ప్రశ్నలు సమాధానాలు
Vol 2 సంచిక 2
March 2011
1. ప్రశ్న: నేను తినే కూరగాయిలు మరియు పళ్ళ నుండి రసాయనాలను తొలగించడం ఎలా?
జవాబు: ఎల్లప్పుడూ మీ సొంత తోట నుండి లేదా తాజా సేంద్రీయ పండ్లు మరియు కూరగాయలు తినడానికి ప్రయత్నించండి. లేదా మీరు తినే కూరగాయిలు మరియు పళ్ళల్లో రాసాయనాలున్నాయని మీకు అనిపిస్తే ఈ కింది విధానాన్ని ఉపయోగించండి: ఒక గిన్నెలో సగం వరకు నీరు పోసి, నీటిలో ఒక గరిటెడు ఉప్పు, రెండు గరిటేడ్లు వినెగర్ కలపండి. ఈ నీటిలో కూరగాయిలు మరియు పండ్లను ఇరవై నిమిషాలు పాటు నానపెట్టుంచండి. ఇలా చేయడం ద్వారా పురుగుల మందులు మరియు ఇతర రసాయనాలు తొలగిపోతాయి. ఆపై కూరగాయిలు మరియు పండ్లను తాజా నీటిలో పూర్తిగా కడగాలి..
_____________________________________
2, ప్రశ్న: నేను ఒక వైబ్రియానిక్స్ వైద్యుడినని చెప్పుకోవచ్చా?
జవాబు: లేదు. మీరు వైబ్రియానిక్స్ వైద్యుడినని చెప్పుకో రాదు. మీరు స్వామీ యొక్క సాధనములు మరియు వైబ్రియానిక్స్ అభ్యసించే చికిత్సా నిపుణులు మాత్రమే. రోగులను నయంచేసే ప్రధాన వైద్యుడు స్వామి మాత్రమే. వైద్యులు రోగాలని నయం చేయడానికి విశేష శిక్షణ పొందియుంటారు. వైబ్రియానిక్స్ చికిత్సను ఇవ్వడానికి వైద్య సంభంధమైన జ్ఞ్యానం కలిగియుండక్కర్లేదు. మీరు ఇస్తున్న మందులకు మీరు డబ్బులు వసూలు చేయడం లేదా సహాయాలు అడగడం వంటివి చేయట్లేదు. ఇది అవసరమైన వారికి ప్రేమతో మనమంధించే సేవ. ఈ మందులో రసాయనాలను లేదా వాస్తవిక పదార్థాలను కలపడం లేదు. వాస్తవంలో ఇవి చక్కర గోలీలలో లేదా నీటిలో కలిపే కంపనాలు (వైబ్రేషన్లు) మాత్రమే. మీరిచ్చే ఈ మందులను అల్లోపతి మందులని రోగులు తప్పుగా అర్ధం చేసుకోవచ్చని మీకనిపిస్తే మందుల సీసా పైన "చక్కర గోలీలు మాత్రమే" అని చీటీలో వ్రాసి అతికించగలరు.
_____________________________________
3. ప్రశ్న: వైబ్రో మందులకు భాగా స్పందిస్తున్న ఒక రోగి, అల్లోపతి మందులను తీసుకోవడం ఆపాలని కోరుకుంటోంది. నేను ఏ విధముగా ఆమెకు సహాయం చేయాలి?
జవాబు: రోగిని అల్లోపతి మందులను వేసుకోవడం ఆపమని మీరు చెప్పరాదు. నయమైనట్లు ఆమెకు అనిపిస్తుంటే, స్వయంగా ఆమె వైద్యుడు వద్దకు వెళ్లి మాట్లాడాలని చెప్పండి. అల్లోపతి మందులను తగ్గించే భాద్యత రోగిది లేదా రోగి యొక్క వైధ్యుడిది.
_____________________________________
4. ప్రశ్న: ఒక రోగి యొక్క కుమారుడుకి మద్యం మరియు పొగాకు వంటి దుర్వ్యసనాలు ఉన్నాయి. ఈ దురలవాట్లను మాన్పించడానికి వైబ్రో మందులను నా వద్దనుండి తీసుకొని తన కుమారుడికివ్వాలని ఆ రోగి కోరుకుంటోంది. ఈ విధముగా ఇచ్చిన మందులు పనిచేస్తాయా?
జవాబు: లేదు. పొగాకు, మద్యం వంటి ధుర్వ్యసనాలున్న రోగుల విషయంలో, రోగులు మీ వద్దకు నేరుగా వచ్చి వైబ్రో చికిత్స ఇవ్వమని కోరాలి. ధుర్వ్యసనాలను మానుకోవాలన్న రోగుల నిశ్చయం ధృడమైనదని మీరు నిర్ధారించుకున్న తర్వాతే చికిత్సను ప్రారంభించాలి. నయంకావడానికి, రోగి యొక్క బలమైన మానసిక వైఖిరి చాలా ముఖ్యమని మీరు గుర్తుంచుకోవాలి.
మీరు డా.అగ్గర్వాల్ను ఏమైనా ప్రశ్న అడగాలని అనుకుంటున్నారా? అయితే, మీ ప్రశ్నలను ఈ కింద ఇవ్వబడిన వెబ్సైటుకు పంపించండి: [email protected]