డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
Vol 11 సంచిక 2
March/April 2020
ప్రియమైన వైబ్రియో అభ్యాసకులారా,
పుట్టపర్తి లో జరుగుతున్న మహా శివరాత్రి వేడుకల సందర్భంగా మీకు ఈ విధంగా వ్రాస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది, ఇక్కడ ఈ ఆనందకరమైన పండుగను ఎంతో ఆధ్యాత్మిక ఉన్నతిని చేకూర్చేవేద పఠనం మరియు పారవశ్యం కలిగించే 12 గంటల నిడివి గల అఖండ భజనతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మన దివ్య గురువు ఏమన్నారంటే “సంవత్సరానికి ఒకసారి శివరాత్రి గురించి కేవలం తలుచుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. ప్రతీ నిమిషం, ప్రతీరోజు, ప్రతీరాత్రి దివ్యత్వం గురించే తలుస్తూ మీ సమయాన్ని పవిత్రం చేసుకోవాలి, ఎందుకంటే వాస్తవానికి ఆ కాలగమన సూత్రము శివ తత్వమే. ఆ శివుడు మీరే కనుక మీ నిజ తత్వం ఐన అట్టి శివ తత్వ సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి మరియు గుర్తించడానికి ప్రయత్నించండి. …శ్రీ సత్య సాయి బాబా, శివరాత్రి దివ్యవాణి, 1985 ఫిబ్రవరి 17. ఇది చాలా సరళంగా అనిపించినా, మన ప్రతీ క్షణం/ ప్రతీ శ్వాసను ఆధ్యాత్మికమయం చేయడానికి స్వామి సూచించిన అత్యంత శక్తివంతమైన సందేశం. ఈరోజు ప్రపంచం అనేక రంగాల్లో గందరగోళ స్థితిలో భయాందోళన మధ్య ముఖ్యంగా కరోనా వైరస్ లేదా COVID-19(WHOప్రపంచ ఆరోగ్యసంస్థచేత పేరు పెట్టబడినది) అనే మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధమవుతోంది. ఈ వైరస్తో ఎలా వ్యవహరించాలి అనే విషయంలో మనం తీసుకోవాల్సిన రక్షణ చర్యల గురించి ఈ సంచికలోని “అదనంగా”అనే విభాగంలో ప్రత్యేక కథనం ఇవ్వబడింది. నా ఆలోచన ఏమిటంటే ఆధ్యాత్మికమగా మన జీవితాలను చార్జింగ్ చేసుకుంటూ మన బాహ్య మరియు అంతర్గత ఇంద్రియాల ద్వారా మనం తీసుకునే వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం ఒక గొప్ప విటమిన్ సేవించడం వంటిది మాత్రమే కాక మనం తీసుకునే ఒక ప్రభావితమైన ముందస్తు చర్య వంటిది. కనుక మన అభ్యాసకులు అందరూ ఈ సంచిక చివరలో సూచించిన విధంగా భద్రతా చర్యలు పాటించవలసిందిగా నావిన్నపము మరియు అభ్యర్థన.
మన వార్తా లేఖసంపుటి 9 సంచిక 2 (మార్చి ఏప్రిల్ 2018 )లో, ప్రత్యామ్నాయ ఆరోగ్య సంరక్షణలో ఉత్తమ పద్ధతుల ఆధారంగా ఒక అధికారిక సంస్థను రూపొందించడం మరియు అమలు చేయడం ఇంకా దానిని విస్తృతపరచాలనే ఉద్దేశ్యంతో సంక్షిప్తంగా వివరించడం జరిగింది. నేను ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛంద సేవకులు తమ ఉన్నతి కోసం ప్రతిస్పందించడం, ఇప్పుడు అటువంటి ప్రామాణిక ఆపరేటింగ్ నిర్మాణాత్మక విధానాలు SOP(Standard Operating Procedure) తో కూడిన సంస్థ నిర్మాణము చేపట్టడం జరిగిందని తెలపడానికి ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు మనం 9 ప్రధాన విభాగాలతో నిర్మాణాత్మక మరియు క్రియాశీలక సంస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవి ఏమిటంటే : కార్యకలాపాలు మరియు వ్యూహాలు(ఆపరేషన్స్&లాగిస్టిక్స్), ప్రవేశములు, విద్య, శిక్షణ మరియు ప్రమోషన్లు; పరిశోధన మరియు అభివృద్ధి; వార్తాలేఖలు; ఐఏఎస్‌విపి(IASVP); ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ; ఆడియో విజువల్స్; మరియు ప్రచురణలు. ప్రతీ ఒక్క విభాగము దాని నిర్వహణ కోసం అనేక విషయాధారిత విభాగాలుగా ఏర్పడ్డాయి. ఇది ఇప్పటికే అభ్యాసకుల కోసం అనేక అడ్మిన్ సేవా(నిర్వహణా బాధ్యతలు) అవకాశాలను కల్పించింది. దీని విస్తరించే కొద్దీ, మనకు e- కోర్సు నుండి SVP స్థాయి వరకు అన్ని స్థాయిలలో ఎంతో మంది టీచర్స్ (మరియు మెంటర్స్) కావలసి ఉంటుంది. వార్తా బృందానికి సమాచారాన్ని అందించగల రచనా నైపుణ్యం ఉన్నటువంటి అభ్యాసకులు మరియు ఆడియో విజువల్ విభాగము కోసం సమాచారం సంగ్రహించగల అభ్యాసకుల అవసరం ఎంతైనా ఉంది. ఇట్టి సేవ కోసం స్వచ్ఛందంగా పాల్గొనే వారందరికీ మేము పూర్తి శిక్షణ మరియు మార్గదర్శకత్వం అందిస్తాము.
మా అభ్యాసకులు వివిధ ప్రదేశాల్లో నిర్వహిస్తున్నసాయి వైబ్రియానిక్స్ వైద్య శిబిరాల ద్వారా పెద్ద సంఖ్యలో రోగులు ప్రయోజనం పొందుతున్నారు. ఐతే ఉన్నత ప్రమాణాలు గల చికిత్సను అందించడమే కాకుండా ఎక్కువమంది రోగులు ఈ వైద్యం వలన లబ్ధి పొందాలి అనేదే మా సంకల్పం. ఈ కార్య కలాపాలను రికార్డు చేస్తూ ఇటువంటి క్యాంపుల యొక్క అనుభవాలు మిగతా అభ్యాసకులకు కూడా ప్రయోజనం చేకూర్చే విధంగా పంచుకోవాలని అనుకుంటున్నాము. దీని కోసం, క్యాంపుకు సంబంధించిన చక్కటి ఫోటోలతో పాటు దాని గురించి క్లుప్తంగా వివరాలు కూడా రాసి పంపించండి. అభ్యాసకులు ఈ విధంగా చేయగలిగితే అది ఎంతో ప్రశంసనీయం.
IASVP సభ్యులలోతమ ఐ.డి.కార్డులను రెన్యువల్ చేయించుకోవటంలో కొంత సందిగ్ధత ఉంది. దయచేసి ఒక విషయం గమనించండి, మీకు రెన్యువల్ చేయించుకోవాలని నోటిఫికేషన్ అందిన వెంటనే మన ప్రాక్టీషనర్ వెబ్సైట్లోకి వెళ్లి దానిలో ఉన్న నిబంధనలను చదవడం తప్పనిసరి (కారణం ఏమిటంటే ఈ నిబంధనల విషయంలో ఎప్పటికప్పుడు సమయానుకూలంగా ఎన్నోమార్పులు జరుగుతూ ఉన్నాయి) అంతేకాక దిగువన ఉన్న సబ్మిట్ బటన్ నోక్కే ముందు క్రింద ఇవ్వబడిన చెక్ బాక్స్ ను తప్పనిసరిగా టిక్ చేయాలి.
దీనిని ముగించే ముందు, మనమందరము ప్రతి రోజు కొన్ని నిమిషాలు ప్రార్థన లో గడపాలని, మన కరుణ, ప్రేమ, నయం చేసే శక్తిని ఈ భూమాతకు మరియు కోవిడ్ 19 వైరస్ బారిన పడిన వ్యక్తులకు చేరి దాని నుండి విడుదల కావాలని కోరుకుంటూ చివరిగా మన ప్రభువు యొక్క గొప్ప జ్ఞానోదయం కలిగించే సందేశంతో ముగించాలి అనుకుంటున్నాను.“ప్రజలు ప్రపంచాన్ని ప్రేమ దృష్టితో చూసినప్పుడు, అట్లు చూచిన వారికి శాంతి లభిస్తుంది. అన్ని వ్యాధులు నయమవుతాయి. చాలా వ్యాధులకు వాటి మూలము మనసులోనే ఉంటుంది. ప్రతిదానికి మనసే ఆధారం. ఒక వ్యక్తి తనలో ఏదో తప్పు జరిగిందని భావించినప్పుడు, అది అనారోగ్యంగా పరిణమిస్తుంది. కనుక ఆరోగ్యకరమైన శరీరానికి ఆరోగ్యకరమైన మనస్సు అవసరం .
“ప్రేమతో రోజును ప్రారంభించండి, ప్రేమతో రోజును గడపండి, ప్రేమతో రోజును ముగించండి అదే దేవుని చేరే మార్గం. ఇట్టి ప్రేమను పెంపొందించుకున్నప్పుడు వ్యాధి మీ దరిచేరదు... సత్యసాయిబాబా శివరాత్రి ఉపన్యాసం, 1985 ఫిబ్రవరి 17.
ప్రేమ పూర్వక సాయి సేవలో
మీ జిత్ కె అగ్గర్వాల్