దివ్య వైద్యుని దివ్య వాణి
Vol 11 సంచిక 6
November/December 2020
“ ఆరోగ్యం మరియు ఆనందం కలిసే ఉంటాయి. ఆరోగ్యం లేనట్లయితే ఆనందం ఒక ఫలించని కల. ఆరోగ్యం మనిషికి చాలా ప్రాథమికము అని శ్రుతులు (పవిత్ర గ్రంథాలు) ప్రకటించాయి. ఎందుకంటే అది లేకుండా మానవుడు తన 4 జీవిత లక్ష్యాలు అనగా సమ్యక్ చేతలు, సమ్యక్ చింతన, సరైన సంపాదన, నిర్వాణము సాధించడం వీలు కాదు. ధృఢమైన మనసుకు ధృఢమైన శరీరం అవసరం. ఇవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రపంచం అనేది మన మనస్సు యొక్క ఉత్పరివర్తనం మాత్రమే అని విజ్ఞులు అంటారు. గాఢనిద్రలో మనస్సు పనిచేయని స్థితిలో ఉన్నప్పుడు ప్రపంచం కూడా పనిచేయని స్థితిలో లేదా తన ఉనికినే కోల్పోతుంది. మనస్సు కూడా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి.”
... భగవాన్ శ్రీ సత్య సాయి బాబా, “డాక్టర్స్ ప్రొఫెషన్” దివ్యా వాణి, సెప్టెంబర్ 1980 http://www.sssbpt.info/ssspeaks/volume14/sss14-53.pdf
“ రియలైజేషన్ వైపు 9 దశలలో సేవ ఒకటిగా సూచించబడింది. అందువల్ల మీరు దాని పట్ల శ్రద్ధకలిగి వృద్ధులు, రోగులు, వికలాంగులు, వ్యాధిగ్రస్తులు మరియు ఆందోళనలో ఉన్న వారికి సేవ చేయడానికి ఉన్న అన్ని అవకాశాలను స్వాగతించాలి. చేతిలో ఒకపండును పట్టుకొని ఉండడం అనేది ప్రాథమిక దశ, తినడం మరియు జీర్ణం చేసుకోవడం తప్పనిసరిగా జరగాలి తద్వారా మీరు ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉంటారు. కాబట్టి మెడకు స్కార్ఫు మరియు బ్యాడ్జి అనేవి సంజ్ఞ మాత్రమే, మీరు నిజంగా సేవ చేస్తున్నప్పుడు మాత్రమే మీలో ఉన్న ఆనందము అనుభవానికి వస్తుంది. మీరు చేసే సేవ దాంతోపాటు మీ భావన లేదా మానసిక వైఖరిని బట్టి పరిగణన చేయబడుతుంది. కాబట్టి ఏ పని కేటాయించినా ఉత్సాహంతో అవగాహనతో భక్తితో చేయండి. సేవ లో ఎక్కువ లేదా తక్కువ ఉండకూడదు ఎందుకంటే సాయి అందరిలోనూ, అన్నింటిలోనూ ఉన్నారు. ఎవరికి మీరు సేవ చేసినా సాయి మీ సేవను స్వీకరిస్తాడు.”
... శ్రీ సత్య సాయి బాబా, “ నో బంప్స్ నో జంప్స్” , 3 వ అఖిల భారత సేవాదళ్ సదస్సు,14 నవంబర్ 1975 http://www.sssbpt.info/ssspeaks/volume13/sss13-18.pdf