 3 సం.లుగా అధిక రక్తపోటు కోసం అలోపతిమందు, బలహీనతకోసం మరొక మందు తీసుకుంటున్నది. రోగి చాలా నిరాశతో (ఆందోళనగా, బద్దకంగా, ఆత్మవిశ్వాసం కోల్పోయి) వున్నను, కొన్నినెలలుగా ఈ లక్షణాలకోసం చికిత్స తీసుకోలేదు. ఆమెకు క్రింది నివారణలు ఇవ్వబడ్డాయి:
#1.CC6.3 Diabetes…OD half an hour after lunch
#2. CC3.3 High Blood Pressure + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic ...TDS
వైబ్రియోనిక్స్ తో, రోగి మధుమేహంలో స్థిరమైన మెరుగుదల కలిగింది. ఆమె సగటున ప్రతి 15 రోజులకు 2 యూనిట్లు చొప్పున ఇన్సులిన్ మోతాదు తగ్గించగలిగింది. ఒక సంవత్సరం తర్వాత, ఆమె డాక్టర్ ఇన్సులిన్ ను నిలిపివేసి, నోటితో తీసుకొనే మందులను వాడమని సూచించారు. వీటితో కూడా ఆమె రక్తపు చక్కెర శాతం సాధారణ స్తాయిలోనే ఉండసాగింది.
అలాగే విబ్రియోనిక్స్ వాడిన నెల తర్వాత, ఆమె రక్తపోటు సాధారణ స్తాయికి చేరుకొన్నది, కనుక డాక్టర్ క్రమంగా ఆమె మందులను తగ్గించసాగేరు, ఆమెలో నిరాశ, నిస్పృహ తగ్గినట్లు, ఆమె నివేదించింది. ఆమె బలంగా, నూతనోత్సాహంతో తయారైంది. అయినప్పటికి విబ్రియోనిక్స్ ప్రారంభించిన కొన్నాళ్లలోనే, ఆమెకు వెన్ను నొప్పి మొదలైంది. చాలాకాలం క్రితం ఆమె వెన్ను నొప్పితో బాధపడ్డది. మళ్ళీ యిప్పుడీ చికిత్స సమయంలో తిరిగి వచ్చింది. ఆమెకు క్రింది పరిహారం ఇచ్చిరి:
#3. CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.5 Spine...TDS
రోగి ఒకనెల తర్వాత వెన్ను నొప్పి పూర్తిగా తగ్గినట్లు చెప్పుటచే, మోతాదు BD కి తగ్గించబడింది. ఒక సం.రం తరువాత, రోగి కింది పరిహారములను తీసుకుంటున్నది:
#1. పైన చెప్పిన ప్రకారం మరియు,
#4. CC3.3 High Blood Pressure + 12.1 Adult tonic...TDS
ఆమె మందులు ఆపేముందు, 2వ సంవత్సరం చికిత్స తీసుకున్నది. మొత్తం మీద, ఆమె మధుమేహం కోసం తీసుకునే అలోపతి మందులను 80% తగ్గించి, ఆమె రక్తపోటుమందులను నిలిపివేసింది. ఆమె మానసిక నిరాశ, వెన్నునొప్పి పూర్తిగా తగ్గినవి. ఆమె డాక్టర్, రోగి ఆరోగ్యమునకు కేవలం విబ్రియోనిక్స్ మందులు మాత్రమే కారణమని అంగీకరించిరి.