ప్రశ్నలు సమాధానాలు
Vol 5 సంచిక 5
September/October 2014
1. ప్రశ్న: నేను ఉండే ప్రాంతంలో ఇథైల్ ఆల్కహాల్ దొరకకపోతే సులువుగా దొరికే మితిలేటెడ్ స్పిరిట్ ను ఉపయోగించవచ్చా ?
జవాబు: ఉపయోగించకూడదు ఎందుకంటే మిథైల్ ఆల్కహాల్ విషపూరితమైనది అది లోపలికి తీసుకుంటే: రబ్బింగ్ ఆల్కహాల్ వలె పనిచేస్తుంది. ఆదర్శవంతంగా ఉండటానికి 96% స్వచ్ఛత కలిగిన ఆల్కహాల్ నే వాడాలి. ఇది అందుబాటులో లేకపోతే, తాత్కాలిక చర్యగా జిన్ లేదా వోడ్కా వంటి మద్యం ఉపయోగించవచ్చు,
_____________________________________
2. ప్రశ్న: SRHVP మిషను ఉపయోగించి ఒక వ్యాధి లక్షణానికి మంచి నివారణ తయారు చేస్తే దానిని నా 108 సిసి బాక్స్ లోని తగిన మిశ్రమానికి జోడించవ చ్చా?
జవాబు: 108CC బాక్సును మా పరిశోధన బృందం నిరంతరం నవీనీకరిస్తోంది. అందువల్ల వైబ్రియానిక్స్ యొక్క అభివృద్ధికి ఇటు వంటి విజయవంతమైన నివారణల సమాచారం ఎంతో ప్రాముఖ్యత కలిగినది. అయితే రోగికి వ్యక్తిగతంగా మీరు మిషన్ నుంచి తయారుచేసిన నివారణకు దీనిని జోడించ వద్దని సూచిస్తున్నాము. ఎందుకంటే మా పరిశోధనా బృందం ఒక సాధారణ మిశ్రమం జోడించే ముందు నివారణ యొక్క అనేక ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. అభ్యాసకులు అందరూ కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి 108 CC బాక్సును రీఛార్జి చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము. ఇందు కోసం స్థానిక సమన్వయకర్త ను సంప్రదించండి లేదా ఆశ్రమాన్ని సందర్శించి నప్పుడు ఏర్పాటు చేయడానికి ముందుగానే మాకు ఇమెయిల్ పంపండి
_____________________________________
3. ప్రశ్న: ఒక పేషెంటు తన వద్ద హోమియోపతి నివారణ ఉందని దానిని వైబ్రియానిక్స్ పై అతనికి ఉన్న విశ్వాసం కారణంగానో లేదా ఆర్థిక పరిస్థితి కారణంగానో పోటెన్ టైజ్ చేయమని అడుగుతున్నారు, దీనికి ఏ పొటెన్సీని ఉపయోగించాలి 200C సరి పోతుందా ?
జవాబు : మీరు హోమియోపతి నివారణను పోటెం టై జ్ చేయవలసి వస్తే ఆ నివారణ యొక్క అసలు పోటేన్సీ కి మాత్రమే వృద్ధి చెయ్యాలి. అయినప్పటికీ, రోగికి నిజంగా వైబ్రియానిక్స్ పై ఎక్కువ నమ్మకం ఉంటే రోగితో పూర్తిగా సంప్రదింపులు చేసి మన నివారణను సిద్ధం చేయటం మంచిది .
_____________________________________
4. ప్రశ్న: రోగ చరిత్రల వ్యాధి నివారణలలో చూస్తే, అభ్యాసకుడు అభివృద్ధిని శాతం రూపంలో తెలియజేస్తూ ఉంటారు ఇది ఎలా గణిస్తారు ?
జవాబు: ఈ గణాంకాలు రోగి నుండి వచ్చినవి. అవి ఖచ్చితమైనవి కాకపోవచ్చు, కానీ అవి మంచి మార్గదర్శిగా పనిచేసి తరచుగా మన చికిత్సకు ప్రయోజనం చేకూరుస్తాయి. అయితే దీనిని గణించడం అంత సులభం కాదు. రోగితో కొంత సంభాషణ తర్వాత మాత్రమే ఈ సమాచారాన్ని అతని నుండి సేకరించవచ్చు.
_____________________________________
5. ప్రశ్న: కొంతమంది రోగులు TDS మోతాదులో ఉన్నప్పుడు CC6.3 Diabetes ను రాత్రి పూట ఒక మోతాదు తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయి తగ్గినట్లు తెలిపారు. దయచేసి రోగితో ఎలా వ్యవహరించాలో సలహా ఇవ్వండి.
జవాబు: రోగి అల్లోపతి ఔషధం కూడా తీసుకుంటున్నారా అన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. చాలా మంది రోగులు ఏదో ఒక రకమైన మధుమేహ ఔషధం మీద ఆధారపడి ఉన్నందున మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. OD సూచించడం ద్వారా నివారణ ప్రారంభించండి, క్రమంగా TDS వరకు పెంచండి.
_____________________________________
6. ప్రశ్న: క్యాన్సర్ రోగికి అతని వైద్యుడు క్యాన్సర్ తగ్గిపోయిందని చెప్పిన తర్వాత కూడా అభ్యాసకుడు క్యాన్సర్ చికిత్స ను కొనసాగించాలా ?
జవాబు: అవును, ఎందుకంటే మనం ఇచ్చే అన్ని నివారణలకు చికిత్సను క్రమంగా తగ్గిస్తూ వస్తాము; కనుక రోగికి ఈ క్రింది నివారణ ఇవ్వండి:
CC2.1 Cancers – all + CC2.3 Tumours & Growths (అవసరం మేరకు ) + శరీర భాగానికి చెందిన ప్రత్యేక నివారణి…OD 4 వారాలకు తరువాత OW 4 వారాలకు . దీని తరువాత, కేవలం *CC2.1 Cancers – all…నెలకు ఒక మోతాదు చొప్పున 6 నెలలు తరువాత మూడు నెలలకు ఒక మోతాదు చొప్పున సంవత్సరం వరకు చివరగా సంవత్సరానికి ఒక మోతాదు చొప్పున ఏడు సంవత్సరాల వరకు తీసుకోవాలి.
*CC2.1 Cancers – all అనేది తల్లిదండ్రులు మరియు తాత ముత్తాతలలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నట్టయితే ఆ కుటుంబ సభ్యులకు ముందు జాగ్రత్త కోసం మరియు క్యాన్సర్ చికిత్స నుండి బయట పడిన కొత్త రోగులకు కూడా …OW గా నాలుగు వారాలకు, నెలకు ఒక మోతాదు చొప్పున ఆరు నెలల వరకు, మూడు నెలలకు ఒక మోతాదు చొప్పున సంవత్సరం వరకు చివరగా సంవత్సరానికి ఒక మోతాదు చొప్పున ఏడు సంవత్సరాల వరకు తీసుకోవాలి.
సూచన: పైన సూచించిన నివారణలు వాడుతునప్పుడు మూడు రోజుల ముందు లేదా మూడు రోజులు వెనక మరే ఇతర వైబ్రో మిశ్రమాలను తీసుకోకూడదు.
*ఒకవేళ SRHVP మిషను ఉపయోగిస్తే CC2.1 Cancers – all బదులుగా : BR4 Fear + SM1 Removal of Entities + SM2 Divine Protection + SR282 Carcinosin CM ఇవ్వాలి.
_____________________________________