అదనపు సమాచారం
Vol 5 సంచిక 6
November/December 2014
కాన్ఫరెన్స్ కాల్స్ ఉపయోగించి ప్రాక్టీషనర్ సహాయం అందించుటలో నా అనుభవం
ప్రాక్టీషనర్ 01339…యు.ఎస్.ఏ
నేను కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా నాచుట్టుపట్ల అభ్యాసకులకు తోడ్పడిన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే ఈ విషయాలు ఇతరులకు ఉపయోగపడే అవకాశం ఉంది. 2012లో అమెరికా, కెనడాలలో శిక్షకునిగా, దేశసమన్వయకర్తగా విబ్రియో సేవను ప్రారంభించినప్పుడు, నేను తోటి అభ్యాసకులకు తోడ్పడాలనుకున్నాను. మా తొలి బృందం అక్టోబరులో ఏ.వి.పి తరగతిలో పట్టభద్రులమై వైద్యం మొదలెట్టగానే, వారిసందేహాలను తీర్చువారులేక యిబ్బందిపడరాదని, సమయాన్నిఆదాచేయటానికి సమూహసమావేశాల్ని ఏర్పాటుచేసేము. నేను 1999లో అభ్యాసకుడిగా వైద్యం మొదలెట్టిన కొత్తలో, నాకు సందేహంవస్తే, ఫోన్లో అడిగేందుకు అమెరికాలో అప్పట్లో ఎవరూలేరు. నావలె యితరులు బాధపడకుండా, నేను కొత్త వైద్యులకు సాయి వైబ్రియోనిక్స్ నివారణలు అందించడంలో, వారికవసరమైన సలహాలు యిచ్చేందుకు నిర్ణయించుకున్నాను.
మేము వారి ప్రారంభశిక్షణ అయేక, 2వారాల తర్వాత ఈకాల్స్ ప్రారంభించి, 2నెలలపాటు 2వారాలకొకసారి కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా సలహాలిచ్చేము. ఆగష్టు2013 వరకు నెలకొకసారి చొప్పున ఒక సం. పాటు కాల్స్ చేసాము. అభ్యాసకుల కోరికపై, నేను తిరిగి సెప్టెంబర్ 2014లో కాన్ఫరెన్స్ కాల్స్ ప్రారంభించి, అభ్యాసకులు తమ ప్రశ్నలను పంపుతున్నంతకాలం కొనసాగించాలని అనుకుంటున్నాను.
నేను ఈకాల్స్ నిర్వహించే విధానం:
నేను ఉచిత కాన్ఫరెన్స్ కాల్ సేవను ఉపయోగిస్తాను: http://freeconferencecall.com లేక స్కైప్ లేదా ఇతర ప్రత్యామ్నాయాలు అలాగే పనిచేస్తాయి. అమెరికా, కెనడాలోని క్రియాశీల అభ్యాసకులకు వారిని ప్రశ్నలతో ముందుకు రమ్మని ఆహ్వానిస్తూ ఇమెయిల్ చేస్తాను. ముందుగా ప్రశ్నలను సేకరిస్తే, నేను సమాధానాలు సిద్ధంచేసి, అవసరమైన పరిశోధనలు చేస్తాను. నేను అభ్యాసకుల పేర్లను వారి ప్రశ్నలకు సమాధానమిచ్చేటప్పుడు సమావేశపు కాల్స్ లో చెప్పను. నిర్దేశిత సమయాన అభ్యాసకులందరూ కాన్ఫరెన్స్ కాల్ లో పాల్గొంటారు. దీని వలన అందరూ వుమ్మడిగా వినవచ్చు మాట్లాడవచ్చు. నేను పాల్గొంటున్నవారిని తమ పేర్లు చెప్పమని అడుగుతాను. ఈ కాల్స్ ఒక గంటకి పరిమితం.
నేను ప్రశ్న- జవాబు పంధా అనుసరిస్తాను. సాధారణంగా విబ్రియో సాధనకి సంబంధించిన ప్రశ్నలకు జవాబిస్తాను, ఉదాహరణకి, రోగులడిగే మందు వివరణ, మోతాదు, పధ్యం వంటివాటికి ఏవిధంగా స్పందించాలి మొదలుగునవి. మొత్తం గుంపుకు ప్రయోజనంలేని ప్రత్యేకసూత్రాల గురించి, నిర్దిష్ట కేసులకు సంబంధించిన ప్రశ్నలకు నేను సమాధానమివ్వను. అటువంటి ప్రశ్నలకు వేరుగా ప్రశ్న అడిగిన అభ్యాసకునికే నేను ప్రతిస్పందిస్తున్నాను. సమావేశం కాల్స్ తొందరలేని ప్రశ్నలకు ఉద్దేశించబడ్డాయి. ప్రశ్న-జవాబులయ్యాక సమయం ఉంటే, ముఖ్యసూత్రాలు లేదా పరిస్థితులగురించి, రికార్డ్స్ జాగ్రత్త చేయుటవంటివి గూర్చి చర్చిస్తాము. ముఖ్యంగా నిస్వార్ధమైన ప్రేమతో అన్నీ కేసుల్లో సేవ చేయటంగురించి వ్యాఖ్యలు చేస్తాను.
సామూహిక కాల్ లో పాల్గొనేవారికి ఈ విలువైన సమయం, ఆసక్తితో, స్పూర్తిదాయకంగా వున్నదంటున్నారు. కాల్ తరువాత ఈ ప్రశ్నలు - జవాబులు సాయి విబ్రియోనిక్స్ వార్తాలేఖకు పంపుతాము. మొత్తంమీద, నెలసరి సమావేశం కాల్స్ అభ్యాసకులకు ఉపయోగపడడమేకాక కాలాన్ని ఆదాచేస్తున్నాయి మరియు ఇవి అవసరమైనవారికి నిస్వార్థసేవలందిస్తున్న మనందరి కొరకు సత్సంగం లాంటివి.
జై సాయి రామ్!