Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రశ్నలు జవాబులు

Vol 11 సంచిక 3
May/June 2020


ప్రశ్న 1:  కొవిడ్-19 నిరోధక రెమిడీతో పాటు మరేదైనా ఇతర తీవ్రమైన లేదా దీర్ఘకాలిక సమస్యకు ఔషధాన్ని తీసుకోవచ్చా?

జవాబు:  కోవిడ్ - 19 రెమెడీ ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు విడిగా(మరే ఇతర రెమిడీ తో కలపకుండా) తీసుకోవాలి. ఏదైనా ఇతర సమస్యలకు 20 నిమిషాల అనంతరం ఆ రెమిడీ తీసుకోవాలి. యాదృచ్చికంగా అనివార్య పరిస్థితులలో మరొక రెమెడీ ఇవ్వవలసి వచ్చినపుడు 20 నిమిషాల నియమం పాటించాలి. నోసొడ్ మరియు మియాజంలకు కూడా ఈ నియమం వర్తిస్తుందన్న  విషయం అందరికీ తెలిసినదే. గతంలో రెండు రెమిడీల మధ్య ఐదు నిమిషాల విరామం సరిపోతుందని అభిప్రాయం ఉండేది, కానీ ప్రస్తుత పరిశోధన ప్రకారం 20 నిమిషాల విరామం అన్ని సందర్భాల్లో అనువైనదిగా గుర్తించబడింది.

________________________________________________________________________ 

ప్రశ్న 2: నా కుటుంబంలోని సభ్యులకు తీవ్ర సమస్యలకు108 సిసి బాక్స్ నుండి రెమిడీ చుక్కను నేరుగా నీటిలో వేసి ఉపయోగించాను. ఇది గోళీలు వేసిన దానికన్నా ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలుసుకున్నాను. నా రోగులకు కూడా ఇలా చేయవచ్చా?

జవాబు: అవును  మీరు అలా కూడా చేయవచ్చు, కానీ నీటి యొక్క నాణ్యత వినియోగానికి అనువుగా ఉన్నంతవరకే రెమిడీ ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు, ఒక వారం వరకు ఉపయోగించుకోవచ్చు. అందువలన దీర్ఘకాలిక సమస్యల విషయంలో రోగి ప్రతివారం రీఫిల్ కోసం మిమ్మల్ని సందర్శించడం ఆచరణాత్మక కాకపోవచ్చు (సంచిక  9 #2 లో మూడో ప్రశ్న కూడా చూడండి).

________________________________________________________________________ 

ప్రశ్న 3: నా SRHVP మిషనులో రాగి బావులు సంవత్సరాలుగా పని చేయడం వలన చిలుము పట్టాయి. ఇది వీటిద్వారా తయారు చేస్తున్న రెమిడీని ప్రభావితం చేస్తుందా? దీనిని తొలగించడానికి ఉపయోగించ దగినది ఏమైనా ఉందా?  

జవాబు: ఇది మనం తయారుచేసే రెమెడీల నాణ్యతను ప్రభావితం చేయనందున బావులు దెబ్బతిన్నాయనే పట్టింపు లేదు. అయితే కొన్ని చుక్కలు ఈథైల్ ఆల్కహాల్ తెల్లని వస్త్రంపై వేసి బావులను క్రమానుగతంగా శుభ్రం చేస్తూ ఉండాలని సిఫార్సు చేయబడింది.  

________________________________________________________________________ 

ప్రశ్న 4: నేను ఇటీవల స్ప్రే బాటిల్ బదులు డిఫ్యూజర్ ను మా ఇంట్లో ప్రతికూల శక్తులు నివారించడానికి CC15.1 Mental & Emotional tonic చల్లడం కోసం ఉపయోగించడం ప్రారంభించాను. డిఫ్యూజర్ వాడకాన్ని మీరు సమర్ధిస్తారా?  

జవాబు: మామూలుగా చూస్తే డిఫ్యూజర్ వాడకం మంచి ఆలోచన అనిపిస్తుంది. ఎందుకంటే ఇది నిరంతరం చక్కటి స్ప్రే లేదా పొగ మంచు వంటిది ఉత్పత్తి చేస్తూ గది యొక్క విస్తృత ప్రాంతానికి వెదజల్లుతుంది. ఫ్లవర్ ఎసెన్స్ వంటి భౌతికమైన సువాసనా కారుల విషయంలో ఇది చాలా సహాయకారిగా ఉంటుందనే విషయంలో సందేహం లేదు. కానీ ఎవరైనా ఔషధాన్ని స్ప్రే చేసినప్పుడు ప్రార్థన ద్వారా చేస్తారు. రెమిడీని డిఫ్యూజర్ లో ఉంచడం ద్వారా ప్రార్థన గురించి మర్చిపోయే అవకాశం ఉంది. మనకు రెమిడీ ఎంత ముఖ్యమో ప్రార్ధన కూడా అంతే ముఖ్యం. అందువల్ల డిఫ్యూజర్ ఉపయోగించడం కంటే చిలకరించడం లేదా చల్లుకోవడం అనేది ఉత్తమం. మరొక విషయం ఏమిటంటే ఇంట్లో నివసిస్తున్న సభ్యుల ఆలోచనలు, భావాలు మరియు విజువలైజేషన్ కూడా ప్రతికూల శక్తులు చొరబడకుండా చేయడంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తాయి.

________________________________________________________________________ 

ప్రశ్న 5: విదేశాల్లో నివసించే నా రోగికి సిస్టెమిక్ ల్యుపస్ వ్యాధి ఉంది, దీనికోసం SVP మాన్యువల్ ప్రకారం బ్లడ్ నోసోడ్  బాగా పనిచేస్తుంది. అతను రక్త నమూనా పంపలేడు ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా?

జవాబు: అవును ఉంది. బ్లడ్ నోసోడ్ ప్రధానంగా రక్త రుగ్మతలను చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. అయితే రక్తం ఒక వ్యక్తి యొక్క పూర్తి శక్తివంతమైన ఆకృతిని కలిగి ఉంటుంది. అంతేకాక ఏదైనా సంక్లిష్టమైన వ్యాధికి చికిత్స చేయటానికి కూడా ఇది ఉపయోగించబడుతుంది. వ్యక్తి యొక్క సూక్ష్మ ఆకృతి కలిగి ఉన్న ఏకైక ఇతర శరీరభాగం జుట్టు. ఇది ప్రధానంగా జుట్టు సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగించినప్పటికీ, ఏదైనా ఇతర దైహిక వ్యాధికి చికిత్స చేయడానికి కూడా ఉపయోగించ వచ్చు. కనుక మీ రోగి విషయంలో హెయిర్ నోసోడ్ కూడా బ్లడ్ నోసోడ్ అంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. గమనించవలసిన విషయం ఏమిటంటే శరీరంలోని వ్యర్ధ పదార్థాలైన మూత్రం, ఉమ్మి, చీము, చెవి, కన్ను, నాసిక ఉత్సర్గము వంటివి సంబంధిత శారిరక వ్యవస్థ అవయవాల వ్యాధుల చికిత్సకు ఉపయోతాయి. ఈ రోగాలకు రక్తం లేదా వెంట్రుక నోసోడ్ కూడా వాడవచ్చు, కానీ నిర్దిష్ట అనారోగ్య పదార్థం నుండి తయారైన రెమిడీ చాలా వేగంగా ఫలితాన్ని సాధిస్తుంది.     

________________________________________________________________________ 

ప్రశ్న 6: నా రోగి తను తీసుకుంటున్న నాలుగు వేర్వేరు అల్లోపతి మందులు చాలా ప్రభావంతంగా ఉన్నప్పటికీ వాటి దుష్ప్రభావాల కారణంగా కొత్త సమస్యలు కలిగిస్తున్నాయి. నేను ఈ నాలుగు అలోపతి మందులను పోటెమ్టైజ్ చేసి ఇవ్వాలనుకుంటున్నాను. ఇలా తయారు చేసిన మందులు తీవ్రమైన పుల్లౌట్ కు కారణం అవుతాయా 

జవాబు: మీరు తీసుకుంటున్న మందులు కొన్ని కొత్త సమస్యలను కలిగిస్తున్నాయనేది వాస్తవం. ఐతే శరీరంలో వాటివల్ల విపరీతమైన వ్యర్ధాలు ఉన్నాయనేదాన్ని సూచిస్తుంది. శక్తివంతము లేదా పోటెన్టైజ్ చేసిన రెమిడీ శరీరం నుండి విషాన్ని బయటకు పంపడం ద్వారా దుష్ప్రభావాల నుండి దూరం చేయడానికి సహాయపడుతుంది. చాలా సందర్భాల్లో ఈ ఉపసంహరణ నిశ్శబ్దంగా జరుగుతుంది. కనుక రోగికి ఎటువంటి అసౌకర్యం కలగదు. కానీ కొన్ని సందర్భాల్లో బలంగా ఉంటుంది, తద్వారా రోగికి ఇబ్బంది కలుగుతుంది. కనుక రోగిని ముందస్తుగా హెచ్చరించడం తప్ప దీనినుండి బయటపడడానికి వేరే మార్గం లేదు. కనుక OD లాంటి తక్కువ మోతాదుతో ప్రారంభించి నెమ్మదిగా TDS కూ పెంచడం ద్వారా జాగ్రత్త వహించడం విజ్ఞతతో కూడిన చర్య. సందర్భవశాత్తూ రోగి పోటెన్టైజ్ చేసిన అలెర్జెన్ (అలెర్జీ కలిగించేది) వాడుతున్నప్పుడు కూడా ఇదే పద్దతి వర్తిస్తుంది.   

________________________________________________________________________ 

ప్రశ్న 7: న్ని వ్యాధులకు మనసే మూల కారణం ఐతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దాని విషయమై మనకు ఏమాత్రం ఆలోచన ఉండనప్పుడు తద్వారా ఏర్పడిన అనారోగ్యానికి కూడా మనసే కారణమా ?  

జవాబు: ఒక వ్యక్తి ప్రమాదానికి గురై  గాయపడినప్పుడు అతను దాని గురించి స్పృహతో ఆలోచించలేనందున అతని మనస్సు దానికి బాధ్యత వహించడం లేదని తెలుస్తుంది. ఇక్కడ మన ఆలోచనలు మరియు భావోద్వేగాలు మన సబ్కాన్షియస్ మైండ్ లో నమోదు అవుతాయి అని తెలుసుకోవాలి. ఈ సబ్కాన్షియస్ మైండు లో ఉన్న ప్రతికూల ఆలోచన ప్రమాదానికి దారితీస్తుంది, తద్వారా గాయాలకు గురయ్యే ప్రమాదం ఉంది.