దివ్య వైద్యుడి యొక్క దివ్య వాక్కు
Vol 2 సంచిక 5
September 2011
“సాంకేతిక విజ్ఞానం ఎంతగానో వ్యాపించియున్న ఈ కాలంలో ప్రశాంతమైన జీవితం కష్టసాధ్యంగా మారిపోయింది. ప్రజలు వివిధ శారీరక మరియు మానసిక వ్యాధులకు గురియైపోతున్నారు. ఆధునిక మహానగరాలలో అనేకమంది సహజంగా నిద్రించే ఆనందాన్ని కోల్పోయారు. వారు నిద్ర మాత్రలు ఉపయోగించటం ద్వారా కృత్రిమ నిద్రను మాత్రమే అనుభవిస్తున్నారు. మందులను అధికంగా తీసుకోవటం కారణంగా గుండె మరియు రక్తపోటు సమస్యలు పెరిగిపోతున్నాయి. అనారోగ్యాల కారణంగా ప్రజలు భయాందోళనలతో జీవిస్తున్నారు. మందులు, మాత్రలు లక్షలకొద్ది ఉత్పత్తి చేయబడుతున్నాయి కాని ప్రజలలో ఆరోగ్య అభివృద్ధి కలగటంలేదు. నిజానికి కొత్త రకాల అనారోగ్యాలు ఉద్భవిస్తున్నాయి. తెలివిగల కొంత మంది మాత్రమే యోగా మరియు ఇతర ఆధ్యాత్మిక సాధనల యొక్క సమర్థతను గ్రహిస్తున్నారు. తమ సొంత అనుభవాల ద్వారా ఈ విషయాన్ని వారు నిర్ధారించారు.”
-సత్యసాయి వాహిని Ch 22: "నిత్య సత్యములు”
“మనం చేసే ప్రతియొక్క చర్యను దైవానికి నివేదనగా చేయాలి. సోమరితనము ఉండకూడదు. చేసే ప్రతి చర్య పవిత్రమైన ప్రేమ భావంతో చేయాలి. మీ శక్తి సామర్థ్యాలకు తగిన పనిని మీరు ఎన్నుకోవచ్చు. పవిత్రమైన చర్యలను చేయడంతో పాటు దివ్య నామస్మరణను కొనసాగించాలి. ఆధ్యాత్మిక సాధనను చేపట్టినప్పుడు అనేక అడ్డంకులు ఎదురవుతాయని అంటుంటారు. అడ్డంకులు ఎదురైనప్పుడు వాటిని పరీక్షలుగా భావించాలి. పరీక్షలు శిక్షించడానికి కాదు అభివృద్ధికి కావాల్సిన యోగ్యతను నిర్ధారణచేయడానికి మాత్రమేయని గుర్తించాలి. తరచుగా ఎదురయ్యే పరీక్షలు, అభివృద్ధికై తరచుగా మీకివ్వబడే అవకాశాలని అర్థం. పరీక్షల మధ్యలో పెద్ద కాలవ్యవధి ఉంటే కనుక, ఇంకా ఎక్కువ కాలం వరకు అభివృద్ధి చెందే అవకాశం లేదని అర్థం. ఆధ్యాత్మిక సాధనలో అడ్డంకులను ఇటువంటి స్పూర్తితో ఎదుర్కొని వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి.”
-సత్యసాయి బాబా, దివ్యోపన్యాసం, జూలై 7, 1985