అదనంగా
Vol 1 సంచిక 1
September 2010
ఆరోగ్య చిట్కాలు
మీరు భోజనం చేసిన తర్వాత చల్లని పానీయాలు తీసుకోవడం ఇష్టపడతారా? ఆహారం తీసుకున్న తర్వాత చల్లని నీరు లేదా పానీయాలు తాగడం ఆరోగ్యానికి హానికరం. ఆహారం తర్వాత తీసుకున్న చల్లని పానీయాలు మనం తీసుకున్న ఆహారంలో ఉన్న నునె పదార్థాలను గట్టి పరచి జీర్ణ క్రియ వేగంను తగ్గిస్తాయి. ఈ విధంగా గట్టి పడిన పదార్థాలు మన కడుపులో ఉన్న "ఆసిడ్"(ఆమ్లం) తో చేరి విచ్ఛిన్నం చేయబడుతాయి. ఈ ప్రక్రియ తర్వాత పేగులు ఈ పదార్థాలను పీల్చుకుంటాయి.ఇలా పీల్చబడ్డ పదార్థాలు పేగులో ఒక పూత వలె ఏర్పడి ఆపై క్యాన్సర్ కు దారితీస్తాయి. ఆహారం తీసుకున్న తర్వాత వెచ్చని నీరు లేదా సూప్ తాగడం మంచిది. చైనా మరియు జపాన్ దేశాలకు చెందిన వారు ఆహారం తీసుకునే సమయం లో వేడిగా టీ తాగుతారు, చల్లని పానీయాలు తాగరు. మనము కూడా ఈ పద్ధతిని పాటిస్తే భాగుంటుంది.
గుండె పోటులు గురుంచి ఒక ముఖ్యమైన గమనిక: కేవలం ఎడమ చేతిలో నొప్పి మాత్రమే గుండె పోటు లక్షణమని అనుకోవడం తప్పు. గుండె పోటు మొదటి సారిగా వచ్చినప్పుడు గుండెలో నొప్పి రాకపోవచ్చు. వికారం మరియు తీవ్రంగా చమట పట్టడం వంటి లక్షణాలు కూడా సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి.తీవ్ర దవడ నొప్పి కలుగియుంటే జాగ్రత వహించాలి. గుండె పోటు వచ్చిన వ్యక్తులలో 60% మంది నిద్రనుండి మేలుకోరు. ఈ లక్షణాలను మనమందరు తెలుసుకోవడం ఎంతో మంచిది.
వైబ్రియానిక్స్ వార్తాలేఖను అందుకోవాలని కోరుకుంటున్న అభ్యాసకులు ఈ ఇ-మెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి: [email protected]
మా వెబ్సైట్ www.vibrionics.org ను సంప్రదించండి.
స్వామీ ఆశిర్వధించిన వైబ్రియానిక్స్ కేకు, గురు పూర్ణిమ - 25 జూలై 2010
వరుసగా మూడవ సంవత్సరం, పవిత్రమైన గురు పూర్ణిమ రోజున, స్వామీ చరణాలకు సాయి వైబ్రియానిక్స్ కేక్ ను సమర్పించుకునే సువర్ణ అవకాశాన్ని ప్రసాదించి, మన వైబ్రియానిక్స్ టీంకు దీవెనలను అందించారు.
జూలై నెల ప్రారంభంలో జపాన్ నుండి వైబ్రియానిక్స్ అభ్యాసకుల టీం ఒకటి గురు పూర్ణిమ వేడుకలలో పాల్గొనే నిమిత్తమై పర్తి చేరుకుంది. ఇతర వాలంటీర్ల సహాయంతో ,15,000 ప్రసాదం పొట్లాలు ఈ టీం తయారు చేసింది. గ్రీసు దేశానికి చెందిన భక్తులు సాయి వై బ్రియానిక్స్ కేక్ ను తయారు చేసారు. ఈ ప్రసాదాన్ని గురు పూర్ణిమ కు ముందు రోజు, స్వామీ సాయి కుల్వంత్ హాలులో ఉన్న భక్తులందరికీ పంచమని చెప్పడంతో, మన వైబ్రియానిక్స్ టీంకు చాలా ఆనందం కలిగింది.
గురు పూర్ణిమ నాడు మధ్యాహ్నం, భక్తులు మరియు విద్యార్థులు గురు భజనలు పాడుతుండగా స్వామీ సాయి కుల్వంత్ హాలుకు వచ్చారు. స్వామీ వరండా దెగ్గరకు వస్తుండగా వైబ్రియానిక్స్ టీం స్వామికి వినమ్రతతో ఒక గులాబి పువ్వును సమర్పించింది. గులాబి పువ్వును తీసుకోవడమే కాకుండా , ఒక వైబ్రియానిక్స్ అభ్యాసకుడు తయారు చేసిన, పువ్వు ఆకారంలో ఉన్న ఒక కొవ్వొత్తిని వెలిగించి, తమ దివ్య హస్తాలతో స్వామీ వైబ్రియానిక్స్ కేక్ ను కూడా కట్ చేసారు. సంగీత కార్యక్రమము ముగిసిన తర్వాత స్వామీ ప్రసాదాన్ని కళాకారులకు పంచమని చెప్పడంతో, మా అందరికి ఎంతోఉత్సాహం కలిగింది.
విజయవంతంగా వైబ్రియానిక్స్ సాధన చేసేందుకు కావలసినవి
వైబ్రియానిక్స్ పేషంట్ల నుండి అద్భుతమైన స్పందన లభిస్తున్నప్పటికీ, ఒకటే రోగ సమస్య ఉన్న అనేక పేషంట్లు, ఒకటే మందుకు అనేక విధాలుగా స్పందించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొన్ని సందర్భాలలో ఒక అభ్యాసకుడిచ్చిన మందు సఫలితాలను అందించడం, అదే మందును మరొక అభ్యాసకుడు ఇచ్చినప్పుడు ఫలితం లేకపోవడం వంటివి గమనిస్తున్నాము.…
దీనికి అనేక కారణాలున్నాయి. అన్నిటికన్నా ప్రధానమైనది విశ్వాసం. పేషంట్లు కన్నా అధికంగా అభ్యాసకులు ఈ చికిత్సపై పూర్తి విశ్వాసం కలిగియుండడం చాలా అవసరం. అభ్యాసకులకు 108 కామన్ కాంబో బాక్సులో ఉన్న ప్రతియొక్క మందులో ఇమిడియున్న మన ప్రియమైన భగవాన్ యోక్క దివ్య శక్తిపై పూర్తి విశ్వాసం ఉండాలి. ప్రారంభం నుండి స్వామీ వైబ్రియానిక్స్ సేవకు తమ దీవెనలను ఎంతగానో అందిస్తున్నారు. అనేక సందర్భాలలో స్వామీ, రోగులను నయం చేసే ప్రధాన కర్త తానే యని మనమందరు స్వామి యొక్క సాధనములు మాత్రమే యని చెప్పారు. ఈ 108 కామన్ బాక్సు తయారి వెనుక మరియు దీని ఉపయోగం వెనుక స్వామీ యొక్క దివ్య హస్తం తప్ప మరొకటి లేదని మనం గుర్తుంచుకోవాలి.
అభ్యాసకులందరు స్వామీ యొక్క సాధనములన్న విశ్వాసాన్ని కలిగియుండాలి. ఈ చికిత్సా విధానం పై పూర్తి విశ్వాసం కలిగియుండడంతో పాటు అభ్యాసకులు పేషంట్లను, త్వరలోనే వారు కోలుకుంటారని ప్రోత్సాహించడం కూడా ఎంతో ముఖ్యం. రోగ నివారణ కోసం ప్రార్థించిన ఒక వ్యక్తితో ఏసు క్రీస్తు " విశ్వాసం నిన్ను నయం చేసింది, వెళ్ళు" అన్న మాటలు మనందరికీ తెలుసు.
నివారణ ప్రక్రియలో మరో ముఖ్య అంశం ప్రేమ. అభ్యాసకులు ప్రేమతో తమ పేషంట్లతో మాట్లాడాలి. స్వామీ తమ దివ్యోపన్యాసాలలో రోగులకు ప్రేమతో చికిత్సను అందించడం వల్ల వాళ్లకు నివారణ మరింత త్వరగా లభిస్తుందని చెప్పారు. నిజం చెప్పాలంటే మందుల కన్నా మనమిచ్చే ప్రేమ రోగులను నయం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి యొక్క అభ్యాసకుడు తమ పేషంట్ల కొరకు ప్రేమతో ప్రార్థన చేయాలి. అహంకారం లేని స్వచ్చమైన ప్రేమ నిండియున్న సాధనములుగా ఉండడానికి మనం ప్రయత్నించాలి.
మూడవ అంశం నమ్మకం. పేషంట్లకు అవసరమైన మందులు వాళ్లకు ఇవ్వబడుతున్నాయన్న నమ్మకం ప్రతి యొక్క అభ్యాసకుడు కలిగియుండాలి.. మనమిచ్చిన మందులతో కొందరు పేషంట్లు పూర్తిగా నయమై పోతారు. అవే మందులతో మరి కొంధరకి నయం కాకపోవచ్చు. ఇలాంటి సందార్భాలలో మనం దైవం పై పూర్తి నమ్మకముంచడం ఎంతో ముఖ్యం. ఈ చికిత్స ద్వారా పేషంట్లకు శారీరికంగా మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.
"సాధ్యమైనంత వరకు మీరు చేయండి మిగతావి నేను చూసుకుంటాను" అని స్వామీ ఎన్నో సార్లు చెప్పారు. ఈ అద్భుతమైన సేవను విశ్వాసం, ప్రేమ మరియు నమ్మకంతో చేసి ఫలితాలను స్వామికి వదిలిపెట్టాలి.
జై సాయి రామ్