Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రశ్నలు సమాధానాలు

Vol 4 సంచిక 6
November/December 2013


1. ప్రశ్న: శిక్షణా తరగతులలో మేము రోగులకు ఒకేసారి రెండు లేదా మూడు కంటే ఎక్కువ కోంబోలు ఇవ్వకూడదని బోధించారు. కానీ వార్తాలేఖలలో 3 లేదా 4 సీసీలు ఇవ్వబడుతున్నాయి అని కనుగొన్నాను. రోగులకు మూడు లేదా నాలుగు CC లు  ఇవ్వడం సరైనదేనా  దయచేసి స్పష్టం చేయండి.  

    జవాబు: ఎన్నికోంబోలు ఇవ్వవచ్చు అనేదానిపై కఠినమైన నియమం ఏదీ లేదు. కొత్త వైద్యులు ఒక సీసాలో మూడు కంటే ఎక్కువ CCలు వెయ్య కూడదని సిఫార్సు చేయబడింది. మీరు ఒక సమయంలో ఒక దీర్ఘకాలిక వ్యాధికి (మరియూ ఏదైనా సంబంధిత సమస్యలు) మాత్రమే చికిత్స చేయవలసి ఉంటుంది కనుక మీరు ఒక్క సీసా  మాత్రమే ఇవ్వాలి. అయినప్పటికీ ఈ క్రింది కోంబో లను ఏఇతర కోంబోల తోనైనా  కలపవచ్చు: CC10.1, CC12.1 (లేదా CC12.2), CC15.1 మరియు CC17.3. అనుభవం మరియు విచక్షణతో ఒక అభ్యాసకుడు నాలుగు కంటే ఎక్కువ కోంబోలను మిళితం చేయవచ్చు.

_____________________________________

2. ప్రశ్న: నేను ఇప్పటివరకూ ఉపయోగించని కొన్ని కోంబోలలో ఆల్కహాల్ స్థాయి తగ్గిందని గమనించాను. అది ఆశించదగినదేనా?

    జవాబు: ఆల్కహాల్ అణువులు పలచగా ఉంటాయి.  బాటిల్ సరిగ్గా మూసివేసినప్పటికీ అవి చాలా వేగంగా ఆవిరై పోతాయి. అది ఆశించదగ్గ పరిణామమే. కొంత మంది అభ్యాసకులు CC బాక్సు చుట్టూ ఫోయిల్ తో చుడతారు, లేదా మరో బాక్సులో ఉంచుతారు, లేదా దానిపైన బరువు ఉంచుతారు. కనుక మీకు ఏది బాగా పని చేస్తుందో దానిని ఉపయోగించండి. సీసాలు క్రమం తప్పకుండా తనిఖీ చేసుకుంటూ పూర్తిగా ఆవిరి అవ్వకుండా చూడండి.  

_____________________________________

3. ప్రశ్న:  రోగి యొక్క కేస్ షీట్లో రెమిడీ వివరాలను నమోదు చేయకపోతే ఔషధం యొక్క ప్రభావం తగ్గుతుందా? ఇలా ఎందుకు అడుగుతున్నానంటే  కొన్నిసార్లు మా కుటుంబ సభ్యుల కోసం హడావిడిగా వెంటనే రికార్డు చేయడానికి వీలు లేని పరిస్థితిలో ఏదో ఒక ఔషధాన్ని సూచించవచ్చు. లేదా ఒక్కొక్కసారి పేషంటు వచ్చినప్పుడు  అధికారికముగా అపాయింట్మెంట్ ఇవడానికి సమయం ఉండదు. తర్వాత వివరాలు నమోదు చేసినప్పటికీ పరిహారాన్ని పంపిణీ చేసే సమయంలోనే నమోదు చేయాలనే పట్టింపు ఏమైనా ఉందా? అసలు కేస్ షీట్ తయారు చేయడం చట్టపరమైన కారణాల కోసం మాత్రమేనా? 

    జవాబు:  లేదు, ఔషధం యొక్క ప్రభావం ప్రభావితం కాదు. ఒకవేళ రోగితో మీ మొదటి అపాయింట్మెంట్ లో అతను మీతో ఉన్నప్పుడు ఆవ్యక్తి వివరాలను రికార్డు చేయడానికి సమయాన్ని కేటాయించండి. రికార్డులు కేసుకు సంబంధించిన వివరాలు పొందడం కోసం మాత్రమే కాదు, చాలా కాలం గడిపిన తర్వాత ఇలాంటి కేసును మనము చికిత్స చేస్తున్నప్పుడు ఒక నిర్దిష్ట సందర్భంలో అప్పుడు ఏమి ఇవ్వబడింది గుర్తు లేకపోవచ్చు. అలాగే ఏదైనా కేసు అసాధారణ కేసయితే దానిని ప్రచురణ కోసం      పూర్తి వివరాలు అవసరం కావలసి ఉంటుంది.

_____________________________________

4. ప్రశ్న: రెమిడీ సూచించే సమయములో వైద్యుడి శారీరక మరియు మానసిక ఆరోగ్యం అనేది ప్రధానమైన అంశమేనా?  మనము జ్వరము లేదా జలుబుతో లేదా పార్శ్వపు నొప్పితో బాధపడుతూ రోగులకు రెమిడీలు సూచించవచ్చా? మనం ఒత్తిడికి గురైనప్పుడు లేదా నిరాశాజనకంగా వున్నప్పుడు సూచించడం సరైనదేనా? మనం ఇచ్చే  ఔషధము సూక్ష్మ శక్తుల చేత  ప్రభావితం అవుతుంది కనుక నేను ఇలా అడుగుతున్నాను. కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో పంపిణీ చేసే ఔషధం పై విశ్వాసం పెంపొందించడానికి మీ సమాధానం సహాయపడుతుంది.   

    జవాబు: వైద్యుడు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండటం మంచిది. మీకు బాగా లేనప్పుడు కూడా రెమిడీ ఇవ్వవచ్చు ఐతే a.  రెమిడీ సూచించే టప్పుడు మీరీ అంటువ్యాధి గ్రస్థులు కాకుండా ఉండాలి. b మీరు స్పష్టంగా ఆలోచించగలిగేలా ఉండాలి. c. వైద్యం ప్రారంభించే ముందు మీరు స్వామి ప్రార్థన చేసి స్పష్ట మైన మనసుతో ఆయన మార్గదర్శకత్వం మరియు సహాయం మీకు అందించమని కోరగలిగేలా ఉండాలి. జలుబు దగ్గు వంటి తీవ్రమైన అనారోగ్యం ఉన్నప్పుడు విచక్షణా శక్తిని ఉపయోగించడం చాలా ముఖ్యం. వైబ్రియానిక్స్ సేవలో ఉన్నప్పుడు అభ్యాసకులు తరచుగా తన సహాయం కోరి వచ్చిన రోగులకు  సేవ చేసేటప్పుడు తన వ్యక్తిగత సమస్య లన్నింటినీ అధిగమిస్తారు!    

 _____________________________________

5. ప్రశ్న:  ఈ ప్రశ్న నిజంగా సిల్లీ గా ఉండవచ్చు కానీ కొన్నిసార్లు నేను బాటిల్ యొక్క   మూత లో ఉన్న వైబ్రియానిక్స్ గోళి మా పాప నోటి లో వేయడానికి మెట్లకింద వెతుకుతూ ఉంటాను. ఎక్కువసేపు మూత తెరిచి ఉన్నట్లయితే కంపనాలు ఆవిరై పోవడము లేదా అదృశ్యమవడము జరుగుతుందా?  

   జవాబు:  లేదు, ఏ ప్రశ్న సిల్లీ ప్రశ్న కాదు.  కంపనాలు గోళీలలో అలాగే   పొందుపరచబడి ఉంటాయి.    

_____________________________________

6. ప్రశ్న:   అడల్ట్ మరియు చైల్డ్ టానిక్ రోగనిరోధక శక్తిని మరియు రోగిని తిరిగి ఆరోగ్యానికి తీసుకువచ్చే అన్ని వ్యవస్థలను చక్క జేస్తుంది. ఐతే  ఏ వయసులో పిల్లవాడు అడల్ట్ టానిక్ తీసుకోవడం ప్రారంభించాలి?  

    జవాబు:   పిల్లలకు సంబంధించినదా లేదా పెద్దవారిదా ఏది ఉపయోగించాలి  అనేది వచ్చిన వ్యక్తి పై ఆధారపడి ఉంటుంది.  పిల్లలు శారీరకంగా పెద్దవారిగా కనిపిస్తూ ఉన్నప్పుడు అడల్ట్ టానిక్ సూచించాలి. చాలా మందికి 16-18 సంవత్సరాలు అడల్ట్  టానిక్ ఇవ్వడానికి తగిన వయసు. మీకు ఇంకా తెలియకపోతే CC12.1 Adult tonic మరియు CC12.2 Child tonic. కోసం ఉపయోగించిన కార్డులను చూడండి మీకు తెలిసిన మరియు రోగి గురించి గమనించిన వాటి ఆధారంగా  అనుభవంతో రెమిడీ సూచించండి. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ రెండు రెమిడీలలో శక్తి  అవసరము మేరకు మాత్రమే పనిచేస్తుంది.

_____________________________________

7. ప్రశ్న: నేను ఒక కొత్త అభ్యాసకుడిని మరియు సహాయ పడడానికి ఆసక్తిగా ఉన్నాను. రోగిని మొదటిసారి కలిసినప్పుడు ఏవైనా చిట్కాలు ఉన్నాయా?

    జవాబు: శిక్షణ మరియు క్రమగా పెరుగుతున్న అనుభవం ఆధారంగా మీ అంతర్దృష్టి ఉపయోగించండి. వినండి, ప్రేమించండి మరియు పంపిణీ చేయండి. మీ సమావేశానికి ముందు ప్రార్థించండి మరియు మిమ్మల్ని మీరే కేంద్రీకరించుకోండి. నెమ్మదిగా  ప్రశాంతంగా ఉండండి.  అవతల వ్యక్తి చెప్పింది పూర్తిగా వినడం చాలా ముఖ్యం.  మీరు వారికి ఏ రెమిడీ ఇవ్వబోతున్నారో లేదా మీరు ఏ ప్రశ్నలను అడగాలనుకుంటున్నారో ఆలోచిస్తూ అక్కడ కూర్చోవద్దు.  మీరు అలా చేస్తే, వారు చెప్పేది పూర్తిగా వినడం లేదని అర్ధం. అవతలి వ్యక్తితో హడావిడిగా ఉండకండి.  వారి ఆరోగ్యానికి సంబంధించి మీరు విన్న అతి ముఖ్య విషయాలను వారికి తిరిగి చెప్పండి, తద్వారా మీరు విన్నట్లు వారికి అర్ధమవుతుంది.

 వచ్చినవారు తమ వ్యక్తిగత జీవితం, సంబంధాలు, ఆర్థిక విషయాల గురించి చాలా వివరంగా చెప్పబోతూ ఉంటే సున్నితంగా ఆపి వారు మిమ్మల్ని చూడటానికి వచ్చిన అసలు కారణం వివరించమని కోరండి. సంభాషణ యొక్క దిశను నియంత్రించండి, తద్వారా మీరు మీ రికార్డులకు అవసరమైన వాస్తవాలను పొందండి మరియు ప్రేమతో ప్రతిదీ పూర్తి చేయండి. రెమిడీ పంపిణీ చేసేటప్పుడు, రోగికి అవి ఎలా తీసుకోవాలో వివరించండి, మరియు మీరు వారి ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చారని నిర్ధారించుకోండి. మొదటి అపాయింట్‌మెంట్‌ను సుమారు 45 నిమిషాలు వరకూ కొనసాగించండి.  కొన్నిసార్లు అది సాధ్యం కాదు కానీ నిర్ధిష్ట లక్ష్యంగా ఆ సమయ వ్యవధి ఉంటుంది.  తదుపరి అపాయింట్‌మెంట్‌ లో చర్చను కొనసాగించండి.