డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
Vol 2 సంచిక 5
September 2011
ప్రియమైన చికిత్సా నిపుణులకు,
స్వామీ యొక్క దయతో, 108CC పెట్టె యొక్క నూతన ఉత్పతి సిద్ధమైందని తెలిస్తే మీరందరు ఎంతో సంతోషిస్తారు. చికిత్సా నిపుణుల నుండి మాకందిన ప్రతిపుష్టిల సహాయంతోను మరియు మూడు సంవత్సరాల పాటు జరుపబడిన విస్తృతమైన పరిశోధన యొక్క ఫలితంగాను, 108 మిశ్రమాలు సవరింపబడి 1,100 రకముల వ్యాధులకు సంభందించిన మందులు ఏర్పరచటం జరిగింది. 2011 ఆగస్ట్ 11న ఈ కొత్త పెట్టెను స్వామీ యొక్క దీవెనల కోసం, ప్రశాంతి మందిరంలో సమర్పించడం జరిగింది.
ఆగస్ట్ 16న భారతదేశం, జర్మనీ, ఇటలీ, పోలాండ్, రష్యా, UK మరియు USA కు చెందిన భక్తులైన కొందఱు చికిత్సా నిపుణులు, 108CC పెట్టెను స్వామికి సమర్పించడానికి మరియు కొత్త పెట్టెలో దివ్యశక్తిని నింపమని స్వామిని ప్రార్థించడానికి, ప్రధానకార్యాలయం(S4-B1,PN)లో గుమికూడారు(చిత్రం చూడండి). వేద పారాయణ తర్వాత, పోలాండ్కు చెందిన భక్తులు భావపూర్వకంగా భజనలు పాడారు. చివరిగా ఆగస్ట్ 17న, ఆశ్రమ అధికారుల అనుమతితో, భగవాన్ యొక్క మహాసమాధి వద్ద కొత్త పెట్టెను స్వామీ దీవెనల కోసం సమర్పించడం జరిగింది (చిత్రం చూడండి).
అక్తోబెర్ 6న విజయదశమి తర్వాత, ఈ కొత్త 108CC పెట్టె, చికిత్సా నిపుణులు తమ తమ మిశ్రమాల పెట్టెలను రీచార్జ్ చేసుకునేందుకు వీలుగా, ప్రధానకార్యాలయంలో లభిస్తుందని తెలియచేసుకుంటున్నాను. పూర్తిగా పునరీక్షించబడిన 108CC పుస్తకం కూడా అదే సమయంలో అందుభాటులో ఉంటుంది. ఈ నూతన 108 మిశ్రమాలు మరిన్ని వ్యాధి సమస్యలను నయంచేయడానికి సహాయపడతాయి కనుక, చికిత్సా నిపుణులు ప్రశాంతి నిలయాన్ని సందర్శించినప్పుడు, తమ మిశ్రమాల పెట్టెలను కొత్తగా పునరీక్షించ బడిన మిశ్రమాలతో రీచార్జ్ చేసుకునే అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము. స్వామీ యొక్క ఆశీశులతో, పునరీక్షించబడిన ఈ మిశ్రమాల ద్వారా మనం మరింత అధిక సంఖ్యలో రోగులకు నయంకావడానికి సహాయపడాలని, ఆ విధంగా సమాజానికి మరింత ఉన్నత రీతిలో సేవనంధించాలని ఆశిస్తున్నాము.
మన ప్రియమైన స్వామి తమ భౌతిక దేహాన్ని వదలి వెళ్ళిన ఈ భాదాకరమైన సమయంలో కూడా మీరందరు మరింత అంకిత భావంతో వైబ్రియానిక్స్ సేవను చేయటం చూసి నాకు చాలా ఉత్సాహంగా ఉంది. అవసరం ఉన్నవారికి చేరుకునేందుకు మరిన్ని వైబ్రియానిక్స్ శిబిరాలు నిర్వహించబడుతున్నాయి. ఇటువంటి ఒక శిబిరం సెప్టెంబర్ 2న పుట్టపర్తి సమీపంలోనున్న కొత్తచెరువులో, సత్యసాయి జూనియర్ కాలేజిలో నిర్వహించబడింది. ఈ శిబిరంలో 300 రోగులకు (130 ఉన్నత పాటశాల విద్యార్థులు, 70 ప్రాథమిక పాటశాల విద్యార్థులు మరియు 100 గ్రామస్థులు) చికిత్సనివ్వటం జరిగింది. పుట్టపుర్తి నుండి, అత్యంత భక్తి శ్రద్ధలు గల నలుగురు చికిత్సా నిపుణులు ఐదు గంటల పాటు వైబ్రియానిక్స్ మందులివ్వటం జరిగింది (చిత్రం చూడండి). భారతదేశంలోనూ మరియు ఇతర దేశాలలో జరిగే శిబిరాల వివరాలు మరియు చిత్రాలను తదుపరి వార్తాలేఖల్లో పాల్పంచుకోవడానికి, శిబిరాల వివరాలను మరియు చిత్రాలను మాకు పంపించ వలిసిందిగా కోరుకుంటున్నాము.
చివరిగా, ఒక మనవి... మీరు వార్తాలేఖను అందుకొనే ప్రతిసారి, మీ వ్యక్తిగత రిజిస్టర్ నెంబర్ ఇమెయిల్ యొక్క విషయం లైన్లో ఉండటం మీరు గమనిస్తారు. భవిష్యత్తులో మీరు మాకు పంపించే ఇమెయిల్స్ లో (నివేదికలు, రోగ చరిత్రలు, ప్రశ్నలు మొదలైనవి) ఈ సంఖ్యను మీరు విషయ లైన్లో తప్పకుండా వ్రాయండి. వైబ్రియానిక్స్ సంఘం పెరుగుతున్న కొద్ది, భవిష్యత్తులో మాకు ఈ సంఖ్య లేకుండా ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వటం సాధ్యం కాకపోవచ్చు.
రాభోయే నెలల్లో మీలో అనేక మందిని, నూతన మాస్టర్ మిశ్రమాల పెట్టె నుండి మీ వైబ్రో పెట్టెలను రీచార్జ్ చేసుకొనే నిమిత్తమై మరియు స్వామీ మనకు ప్రసాదించిన ఈ ఉత్తమైన సేవను కొనసాగించడానికి కావలిసిన శక్తిని పునరావేశించుకోవడానికి ప్రశాంతి నిలయానికి వస్తారని మేము ఆశిస్తున్నాము.
ప్రేమపూర్వకంగా సాయి సేవలో,
జిత్ అగ్గర్వాల్
2011 ఆగస్ట్ 16న: చికిత్సా నిపుణులు 108 CC బాక్సును స్వామీ చరణాల వద్ద సమర్పించుట
2011 ఆగస్ట్ 17న: వైబ్రియానిక్స్ 108 CC మాస్టర్ బాక్సును భగవాన్ మహాసమాధి వద్ద సమర్పించుట