Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రశ్నలు సమాధానాలు

Vol 5 సంచిక 2
March/April 2014


1. ప్రశ్న: మూలవ్యాధితో బాధపడుతున్న రోగి విషయంలో, CC4.4 మలబద్దకం మందు సరిపోతుందా లేదా మరికొన్ని అదనపు పరిష్కారాలు అవసరమా?

సమాధానం: CC15.1 మెంటల్ &ఎమోషనల్ టానిక్ యివ్వటం మంచిదే.అదేకాక కాలేయం బలపడుటకు CC4.2 కాలేయం&పిత్తాశయం టానిక్ కూడా యిస్తే మంచిది. అంతేకాక, రోగిని ప్రతిరోజూ యెక్కువగా నీటిని త్రాగమనిమరియు తాజా పళ్ళు మరియు కూరగాయలను పుష్కలంగా కలిగి ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం తినమనిసలహా ఇవ్వండి.

_____________________________________

2. ప్రశ్న: మీ జేబులోనున్న మొబైల్ మ్రోగినప్పుడు, మీ నోటిలో విబ్రో మాత్ర వుంటే, అది పనిచేయక వృధా అవుతుందా?

సమాధానం: వృధాకాదు, ఒకసారి నోట్లో వేసుకోగానే, మాత్రలో చలనం మొదలై, శరీరంలో చేరవలసిన  అవయవానికి చేరుకుంటుంది.

_____________________________________

3. ప్రశ్న: రోగి విబ్రోచికిత్సలో కాల్షియం సప్లిమెంట్ యివ్వమంటే ఏ పరిహారం యివ్వాలి?

సమాధానం: CC12.1 అడల్ట్ టానిక్ &CC20.1 SMJ టానిక్, యీ రెండిటిలో కాల్షియం వైబ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి, వీటిలో ఏదైనా గాని, లేక యీ రెండు సాధారణ కాంబోస్ కాని యివ్వవచ్చు.

_____________________________________

4. ప్రశ్న: రాళ్లలో వైబ్రేషన్స్ యొక్కశక్తిని నింపి, మనం చార్జ్ చేయగలమా? ఎన్నాళ్లలో సాధ్యమవుతుంది?

సమాధానం: క్వార్ట్జ్ స్పటికంలో (Quartzcrystal) లో శక్తిని నింపుటకు, రెమెడీ వెల్ లో దానిని 24 గంటలు వదిలివేయాలి.

_____________________________________

5. ప్రశ్న: ఒక పరిహారం మరొకదానిలోమిశ్రితమైన–ఉదాహరణకు:CC20.3లోCC20.2,CC20.2లో CC20.1 కలిసి వున్నవి –మనం ఆ మూడింటిని కలిపి ఒకే సీసాలో ఇవ్వవచ్చునా? లేక CC20.3ఒక్కటే ఇచ్చిన చాలునా?

సమాధానం: సాధారణంగామేము CC20.1కానిCC20.2కానిCC20.3లో కలపము. ఎందుకంటే CC20.3 లో మిగతా రెండు కలిసివుంటాయి. అయినను CC20.3 వేగంగా పనిచేయకపోతే, అప్పుడు ఆ రెండింటిలో ఒకటికని, రెండు కాని కలిపితే మరింత శక్తివంతమౌతుందని కనుగొన్నాము. 

_____________________________________

6. ప్రశ్న: ఒకే రోగికి ఒకదానికన్న ఎక్కువ రోగలక్షణాలకి చికిత్స చేయాలంటే, వేర్వేరు రెమెడీలను ఒకే సీసాలో కలిపి ఇవ్వవచ్చునా?

సమాధానం: క్రొత్తగా మొదలెట్టిన అభ్యాసకులను, ఒకసారి ఒక దీర్ఘకాలిక రోగమునకు (దానితో సంబంధించిన మిగతవాటికి)మాత్రమే మందునిమ్మని మా సలహా. మొదటి రోగము బాగా తగ్గిన తర్వాత రెండవ దీర్ఘకాలిక రోగసమస్యకు చికిత్స చేయాలి. మనం 2 లేక 3 దీర్ఘకాలిక రోగముల చికిత్సకై, అన్ని రెమెడీలను ఒకే సీసాలో యిచ్చి, రోగికి మందు వికటించినచో, ఏ పరిహారంవల్ల అది జరిగినదో మనకి నిశ్చయంగా తెలీదు. బాగా అనుభవం గడించిన అభ్యాసకుడు ఒకటికన్నా ఎక్కువ రోగలక్షణములను, మందుల మిశ్రమాన్ని ఒకే సీసాలోనిచ్చి చికిత్స చేయగలడు. సాధారణంగా రోగులు వీలైనంత తక్కువ మందుల సీసాలు వాడాలని కోరుకుంటారు.

_____________________________________

7. ప్రశ్న: హెర్నియాకు శస్త్రచికిత్స తప్ప అలోపతిలో మందులు లేవు. విబ్రియోనిక్స్ మందు వుబ్బిన భాగం తగ్గించి, బాధ తగ్గించగలదా?

సమాధానం: CC4.9 Hernia (హెర్నియా) తప్పక బాధను తగ్గిస్తుంది. కనుక మా సలహా ప్రకారం ఏమిటంటే, విబ్రియోనిక్స్ రెమెడీలను కనీసం 2 నెలలు తీసుకొని, అప్పుడు శస్త్రచికిత్స చేయించుకోవాలా లేదా అనేది నిర్ణయించుకోండి.

_____________________________________