దివ్య వైద్యుని దివ్య వాణి
Vol 9 సంచిక 6
November/December 2018
‘’వ్యాధిఏర్పడిన తర్వాత నివారించలేని పరిస్థితి తెచ్చుకోవడం కంటే వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తెలివయిన పని. మనిషి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా పరిస్థితులను అలాగే కొనసాగించడం ద్వారా వ్యాధి ముదిరిపోయే స్థితి తెచ్చుకుంటాడు. దీనికి తోడు భయము అనిశ్చితి ఆందోళన వ్యాధి మరింత బలపడేందుకు కారణమవుతాయి. పూర్వకాలంలో ఒక సామెత ఉండేది. ఒక పూట భోజనం చేసేవాడు యోగి రెండు పూటలు భోజనం చేసేవాడు భోగి మూడు పూటల భోజనం చేసేవాడు రోగి. యోగి సంతృప్తికరంగా జీవిస్తూ భగవంతుడే లక్ష్యంగా ఏర్పరుచుకొని ఉన్నవాడు. భోగి ఇంద్రియ సంబంధమైన సుఖాలకు దాసుడు అయినవాడు. రోగి అనారోగ్యానికి గురి అయి బాధలు పడుతున్న వాడు. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోవడం ధనవంతులలో సామాన్యం అయిపోయింది అధికంగా తినడం ఫ్యాషన్ గా మారిపోయింది “
... శ్రీ సత్యసాయి బాబా, “సీ వర్తీ బోట్ » దివ్యవాణి 12 అక్టోబర్ 1968 http://www.sssbpt.info/ssspeaks/volume09/sss09-21.pdf
"భగవంతుడు మానవ జన్మను ప్రసాదించింది తినడం తాగడం నిద్రించడం ఆనందించడం కోసం కాదు ఇతరులకు సహాయం చేయడం కోసం. భగవంతుని ప్రేమించే అత్యుత్తమ మార్గం అందర్నీ ప్రేమించడం అందరి సేవించడం. మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం తన తోటి వ్యక్తులను ప్రేమించడం వారికి చేతనైంది సహాయం చేయడం వారిని ఆనందంగా ఉంచడం. సమాజానికి సేవ చేసినప్పుడే వ్యక్తి యొక్క జీవితం సార్ధకం అవుతుంది. అత్యుత్తమ ఆధ్యాత్మిక సాధన ప్రేమను సేవ గా మార్చుకోవడం. ఈ సేవ భగవత్ ప్రేమను ప్రాప్తించే భక్తిని ఇస్తుంది. "
... శ్రీ సత్యసాయి బాబా, “డ్వెల్ ఇన్ గాడ్ కాన్షియస్ నెస్ ” దివ్యవాణి 27ఏప్రిల్ 1999 http://www.sssbpt.info/ssspeaks/volume32/sss32p1-12.pdf