Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

Vol 10 సంచిక 1
January/February 2019


ప్రియమైన చికిత్సా నిపుణులకు,

మనమంతా కూడా  2018  సంవత్సరానికి వీడ్కోలు పలికి 2019 సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్న శుభ సందర్భంలో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2018 సంవత్సరం మనకు ఒక మైలు రాయి వంటిది. ఈ సంవత్సరంలో మనము అనేక విజయాలు సాధించాము. ఇంకా సాధించవలసినది ఎంతోఉంది. అలాగే రానున్న సంవత్సరంలో వ్యక్తిగతమైన మరియు వృత్తిపరమైన రంగాల్లో లక్ష్యాలు నిర్దేశించుకొని  తదనుగుణంగా పని చేయడానికి సమాయత్తం కావలసిన సమయం ఇది. చికిత్సానిపుణులందరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి ఏమిటంటే మీ వైబ్రియానిక్స్ సాధనలో భాగంగా మీరుకూడా ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవలసిందిగానూ అది మన వైబ్రియానిక్స్ మిషన్ ను ముందుకు తీసుకుపోయేదిగా ఉండేలా నిర్దేశించుకోవలసిందిగా సూచన.

2018లో మనం సాధించిన కొన్ని ముఖ్య విషయాలు క్రింద పొందుపరచబడ్డాయి.

  1. మూడు ప్రధాన వెబ్ సైట్లు (వైబ్రియనిక్స్ ఆర్గ్, న్యూస్ లెటర్ సైట్, ప్రాక్టీషనర్ సైట్) మెరుగుపరచడంతో పాటు ఆధునికీకరింపపడ్డాయి.
  2.  భవిష్యత్తులో నూతన అభ్యర్థుల కోసం స్క్రీనింగ్ మరియు అప్లికేషన్ ప్రక్రియ క్రమబద్ధీకరించబడింది ముఖ్యంగా క్వాంటిటీ కన్నా క్వాలిటీ దిశగా ఎంపిక సాగే విధంగా చర్యలు తీసుకోబడుతున్నాయి (స్వామి భౌతిక దేహం తో ఉన్నప్పుడు నాకు ఈ విధంగా సూచించారు) అదనంగా కొత్త ఎస్ వి పి ల కోసం కొన్ని తప్పనిసరి  పరిపాలనా విధులు ప్రవేశపెట్టడంతో ఉన్నత స్థాయి అందుకోవడం మరికొంత సంక్లిష్టం చేయబడింది.
  3. శిక్షణ, అభివృద్ధి, పరిశోధన, ప్రచురణలు మొదలైన సంస్థ యొక్క వివిధ విధులను నిర్వహించడానికి అంకితభావం గల నిష్ణాతులైన ఎస్ వి పి లతో కూడిన ఒక ప్రధాన బృందాన్నిఏర్పాటు చేయడం జరిగింది. 
  4. వన్ టు వన్ మెంటరింగ్  ప్రోగ్రాం అనేది ఇప్పుడు అందరూ కొత్త ఏ.వి.పి లను వీ.పి.లు అయ్యేవరకు కొనసాగించబడుతుంది.
  5. ఏ.వి. పి  మరియు ఎస్ వి పి మాన్యువల్ కొత్త సంచికలు వెలువడ్డాయి. అంతేకాక ఎస్.వి. పి ల కోసం వైబ్రియానిక్స్ గైడ్ - 2018 కూడా ప్రచురింపబడింది. 108 సిసి పుస్తకానికి గణనీయమైన మార్పులు కూడా చేయబడ్డాయి.
  6. బెంగళూరులో ఉన్న సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు ప్రశాంతినిలయంలో లేడీస్ మరియు జెంట్స్ సేవాదళ్ భవనాల వద్ద మన యొక్క వెల్నెస్ సెంటర్లు స్థిరపరచబడి చాలా చక్కగా నిర్వహించబడుతున్నాయి.
  7. పేషెంట్  చికిత్స కోసం 2 బలమైన నెట్వర్క్  కేంద్రాలను విజయవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది.  భారతదేశంలో ఉన్న కేంద్ర బృందం ద్వారా పోస్ట్ లో రెమెడీలను పంపడం మరియు అమెరికాలో బ్రాడ్ కాస్టింగ్ విధానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా రోగులకు చికిత్స అందించడం జరుగుతోంది.
  8. భూమాతకు ఆరోగ్యవంతమైన వైబ్రేషన్ ప్రసారం చేయడం మరియు పబ్లిక్ పార్క్ లలో కూడా స్ప్రేయింగ్ ద్వారా ఆరోగ్యవంత మైన వైబ్రేషన్ ప్రసారం చేయడం కొనసాగించబడుతున్నది. ఇప్పటికే ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజన కరమైన ప్రభావాలను ప్రాక్టీషనర్ లు చూడటం జరుగుతోంది.

2019లో మేము చేపట్టాలనుకున్న  లేదా చేయాలనుకుంటున్న కొన్ని ఇతర కార్యక్రమాల వివరాలు క్రింద పొందుపరచబడ్డాయి.

  1. వైబ్రియానిక్స్  పుస్తకాలు ఇతర భాషలలోనికి ఉదాహరణకు హిందీ, తెలుగు, మొదలగు భాషలకు అనువదించడం ద్వారా ఎక్కువమందికి దీని పట్ల అవగాహన పెంపొందించే కృషి  జరుగుతోంది. ఇప్పటికే మరాఠీ లో రెండు ఏ.వి.పి.పుస్తకాలు అనువదింపబడ్డాయి.
  2. పరిశోధనా రంగంలో మరింత ముందంజ వేయడం జరిగింది. గర్భధారణ సమయంలో స్త్రీలు తీవ్ర వత్తిడికి ( డిప్రెషన్) లోనవడం పై వైబ్రియానిక్స్ రెమెడీల యొక్క స్వస్తతా సామర్థ్యాన్ని నిర్ణయించడంపై పరిశోధన ఇప్పటికే జరుగుతున్నది. మరొకటి మధుమేహానికి సంబంధించిన పరిశోధన త్వరలో ప్రారంభం అవుతుంది.
  3. పరస్పర సహకారం పెంపొందించుకోవడం కోసం నిష్ణాతుల బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. దీనిలో భాగంగా వార్తా సంచికలు, వార్త లేఖల పై అంశాలను చర్చించడం ఇతర సభ్యులతో క్రమం తప్పకుండా కలవడం, విజయవంతమైన కేసులను పంచుకోవడం అలాగే కొత్త కేస్ హిస్టరీలు  రాయడం అన్నిటికంటే ప్రధానంగా అనధికార స్నేహపూర్వక సమావేశాలను నైతిక మద్దతు కోసం శాశ్వత బంధాలు ఏర్పాటు దిశగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.
  4. క్రియాశీల అభ్యాసకులను మాత్రమే ఉంచడానికి లేదా చేర్చుకోవడానికి మా డేటాబేస్ ఇంకా పూర్తిగా సవరించవలసి ఉంది. ఈ మేరకు గణనీయమైన ప్రయత్నం జరుగుతోంది ఇంకా కొంత చేయవలసింది ఉంది.

చివరగా మన ప్రియతమ భగవానుని యొక్క సందేశంతో మిమ్మల్ని ఉత్తేజ పరిచాలని  ఆశిస్తున్నాను.

‘‘నూతన సంవత్సరం భక్తులకు ఆనందం మరియు శ్రేయస్సును ఇవ్వాలని చాలామంది ఆశిస్తుంటారు. అయితే వాస్తవానికి మీ కర్మలకు ఫలితంగానే సుఖ దుఃఖాలు మీరు అనుభవిస్తారు. కనుక ఈ నూతన సంవత్సరంలో మీ పాత కర్మల తాలూకు పాపాలు  ప్రాయశ్చిత్తం కావడానికి మీరు పవిత్ర లక్షణాలను పెంపొందించుకోవాలి. మరియు ఈ నూతన సంవత్సరంలో మరింత పవిత్రమైన కార్యకలాపాలలో పాలు పంచుకొనే  పరిస్థితులను రూపొందించుకొనడంతో పాటు, ఎట్టి పరిస్తుతల లోనూ మీ భావాలు స్వచ్ఛమైనవి  గానూ  ఆదర్శవంతంగానూ  ఉండేలా చూసుకోండి. మీ సకల చర్యలూ ఇతరుల యొక్క సంక్షేమం కోసమే ఉండేలాగా సదా జాగరూకులై ఉండండి.".. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ..దివ్యవాణి 1 జనవరి 2001 ప్రశాంతినిలయం.

మన ప్రియాతి  ప్రియమైన స్వామి యొక్క ఈమాటలను మన హృదయాల్లో నింపుకొని ఈ కొత్త సంవత్సరంలో అందరం కలిసి నడుస్తూ చేతులు కలుపుతూ మన వైబ్రియనిక్స్ ను  ముందుకు తీసుకెళ్దాం జై సాయిరాం. 

సాయిసేవలో ప్రేమతో

మీ జిత్.కె.అగ్గర్వాల్