జవాబుల విభాగం
Vol 1 సంచిక 1
September 2010
ప్రశ్న: ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది వైబ్రో అభ్యాసకులున్నారు?
జవాబు: 81 దేశాలలో 4000 కు పైన ఉన్న వైబ్రో అభ్యాసకులు ఉచితంగా ఈ చికిత్సను అందిస్తున్నారు.
_____________________________________
ప్రశ్న: ఒక పేషంటుకు దీర్గ కాలిక రోగ సమస్యకు చికిత్స చేస్తుండగా పేషంటుకు ఫ్లూ జ్వరం వచ్చింది. ఈ పేషంటుకు ఫ్లూ జ్వరానికి చికిత్స ఇస్తుండగా, దీర్గ కాలిక రోగ సమస్యకు ఇతనికి ఇస్తున్న చికిత్స తాత్కాలికంగా ఆపాలా?
జవాబు: పేషంటుకు ఫ్లూ జ్వరం తగ్గే వరకు అతనికి దీర్గ కాలిక సమస్య కోసం ఇస్తున్న చికిత్సను ఆపడం మంచిది. ఇలా చేయడం వల్ల ఫ్లూ జ్వరం వేగంగా తగ్గే అవకాశం ఉంటుంది. కొందరు పేషంట్లు ఒకటే సమయంలో రెండు సమస్యలకి మందులు తీసుకోవడం ఇష్టపడుతూ ఉంటారు.
_____________________________________
ప్రశ్న: “కర్మ” కారణంగా వచ్చే వ్యాధులకు చికిత్సను ఏ విధంగా ఇవ్వాలి?
జవాబు: పేషంటుతో కర్మల గురించి చర్చించడం సరియైన పద్ధతి కాదు. ప్రేమతో పేషంట్లకు చికిత్సను అందించాలి. కర్మ సంభందించిన విషయాలను దేవుడుకి పేషంటుకు మధ్య వదిలిపెట్టాలి.