Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా.అగ్గర్వాల్ యొక్క డెస్కు నుండి

Vol 6 సంచిక 5
September/October 2015


ప్రియమైన అభ్యాసకులకు

స్వామి యొక్క 90వ జన్మదిన సమర్పణలో పాల్గొనేందుకు ఆహ్వానం

నేను సాయి వైబ్రియానిక్స్ అభ్యాసకులకు ఒక ముఖ్యమైన ప్రకటనతో ఈ సంచికను ప్రారంభం చేయాలనుకుంటున్నాను. నవంబర్ 23న మనకు ప్రియమైన మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి 90వ జన్మదినమని మీకందరికీ తెలిసినదే. ఈ పవిత్రమైన మరియు ఆనందమైన సందర్భంలో సాయి వైబ్రియానిక్స్ యొక్క టీం, వైబ్రియానిక్స్ కేసులను స్వామికి సమర్పించుకోవాలని  నిర్ణయించుకుంది. అభ్యాసకులందరు తమ కేసు వివరాలను పంపించి, ఈ యొక్క సమర్పణ కార్యక్రమంలో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము.

ప్రధాన నివారణ కారకుడైన స్వామిపై మనకున్న ప్రేమను వ్యక్తపరచటానికి, కేసులను సమర్పిస్తున్నాము. స్వామి యొక్క సాధనాలుగా స్వామీ మీద మనకున్న భక్తిని వ్యక్తపరచటానికి, 90వ జన్మదినోత్సవం ఒక సువర్ణ అవకాశం. స్వామికి మన కృతజ్ఞ్యతలు తెలుపుకోవడానికి, స్వామి మనకప్పగించిన సేవా కార్యక్రమము యొక్క సఫలితాలను సమర్పించడం కన్నా ఉత్తమ మార్గం మరేముంటుంది?

అభ్యాసకులందరు ఒకటి లేదా అనేక కేసు వివరాలను, సాయి వైబ్రియానిక్స్ వార్తాలేఖ, 90వ జన్మదిన ప్రత్యేక సంచికలో ప్రచురింప పడేందుకు పంపవచ్చు. ఈ సంచికలో ప్రతి ఒక్క ప్రాంత మరియు ప్రతి ఒక్క దేశ ప్రాతినిధ్యం ఉండాలని మేము కోరుకుంటున్నాము. మాకందే కేసులను, ఈ ప్రత్యేక సంచికలో, సాధ్యమైనంత వరకు చేర్చుతాము. కాని ఆఖరి తారీఖు లోపల మాకందే కేసులన్నియు స్వామికి, 90వ జన్మదినం రోజున సమర్పించబడతాయి.

రోగ చరిత్రలను (కేసు వివరాలు) సాధ్యమైనంత త్వరగా ఈ ఈమెయిల్ కు పంపవలెను: [email protected]. సమయాన్ని ఆదా చేసేందుకు, పూర్తి వివరాలుతో కూడిన రోగ చరిత్రలు పంపించవలసిందిగా కోరుకుంటూన్నాము. ఈ విషయంలో మీకు సహాయపడే విధంగా నేనొక 'చెక్ లిస్టును' తయారు చేసాను. వివరాల కోసం click here (ముందుగా మీ యూసర్ పేరు మరియు పాస్వర్డ్ ను ఉపయోగించి వైబ్రియానిక్స్ వేబ్సయిట్ www.vibrionics.org లో లాగిన్ అవ్వాలి. సందేహాలుంటే [email protected] వద్ద సంప్రదించండి)

2015 అక్టోబర్ 10 వరకు పంపిన కేసులను మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. 10 అక్టోబర్ చివరి తేదియని ధృడంగా నిశ్చయించబడింది. ఆఖరి నిమిషంలో కాకుండా ముందుగానే కేసు వివరాలను మాకు పంపవలసిందిగా కోరుతున్నాము. ఈ విధంగా చేసినట్లయితే కేసు వివరాలను సవరించడానికి మరియు ప్రచురణకు సిద్ధం చేయడానికి మాకు సులభంగా ఉంటుంది. ఈ విలువైన అవకాశాన్ని అభ్యాసకులందరు ఉపయోగించుకుంటారని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము.

 కేరళకు చెందిన అభ్యాసకులకు కృతజ్ఞ్యతలు

 108CC బాక్సులను సమీకరించడానికి ప్రశాంతి నిలయానికి ప్రత్యేక ప్రయాణాలు చేస్తున్న కేరళ సమన్వయకర్తకు మరియు అతని టీంకు చెందిన అభ్యాసకులందరికీ, హృదయపూర్వకమైన ప్రశంసలను మరియు క్రుతజ్ఞ్యతల్ను తెలుపుకుంటున్నాను. ఈ బాక్సులు వైబ్రియానిక్స్ అభ్యసించడానికి కావాల్సిన ప్రధాన సాధనాలు! పైకి కనబడక పోయినా, బాక్సులను సమీకరించటం చాలా కష్టమైన పని. ఇంతే కాకుండా కేరళ అభ్యాసకులు మరో ముఖ్యమైన సేవను అందిస్తున్నారు: మన అంతర్జాతీయ సంఘం IASVP యొక్క సభ్యత్వం కోసం, ID కార్డులు తయారు చేసేందుకు, అభ్యాసకుల వివరాలను సేకరించటం, కార్డులను ముద్రించటం మరియు తయారైన ID కార్డులను అభ్యాసకులందరికీ పంపించటం వంటివి. వారి సేవ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభ్యాసకులందరికీ ప్రయోజనకరంగా ఉంది.

ఈ సంచికలో ముఖ్యాంశం: ఢిల్లీ అభ్యాసకులు

 అత్యంత సమర్పనా భావంతో వైబ్రియానిక్స్ సేవనందిస్తున్న, విభిన్న సమూహాలకు చెందిన ఢిల్లీ అభ్యాసకుల వివరాలపై ఈ సంచికలో కేంధ్రీకరించబడింది. ఢిల్లీ అభ్యాసకుల వివరాలను మరియు వారి కేసుల వివరాలను వ్యవస్థాపింఛి మరియు సంకలనం చేసిన ఢిల్లీ-NCR సమన్వయకర్తకు02859...ఇండియా మా ప్రశంసలను అందచేస్తున్నాము. వీరందిoచే సేవ, నిస్వార్థ ప్రేమకు ఒక  స్పూర్తిదాయక ఉదాహరణ.

ప్రేమపుర్వకంగా సాయి సేవలో

జిత్ కే అగ్గర్వాల్