కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ 11476...India
46 ఏళ్ల మహిళకు కంప్యూటర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల కార్పల్ టన్నెల్ సిండ్రోమ్(ప్రధాన నరము ప్రెస్ అవడం వలన మణికట్టువద్ద ఏర్పడే నొప్పి) వ్యాధి ఏర్పడింది. నాలుగు నెలలుగా ఆమెకు మడి కట్టు చేతులు మరియు వేళ్లలో నొప్పి బాగా ఉంది. మణికట్టు నొప్పి చాలా తీవ్రంగా ఉండడంతో దానితో సరళమైన పనులను చేయడంలో కూడా ఆమె ఇబ్బంది పడుతున్నారు. ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది. ఐతే ఆమెకు మధుమేహం కూడా ఉండడంతో దానికోసం కాంబో చేర్చబడింది.
CC6.3 Diabetes + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis…TDS
ఆమెకు క్రమంగా నొప్పి తగ్గిపోయే వరకూ మూడు నాలుగు వారాలు పై రెమిడీ తీసుకున్నారు. ఆమె కంప్యూటరుతో పని చేయడం కొనసాగిస్తున్నప్పటికీ నొప్పి తిరిగి రాలేదు.