Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రశ్న జవాబులు

Vol 3 సంచిక 1
January 2012


ప్రశ్న: కీళ్ళవాత సమస్యతో వచ్చే రోగికి  CC20.3 ఇస్తే సరిపోతుందా లేక ఇతర మిశ్రమాలను చేర్చే అవసరం ఉందా?

జవాబు: కీళ్ళవాతమని నిర్ధారించబడిన రోగులు వైబ్రో చికిత్స కొరకు మీ వద్దకు వచ్చినప్పుడు CC20.1 లేదా CC20.2 తో చికిత్సను ప్రారంభించడం మంచిది. వీటితో రోగికి ఉపశమనం కలగని సందర్భంలో మాత్రమే CC20.3 ను ఇవ్వవలెను. ఈ మిశ్రమంతో కూడా ఫలితాలు లభించని సందర్భంలో, కీళ్ళవాతము కారణంగా కండరాలు భాధితమయ్యే అవకాశముంటుంది కనుక ,కండరాలు మరియు సహాయక కణజాలానికి సంభoధించిన మిశ్రమం CC20.4 ను చేర్చి ఇవ్వండి.

_____________________________________

ప్రశ్న: రక్తహీనత (అనీమియా) సమస్యకు తగిన మిశ్రమం ఏమిటి? ఈ సమస్యున్న అనేక మహిళలు చికిత్స కొరకు వస్తున్నారు.

జవాబు: రక్తహీనత చికిత్సకు CC3.1 Heart tonic ఇవ్వవలెను, అయితే, ఈ సమస్యకు మూలకారణం ఏమిటని కనుగొనడం ముఖ్యం. ఉదాహరణకు ఋతుస్రావం ఎక్కువగా ఉన్న మహిళకు CC3.1 తో పాటు CC8.7 Menses heavy ను చేర్చి ఇవ్వడం మంచిది. ఇనుము లోపం ఉన్న రోగులకు CC3.1 తో పాటు CC4.2 Liver tonic ను చేర్చి ఇవ్వవలెను.

_____________________________________

ప్రశ్న: దీర్ఘకాలిక వ్యాధికి చికిత్సను తీసుకుంటున్న సమయంలో రోగికి ఫ్లూ జ్వరము వచ్చింది. జ్వరానికి ఇచ్చే చికిత్స పూర్తయ్యే వరకు, దీర్ఘకాలిక సమస్యకు ఇస్తున్న చికిత్సను ఆపవచ్చా?

జవాబు: ఇటువంటి సందర్భాలలో స్థిర నియమాలు లేవు. కాబట్టి, చికిత్సా నిపుణులు తెలివైన నిర్ణయాలను తీసుకొని చికిత్సను అందించాలి. ఉదాహరణకు, క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతున్న రోగికి జలుబు వస్తే కనుక, క్యాన్సర్ వ్యాధికి ఇస్తున్న చికిత్సను ఆపకుండా, దానితో పాటుగా జలుబుకి చికిత్సను ఇవ్వాలి. అయితే, కీళ్ళవాత సమస్యకు చికిత్స పొందుతున్న ఒక రోగికి జ్వరం లేక జలుబు వచ్చినప్పుడు, దీనికి సంబంధించిన చికిత్స పూర్తయ్యే వరకు కీళ్లవాతానికి ఇచ్చే చికిత్స తాత్కాలికంగా ఆపడంలో హాని ఉండదు.

_____________________________________

ప్రశ్న: వివిధ నారాయణి సమూహాలకు చెందిన మందులను కలపవచ్చా? వైబ్రేషన్లను కలపడనాకి నిర్ణిత సూత్రాలు ఉన్నాయా?

జవాబు: మీరు వివిధ మిశ్రమాలు లేక మందులను కలపవచ్చు. వైబ్రేషన్లను కలపడానికి పాటించ వలసిన సూత్రం రోగికి వీలైనంత త్వరగా ఉపశమనాన్ని అందించకలగటం మాత్రమే. ఒక మిశ్రమం లేక ఒక మందును ఇతర మిశ్రమాలు లేక మందులతో కలపడం ద్వారా రోగికున్న వ్యాధి లక్షణాలు అన్నిటికి చికిత్సను అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఉదాహరణకు ఒక రోగికి జలుబుతో పాటు జ్వరం, తలభారం, గొంతునొప్పి, దగ్గు లేక జీర్ణాశయ సమస్యలు ఉంటే క్రింది మిశ్రమాన్ని ఇవ్వవచ్చు: NM11 Cold + NM18 General Fever + SM35 Sinus + SM40 Throat + NM8 Chest + NM80 Gastro. పైన ఇచ్చిన వంటి తీవ్రమైన సమస్యలకు, మిశ్రమాన్ని ఒకటి నుండి రెండు రోజులవరకు 6TD మోతాదులో తీసుకొని, ఆ తర్వాత, TDS మోతాదుకు తగ్గించవలెను.