డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
Vol 2 సంచిక 1
January 2011
ప్రియమైన అభ్యాసకులకు,
మన రెండవ వార్తలేఖ కూడా అత్యంత ప్రజాదరణ పొంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన అభ్యాసకులచే ఉత్సాహంగా చదవబడినదని తెలియచేయుటకు నేను చాల సంతోషించుచున్నాను. 108 cc బాక్స్తో నయం చేయబడ్డ రోగుల వివరాలు తెలుసుకుని గతంలో 108 బాక్స్లేకుండా తర్ఫీదు పొందిన పూర్వఅభ్యాసకులు 108 బాక్స్కొరకు కొన్నినెల్లలుగా మా దగ్గరకు వస్తున్నారు!
ప్రశాంతి నిలయం గత కొన్నినెలలుగా స్వామి యొక్క 85 వపుట్టినరోజు మరియు క్రిస్మస్వేడుకలుతో చాలా సందడిగా ఉంది. ఆశ్రమమును సందర్సించుచున్న భక్తులు రోగులు మాత్రమే కాకుండా వైబ్రియోనిక్స్నేర్చుకోవాలని ఉత్సాహపడుతున్నఎందరో భక్తులు స్థిరమైన ప్రవాహంలా మమ్మల్నిసంప్రదించారు. మీరు వైబ్రియోనిక్స్(Vibrionics) ఉపయోగించి సాదించిన అత్యుతమ ఫలితాలను అసాదారణ రోగనివారణులను వినడానికి మాకు చాలా అద్బుతంగాఉంది. కేవలం ఒక చిన్నవిన్నపము - మీ యొక్క కేసు నివేదికలను మాకు రాసిపంపినచో వాటిని తదుపరి వార్తలేఖలలో ప్రచురించినచో అవి ఇతర వైద్యులకు అపారమైన విలువ మరియు చాలా ఉపయోగకరంగా ఉండగలదు.
జన్మదిన వేడుకల సందర్భంగా ఇక్కడ పుట్టపర్తిలో మా అభ్యాసకులు ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్వద్ద ఒక తొమ్మిది రోజుల పాటు సాయి వైబ్రియోనిక్స్వైద్యశిబిరం నిర్వహించారు. ఈ ప్రత్యేక బృందం ఉదయం ఏడు నుండి మొదలై సాయంత్రం చీకటి పడేవరకు రోజుకు 500 రోగులు సగటున అంకితభావంతో తమ సేవలందించారు.
21 నవంబర్రాత్రి సుమారు 9 గంటలకు ఇక క్యాంపు ముగుస్తుందనగా, అత్యద్బుతంగాఒకఅభ్యాసకుని 108cc బాక్స్లోస్వామి ఫోటోపైన విభూతి రాలి వుండడం చూసి( క్రిందచుడండి)మొత్తం టీం అంతా చాలా సంతోషించారు. భగవంతుని దైవికమైన దీవెనలు విభూతిరూపంలో !!! ఎంత కరుణామయుడో స్వామి, తాను ఈ మొత్తం పనిలో మన మధ్యే ఉంటూ - మనల్నిదీవిస్తూ, మార్గదర్సకంచేస్తూ, ప్రోత్సహిస్తూ, అభయమిస్తూ, మనం చేసేపనంతా తన పనే అని నిరూపించారు. మేము ఎల్లప్పుడూ మీనుంచి వినడానికిఎదురుచూస్తుంటాము – వార్తాలేఖల మీద మీ అబిప్రాయంకోసం, భవిష్యత్తు సమస్యల కోసం సూచనలు, మీ నెల వారీ నివేదికలు మరియు మరింత ఆసక్తికరమైన మరియు ఉత్తేజకరమైన కేసు చరిత్రలు కోసం. వీటి కోసం కొన్ని నిమషముల సమయం కేటాయించి మాకు ఈమెయిలు పంపండి. ప్రస్తుత వార్తలేఖను ఆస్వాదిస్తూ, స్వామి యొక్క నిరంతర కృపతో వ్యాదులను నయం చెయ్యడం అనే గొప్ప కార్యమును చేస్తూనే ఉండండి.
సాయి సేవలో,
జిత్. కే. అగ్గర్వాల్.