దివ్య వైద్యుని దివ్య వాణి
Vol 10 సంచిక 1
January/February 2019
“దేవుని పై మనసు లగ్నము చేయుట, మంచి ఆలోచనలు మరియు మంచి విషయాలు మనిషి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కనులు, చెవులు, నాలుక, వంటి ఇంద్రియాలను సంయమనంతో ఉండేలా తర్ఫీదు ఇవ్వండి. ఉద్రేకం కలిగించే విషయాలను చూడకూడదు, వినకూడదు, మరియు చదవకూడదు. అటువంటి సినిమాల వైపు మీ దృష్టి కూడా మరల కూడదు. నీపై నువ్వు విశ్వాసం కోల్పోకుము, నువ్వు ఈ శరీరంలో నివశిస్తున్న భగవత్ స్వరూపానివే. సంతృప్తే బలవర్ధకమైన ఔషధం. అటువంటప్పుడు దురాశ అనే జబ్బును తెచ్చుకొని, బలం కోసం భౌతికమైన టానిక్కులు త్రాగడం ఎందుకు? సంసారం అనే మహా సముద్రాన్ని దాటడానికి భక్తి మరియు క్రమశిక్షణ హద్దులుగా శరీరము అనే పడవను ఉపయోగించి ఆత్మ సాక్షాత్కారం అనే గమ్యం చేరండి."
...సత్య సాయిబాబా , “సంసార సాగర నౌక” దివ్యవాణి 12 అక్టోబర్ 1968 http://www.sssbpt.info/ssspeaks/volume09/sss09-21.pdf
“సేవ చేసేటప్పుడు కేవలం స్వయంతృప్తిని మాత్రమే దృష్టిలో ఉంచుకోకుండా గ్రహీత యొక్క తృప్తిని దృష్టిలో ఉంచుకొని చేసే సేవ ఉత్తమమైనది. మీ సేవ ఇతరులకు ఎవరికైనా ఇబ్బంది, లేదా అసౌకర్యం కలిగిస్తుందా అనేది ముందు అంతః పరిశీలన చేసుకొని సేవ ప్రారంభించాలి. కేవలం మానవులకు చేసిందే సేవ అనిపించుకోదు. అవసరం మేరకు ప్రాణులన్నింటికీ నిస్వార్ధంగా సేవచెయ్యలి, భగవంతుడు అన్ని జీవులలోనూ ఉంటాడు. ఈ సత్యాన్ని మానవుడు మొదట గుర్తించాలి. అట్టి భావనతో చేసే సేవనే నిజమైన సేవ. విశ్వాసం లేకుండా కేవలం హంగు ఆర్భాటం కోసం చేసే సేవలు భగవంతుని చేరవు."
... సత్యసాయి బాబా, “నిస్వార్ధ సేవ యొక్క ప్రాముఖ్యత ” దివ్యవాణి 16 నవంబర్ 1975 http://media.radiosai.org/journals/vol_13/01AUG15/Sathya-Sai-Speaks-on-The-Yoga-of-Selfless-Service.htm