Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

శ్వాసకోశ, సైనస్ & గొంతు ఇన్ఫెక్షన్ 01176...Bosnia


75 సంవత్సరాల మహిళ తీవ్రమైన గొంతు నొప్పి దుర్భరమైన దగ్గు మరియు ఎర్రబడిన సైనస్ నిమిత్తం అభ్యాసకుని వద్దకు వచ్చారు. గత ఎన్నో రోజులుగా ఆమెకు ఈ లక్షణాలు ఉన్నాయి. ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:

#1. NM36 War + NM70 CB9 + NM71 CCA + NM113 Inflammation…TDS

#2. SM26 Immunity + SM27 Infection + SM31 Lung & Chest + SM35 Sinus + SM40 Throat…TDS

వారం తర్వాత ఆమెకు కేవలం 20 శాతం ఉపశమనం కనిపించింది. కనుక అంతకుముందు మరి ఏదైనా అనారోగ్యం ఉందా అని అభ్యాసకుడు ఆమెను అడిగారు. రోగికి 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు స్కాబీస్(గజ్జి) ఉందని, గత 40 ఏళ్లుగా క్రమం తప్పకుండా బ్రాంఖైటిస్ వస్తూ ఉంటుందని, సైనస్ సమస్య 20 సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యాయని ఆమె చెప్పారు. అనారోగ్య పరిస్థితుల్లో అలోపతి వైద్యులు ఆమెకు అనేక రకాల యాంటీ బయోటిక్స్ ఇచ్చారు. వీటిలో చాలా రకాల మందుల వలన ఆమెకు  అలర్జిక్ ప్రతి చర్యలు (రియాక్షన్స్)కూడా ఉండేవి. ఈ కారణంగా ఆమె వైబ్రియానిక్స్  చికిత్స తీసుకోవడానికి సన్నద్ధమయ్యారు.

గతంలో తీసుకున్న రెండు రెమిడీలు రోగికి పెద్దగా సహాయం చేయకపోవడం మరియు ఆమె సమస్యలు గజ్జి (చర్మవ్యాధి) తో ప్రారంభం కావడం కారణంగా ఆమెకు సోరినం మియాజం ఇవ్వబడింది:  

  1. SR250 Psorinum 10M, 1M, 200C, 30C and 6Cఒక్కొక్క పొటెన్సీ కి ఒక్క క్క మోతాదు చొప్పున 1 గంట వ్యవధిలో 10M ఎక్కువ పోటెన్సీ తో ప్రారంభించి క్రమం గా తగ్గించుకుంటూ రావటం

ఒకరోజు తర్వాత లక్షణాలు తీవ్రం అయ్యాయి కానీ తర్వాత రెండు రోజులలో ఆమెకు పూర్తిగా తగ్గిపోయింది. మూడు రోజుల తర్వాత ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:   

  1. SR294 Hepar Sulph 10M, 1M, 200C, 30C, and 6C  పైన పేర్కొన్న విధంగానే ఒక్కొక్క పొటెన్సీకి ఒక మోతాదు మాత్రమే

రెండు రోజుల తర్వాత క్రింది రెమిడీ ఇవ్వబడింది: 

    3. SR318 Thuja 10M, 1M, 200C, 30C మరియు 6C పైన పేర్కొన్న విధంగానే దీనిని కూడా తీసుకోవాలి. ఐదు రోజుల తర్వాత ఆమెకు చాలా మెరుగ్గా అనిపించింది. దాదాపుగా దగ్గు తగ్గిపోయింది. గొంతు నొప్పి కూడా లేదు. సైనస్ బ్లాక్ అవడం కూడా తగ్గిపోయింది. ఊపిరితిత్తుల నుండి పిల్లికూతలు వంటివి కూడా వేగంగా తగ్గిపోయాయి. మరో వారంలో ఆమె 90 శాతం కంటే ఎక్కువగా స్వస్థత పొందారు.