దివ్య వైద్యుని దివ్య వాణి
Vol 11 సంచిక 3
May/June 2020
“ధూళి మరియు అపరిశుభ్రమైన వాతావరణం ఎక్కడ ఉన్నా, చెడు మరియు మురికిగా ఉండే బ్యాక్టీరియా ఉంటుంది, పరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో వాతావరణం ఆహ్లాదంగా, పరిశుభ్రముగా ఉంటుంది, శుభ్రమైన బ్యాక్టీరియా ఉంటుంది. మురికిగా ఉన్న శరీరాన్ని తాకినపుడు వ్యాధి కలిగించు సూక్ష్మ క్రిములు మనలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అంతేకాక ఆ అపరిశుభ్రమైన, అపవిత్రమైన శరీరం అపరిశుభ్రత లో కొంత భాగాన్ని మనకు ఆపాదించవచ్చు. ఈ విషయంలో ఒక శరీరము మరొక శరీరమునకు అయస్కాంతము వలె పనిచేస్తుంది. అందుచేతనే అధ్యాత్మిక సాధన అనుసరించే వ్యక్తులు అపరిశుభ్రమైన పరిసరాలు మరియు వస్తువులకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలోనే మన పూర్వీకులు, పవిత్రులు మరియు పెద్దవారి పాదాలను తాకి నమస్కరించు కోవాలని తద్వారా వారి శరీరంలో ఉన్న పవిత్రత మనకు ప్రసారం అవుతుందని చెప్పేవారు. అదేవిధంగా మీరు అపరిశుభ్రమైన శరీరాన్ని తాకినట్లయితే ఆ అపరిశుభ్రత, అపవిత్రత మీలో ప్రవేశిస్తుంది. ”
... శ్రీ సత్య సాయి బాబా, మంచి ఆరోగ్యం మనిషి యొక్క గొప్ప సంపద- వేసవి జల్లులు 1978 జూన్ http://www.sssbpt.info/summershowers/ss1978/ss1978-28.pdf
“సమాజానికి సేవలు అందించడానికి సాధ్యమయ్యే ప్రతీ సందర్భములోనూ మిమ్మల్ని మీరు ఉపయోగించుకోండి. సేవ వ్యక్తులకు మాత్రమే పరిమితం కాదు. జాతీయ సేవ చేయడం కూడా ముఖ్యమే. మీరు ఏ రకాల సేవలు చేయాలో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం అందించగల అవకాశం కనుగొన్నప్పుడు వెంటనే ఆ సేవలు అందించండి. ధనిక, పేద లేదా అర్హులైన మరియు అర్హత లేని వారుగా విభజన చేయవద్దు. పరిస్థితి యొక్క అవసరాలకు అనుగుణంగా సేవలు అందించండి”.
... శ్రీ సత్య సాయిబాబా, “సేవయొక్క పరమార్ధం” దివ్యవాణి 21 నవంబర్ 1988 http://www.sssbpt.info/ssspeaks/volume21/sss21-31.pdf