దివ్య వైద్యుని దివ్య వాణి
Vol 10 సంచిక 3
May/June 2019
“సరైన ఆహార అలవాట్లు మరియు మానసికానందం కోసం ఎంచుకునే అవివేక మార్గాల వల్ల అనారోగ్యం కలుగుతుందని వైద్యులు అంగీకరిస్తున్నారు. కానీ, ఆహారం అనే పదం అనేక రకాలైన ‘తీసుకోవడం’ ను సూచిస్తుందని వారికి తెలియదు. ఇంద్రియాలలో దేని దాని ద్వారానైనా తీసుకునే ‘ఆహారం’వలన వచ్చే ప్రతి అనుభవం వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మేము “ఆలోచనకు ఆహారం” అని చెప్తాము; మనం ఏదైతే చూస్తామో , వింటామో , వాసన చూస్తామో లేదా స్పర్శిస్తామో అది శరీరంపై మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపుతుంది;. రక్తం చూడటం వల్ల కొంతమంది మూర్ఛ పోతారు; లేదా, కొన్ని చెడు వార్తల వినడం వల్ల షాక్‌కి గురి అవుతారు. వాసనలు పడకపోవడం ద్వారా లేదా మనసుకి నచ్చని దాన్ని తాకినప్పుడు లేదా రుచి చూసినప్పుడు అలెర్జీ రావచ్చు. ఆనందంగా వున్న మనస్సు ఆరోగ్యకరమైన శరీరాన్ని; ఆరోగ్యకరమైన శరీరం ఆనందకరమైన మనస్సును వుంచుతాయి. రెండు ఒకదానిమీద నొకటి ఆధారపడి ఉంటాయి. ఆనందం కోసం ఆరోగ్యం అవసరం; సంతోషంగా వుండడానికి ఆనందం అనేది ఒక సామర్థ్యం, ఏదైమైనప్పటికి అది శారీరక ఆరోగ్యానికి అవసరం కూడా.”
...సత్య సాయి బాబా “వెహికిల్ కేర్” దివ్య ప్రవచనం,16 అక్టోబర్ 1974
http://www.sssbpt.info/ssspeaks/volume12/sss12-48.pdf
“సృష్టిలోని జీవులందరూ పరస్పర సేవ చేసుకోవడం ద్వారా జీవిస్తున్నారు మరియు ఎవ్వరూ మరొకరి కంటే ఉన్నతంగా పరిగణించలేము. ప్రతి వ్యక్తి తన సామర్థ్యం మరియు అతని కార్యకలాపాల రంగానికి అనుగుణంగా సేవలను అందించాలి. మానవ శరీరంలో వివిధ అవయవాలు ఉన్నాయి. కానీ చేతులు, కాళ్ళు చేయగలిగే పని చేయలేవు, కళ్ళు, చెవుల విధులను నిర్వర్తించలేవు. చెవులు ఆనందం పొందగల్గినట్లు కళ్ళు పొందలేవు. అదేవిధంగా, మానవులలో తేడాలు ఉన్నాయి. వారి సామర్థ్యాలు మరియు యోగ్యతలలో తేడాలుండవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ వారి శక్తి మరియు సామద్ద్యానికి అనుగుణంగా సేవా కార్యకలాపాల్లో పాల్గొనాలి.”
…సత్యా సాయి బాబా, “బోర్న్ టు సర్వ్” దివ్య ప్రవచనం, 19 నవంబర్ 1987
http://www.sssbpt.info/ssspeaks/volume20/sss20-26.pdf