డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో
Vol 5 సంచిక 1
January/February 2014
ప్రియ వైబ్రియోసాధకులారా,
నేను మీకందరికీ పవిత్రమైన, సంతోషప్రదమైన నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలుపుతూ ప్రారంభిస్తున్నాను! రోజులు లెక్కపెట్టగా, పుట్టపర్తిలోని మొదటి అంతర్జాతీయ సాయి విబ్రియోనిక్స్ సమావేశం జరుగుటకు, కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నవి. ఎంత ఉత్తేజకరమైన విషయం! ఆనందంతో, ఆతృతతో సన్నాహాలు జరుగుతున్నవి. 26 జనవరి, ఆదివారంనాడు జరగబోయే ఈ అంతర్జాతీయ ప్రారంభోత్సవం నాటికి, ప్రతి పని సజావుగా జరుగులాగున నిర్ధారించుటకు, రోజంతా, రాత్రి సైతం పనిచేస్తున్న అనేకమంది వాలంటీర్లు మనవద్ద వున్నారు.
సమావేశానికి రిజిస్టర్ చేసుకున్న, ఆశ్రమంలో వసతి అవసరమయ్యే, అభ్యాసకులందరికీ వసతి ఇవ్వబడుతుంది. స్వామి కృపవల్ల సమావేశానికి హాజరైన అభ్యాసకులకు ఉత్తరములోనున్న (N7) 7వ బ్లాక్ లో వసతి యివ్వగలమని హామీ యిస్తున్నాము. జనవరి 25న మీ బాడ్జీలు (ముద్రబిళ్ళలు), ఫోల్డర్లను సేకరించుకునేందుకు, మీరు N7 బ్లాక్ లో, ఉదయం 9 నుంచి వ్యక్తిగతంగా నమోదు చేసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. బ్యాడ్జ్ ఉన్న వారికి మాత్రమే, సమావేశమునకు ప్రవేశార్హత ఇవ్వబడుతుంది. కనుక ఇది చాలాముఖ్యం.
సమావేశపు వేదిక పెద వెంకమరాజు కళ్యాణమండపం (స్వామివారి పాతమందిరం). మేము మా సమావేశాన్ని నిర్వహించడానికి, ఈ పవిత్రస్థలం దొరకుట మా అదృష్టం. శ్రీ బాబా యొక్క గొప్ప ఆశీర్వాదంవల్ల, ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు మేము కేసుల వివరాలు, యితర వివరాలు అందజేయగలము . సాయి విబ్రియోనిక్స్ ఎగ్జిబిషన్ 26 వ తేదీన ప్రతినిధులకు, అదే వేదిక వద్ద 27 వ తేదీన ప్రజలకందరికి తెరువబడి ఉంటుంది. 27 వ రోజు ఉదయం మేము సమావేశంతో బాటు సదస్సు నిర్వహిస్తాము. వివరాలు నమోదు సమయంలో ఇవ్వబడతాయి. సమావేశానంతరం సమావేశ విచారణల పుస్తకం కాపీలను అందరికీ అందుబాటులోకి తీసుకురాబడుతాయి.
మీలో చాలామంది సమావేశంలో అడగాల్సినప్రశ్నలతో వస్తారని నాకు తెలుసు. దయచేసి వాటిని మీ ఫోల్డర్ పాకెట్ లో యిచ్చిన నోట్ పాడ్ పై వ్రాసి సమర్పించండి. మాసమయాన్ని బట్టి, ప్రశ్నలకు సమావేశంలోనో, లేదా మరునాడో సమాధానాలు ఇవ్వబడతాయి. సమాధానం యివ్వని ప్రశ్నలు, మా తర్వాతి వార్తాలేఖలతో ప్రచురించబడతాయి.
దక్షిణభారత క్యాంటీన్ 1వ అంతస్తులో, ప్రతినిధులందరికీ అల్పాహారాన్ని, సమావేశవేదికవద్ద మధ్యాహ్నభోజనం, టీ వడ్డిస్తారు. 26వ తేదీ సాయంత్రం సమావేశం ముగిసిన తర్వాత, ప్రతినిధులందరికీ, ఉత్తరభారత క్యాంటీన్లో వేడుక సందర్భంగా ప్రత్యేకవిందు జరుగుతుంది.
స్వామి సదా క్రమశిక్షణ ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. కనుక మన సమావేశమునకు హాజరైనవారంతా, ఆదర్శమైన సాయిభక్తులవలె ప్రవర్తించెదరని, నేను నమ్ముతున్నాను. ప్రశాంతిమందిర్ క్రమశిక్షణ పాటించి, వారిని తృప్తిపరచాలి. అభ్యాసకులందరు డ్రెస్ కోడ్ పాటిస్తూ, తెల్ల పేంట్, చొక్కా పురుషులు, కోవెలకు ధరించే, సాదా, పూర్తి-పొడవు దుస్తులు మహిళలు ధరించాలి. ఈ అంతర్జాతీయసమావేశం తొలి నుండి, అన్నిదశలలో స్వామి మనతో వుంటారని మనకు తెలుసు. స్వామి శారీరకంగా మనమధ్య లేకున్నను, ఈప్రత్యేకరోజున, హాజరైన వాళ్ళని తనప్రేమలో వోలలాడిస్తూ, ఆయన మనతో ఉంటారు. చివరగా, మీరంతా సంతోషంతో యిళ్లకు చేరుకొని, పునరుద్ధరించబడిన శక్తి, ఉత్సాహంతో వైబ్రోసాధన కొనసాగిస్తారని ఆశిస్తున్నాము. సమావేశానికి హాజరవలేకున్నా, మీ హృదయాలు యిక్కడే వుంటాయని మాకు తెలుసు. మరోసారి మీ అందరికీ చక్కటి సాయి ప్రేమతో, దీవెనలతో నిండిన నూతన సంవత్సరం 2014 శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
ప్రేమపూర్వకమైన శ్రీ సాయి సేవలో,
జిత్ అగర్వాల్