సంతాన లేమి కేసులు 10717...India
నేను వంధ్యత్వానికి (సంతాన లేమి) సంబంధించి చాల కేసులను చేశాను. సెప్టెంబర్ 9, 2009 న నాతొలి రోగిగా ఒక గృహిణి వచ్చింది. ఆమె భర్త డ్రైవర్. ఈజంటకు వివాహమై 10సం.లు. ఐనా పిల్లలు లేరు. గత 5సం.లుగా వారు వివిధ గైనకాలజిస్ట్ ల వద్ద చికిత్సపొందిరి. కాని ఫలితం లేకపోవుటవల్ల, వారు నిరాశకు గురయ్యారు. నా హృదయపులోతునుండి స్వామిని, 'వారికొక బిడ్డను ప్రసాదించమని' ప్రార్థించాను.
నేను రెండు మిశ్రమాలు తయారుచేసాను. భార్యకు ఒక మందు మిశ్రమం:
#1. CC8.2. Pregnancy tonic…TDS
భర్తకు మరొకటి:
#2. CC14.3 Male infertility...TDS
పై రెమెడీలతో పాటు నేను ఒక లీటరు నీటిలో 2 చుక్కల CC10.1 Emergencies కలిపి, వారిద్దరిని విబ్రియో వైద్యం ప్రారంబించే మొదటి రోజు రోజు ఉదయాన్నే ఈ రెమెడీని ½ కప్ తీసుకోమని ఆ తరువాత వారి సంబందిత రెమెడీలను తీసుకోమని చెప్పాను. ఆ విధంగా వారు సెప్టెంబర్10 న విబ్రియోనిక్స్ ప్రారంభించి, 4నెలలు కొనసాగించేరు. జనవరి 2010 మధ్యలో, ఆ స్త్రీ సంతోషంగా, ఆనందభాష్పాలతో, నావద్దకు వచ్చి, కుటుంబవైద్యులు, ఆమెను 2నెలల గర్భవతని ధ్రువీకరించినట్లు చెప్పింది. నేను ఆమెను ప్రసవమయ్యే వరకు :#1 ...BD గర్బాస్రావాన్ని నివారించుటకు వాడమని చెప్పితిని. స్వామి దయవలన, ఆమె సురక్షితంగా, ఆరోగ్యమైన కుమార్తెని ఆగష్టు 27, 2010 ప్రసవించినది.
ఈమె ఒక చిన్నవూరినుండి కావటంవల్ల ఈవార్త త్వరగా వ్యాప్తి చెందినది. ఈమె కేసు సంతోషకరమైన ఫలితం పొందిన తెలిసి, కడుపు పండని అనేక జంటలు ఆమెను కలుసుకున్నారు. వారంతా నా చిరునామా తెలుసుకొని నన్ను సంప్రదించిరి. అలాంటి 12 కేసులకు నేను చికిత్స ప్రారంభించాను. వానిలో 4 కేసులు విజయం సాధించాయి.
అక్టోబర్ 8, 2010 న, ముందటి జంటకు బిడ్డ జన్మించిన 6వారాలకు, చికిత్సకోసం 29సం.ల. మహిళ నా వద్దకు వచ్చింది. ఆమె ఒక నర్సు. ఆమె ఒక పెయింటర్ ని 8 సం.ల క్రితం పెళ్లి చేసుకున్నది. ఆమె భర్త మితిమీరిన మద్యపానంతో, బలహీనమైనాడు. కానీ మొండిగా వైద్యుడివద్దకు వెళ్ళడానికి నిరాకరించేవాడు. ఆకారణంగా సంతానంలేక ఆమె నిరాశకు గురైంది. ఈ కేసుకోసం స్వామిని నేను ప్రార్థించాను. నేను మహిళ కోసం #1 ...TDS మరియు ఆమె భర్త కోసం #2 ... TDS తయారు చేసాను.
భర్త యొక్క మద్యపానం మానిపించుటకు, నేను లీటరు నీటిలో CC15.3 Addiction మందు 3 చుక్కలను కలిపి సిద్ధం చేసాను. ప్రతిరోజు ఉదయం పైన యిచ్చిన మందు నీటిని 10 మి.మీ. తన భర్తకి #2...TDS మొదలెట్టేలోగా ఇవ్వమని ఆ మహిళకు ఆదేశించాను. ఈజంట అక్టోబరు 9 న చికిత్స ప్రారంభించారు. ఆరునెలల్లో ఆమెభర్త మద్యపానం 90% తగ్గి, ఏప్రిల్ చివరికి ఆమెలో గర్భవతి లక్షణాలు కనిపించాయి. ఆమె గర్భనిర్ధారణ తర్వాత, భార్య #1...TDS కొనసాగించబడిoది. భర్త యొక్క మందు CC15.3 Addiction…TDS కు మార్చబడింది. వారికి చక్కని కుమార్తె డిసెంబర్ 24, 2011 న జన్మించింది. బిడ్డ కలగడమే కాక, ఆమె భర్త ముఖ్య సందర్భాలలో తప్ప మద్యం పూర్తిగా మానేసాడు. బిడ్డ పుట్టిన దగ్గరనుండి అతను చాలా సంతోషంగా వున్నాడు. ఈవిధంగా స్వామి ఆ జంటను దీవించారు.
అక్టోబర్15, 2010, పైన పేర్కొన్న మహిళ తన సమస్యతో నావద్దకు వచ్చిన వారంతర్వాత, మరొక జంట నన్ను చూడడానికి వచ్చారు. 36సం.ల. భార్య, 38సం.ల. భర్త, వారి పెళ్ళైన 14 సం.లలో సంతానంకోసం అనేక అలోపతి మందులు వాడారు. ఆ స్త్రీకి 24సం.లకి, 28సం.ల.కి 2 గర్భస్రావాలు జరిగినవి. నేను భార్యకు: #1...TDS / భర్తకు #2...TDS యిచ్చితిని.
నవంబర్ 2011 చివరివారంలో సంవత్సరంపైగా చికిత్స పొందేక, భర్త వచ్చి, తనభార్య గర్భవతిగా ఉందనే శుభవార్త చెప్పారు. నేను ఆమెను ప్రసవం వరకు #1...TDS ను కొనసాగించమన్నాను. అంతా బాగా జరిగిందనుకుంటే ప్రసవసమయంలో బొడ్డుత్రాడు మెడకు చుట్టుకొని శిశువు బ్రతకలేదు. ఈ విషాదం స్వామికి తెలుసు.
జనవరి 22, 2014న 33ఏళ్ల మహిళ సంతానంకోసం నావద్దకు వచ్చింది. ఆమె 42సం.ల.భర్త లైంగికసమస్యలతో బాధపడుచున్నాడు. తను భావప్రాప్తి మరియు రతి సమయమున వీర్య స్కలనం చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. దానివల్ల దాంపత్యసుఖం కొరవడినప్పటికీ, సిగ్గువల్ల వైద్యునివద్దకు వెళ్లలేదు. ఒక వైద్యుడు అతని వీర్యం బాగా చిక్కగా వుండుటవలన వీర్యస్కలనం జరగటం లేదని అందువలన బిడ్డలు కలిగే మార్గం లేదని చెప్పటంతో, అతను న్యూనతభావంతో బాధపడుతూ లైంగిక సంపర్కమే మానేసాడు. తనకీజన్మలో పిల్లలు కలగరని ఆమె నావద్దకు వచ్చి ఏడ్చింది. నేను ఆమెను ప్రేమతో ఓదార్చి, దేవునిదయవుంటే అన్నీ సాధ్యమేనని ధైర్యం చెప్పాను.
ఆమెభర్తకొరకు 2మందులు సిద్ధం చేశాను. భర్త యొక్క భావోద్వేగ నియంత్రణకు, 1 లీటరు నీటిలో, 3చుక్కల CC15.1 Mental & Emotional tonic కలిపి సిద్ధం చేసాను. ప్రతి ఉదయం 10 మి.మీ. మిశ్రమాన్ని ఇవ్వమని, తరువాత CC14.1 Male tonic + CC14.3 Male infertility...TDS ఇవ్వమని ఆమహిళకు చెప్పేను. 2నెలల చికిత్స తర్వాత, తన భర్త రతిపట్ల ఆసక్తి చూపుతున్నాడని ఆమె చెప్పింది. వీర్యస్కలనం కూడా కొంత వరకు జరుగుతోంది. 6నెలల చికిత్స తర్వాత, జూలై 17న, ఆమె గర్భవతిగా ఉన్న వార్తను ఆనందంగా చెప్పింది. ఆమె భర్త కూడా నాకు కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబరు 2014 లో బిడ్డ జన్మిస్తుందని భావిస్తున్నారు. అయితే భర్త తన వైబ్రియోనిక్స్ మందులను నిలిపివేశారు. కానీ భార్య "మా భౌతిక సంబంధాన్ని పక్కనబెట్టితే, నా భర్త చాలా సంతోషంగా ఉన్నారు. అతని యొక్క సహకారం, ఆనందం నాకు చాలు. అంతేకాక నేను బిడ్డను పొందుతున్నాను, అది దేవుని కృప. అంతే నాకు చాలు." అన్నది.
జనవరి 28, 2014న మరొక పిల్లల్లేని జంట, 28సం.ల భార్య, 35సం.ల. భర్త నావద్దకు వచ్చారు. భర్త క్షురకుడు, భార్య గృహిణి. పేదరికం వల్ల వారు వైద్యునివద్దకు వెళ్లలేదు. వారు 7సం.లుగా దేవుని నమ్మి, దేవుడే పిల్లలను ప్రసాదిస్తాడని ఎదురుచూసేరు. కాని క్రమంగా వారి విశ్వాసం చెదిరి, విబృయోనిక్స్ కొరకు వచ్చిరి. నేను ఆమెకు: #1...TDS ఇచ్చి, భర్తకు: #2 ...TDS యిచ్చేను. 4నెలల చికిత్స తర్వాత, ఆమహిళ గర్భవతి అయి, ప్రసవం వరకు: # 1 ... TDS ని కొనసాగిస్తోంది. 2015 జనవరిలో రాబోయే బిడ్డకోసం సంతోషంతో ఎదురుచూస్తున్నారు.
నేను మా కుటుంబంలోని పెంపుడు పిల్లి కేసుతో ముగిస్తాను. డిసెంబరు 2011 లో, 1½ సం.ల మా పిల్లి గర్భం దాల్చింది. కడుపు పెద్దదై, బాగా నిద్రపోతూ ఉండేది. ఒకరోజు ఉదయం తను మూలుగుతూ తిండి మానేసింది. నేను తను ఆ రోజు ప్రసవిస్తుందేమోనని భావించాను. 2 రోజులు గడిచినా, పిల్లి అరుస్తూ, పాలుతప్ప వేరేమీ తీసుకోడంలేదు. మేము నిస్సహాయంగా బాధపడ్డాము. అప్పుడు నేను ఒక ప్లాస్టిక్ గిన్నెలో 30మి.లీ పాలలో, ఒకచుక్క CC10.1 Emergencies వేసి, కాస్త విభూతిని జోడించాను. ఆమె బాధ నివారణకై స్వామిని ప్రార్ధించేను. పిల్లి ఆపాలు తాగింది మరియు 2గంటల్లో, 3 అందమైన పిల్లులకు జన్మనిచ్చింది.