డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
Vol 9 సంచిక 3
May/June 2018
ప్రియమైన వైబ్రో అభ్యాసకులారా,
ఆరోగ్యసంరక్షణకు సంబంధించినంతవరకు చికిత్సా రంగాలలో పని చేసే వారికి మన ప్రియతమ భగవాన్ చెప్పిన ముఖ్యమైన మాటలను ఉటంకిస్తూ ఈ వ్యాసాన్ని ప్రారంభిస్తాను “డాక్టర్లు తమ వద్దకు వచ్చే రోగులకు ధైర్యాన్ని నింపాలి. వారిని పరీక్షించే టప్పుడు వారితో మొఖంలో చిరునవ్వులు చిందిస్తూ ప్రేమగా దయతో మాట్లాడాలి.’’ సత్యసాయి వాణి 6 ఫిబ్రవరి 1993. వైబ్రో అభ్యాసకులుగా మనం రోగులతో వ్యవహరించే సమయం లో ఉన్నతమైన మానసిక స్థితి లో ఉండటం ద్వారా స్వామి చెప్పిన విధంగా దివ్య ప్రేమ ఆవరించిన క్షేత్రం నుండి మనం వారిని సంప్రదించటం చేయాలి. ఈ ప్రక్రియ మన వైద్య విధానాన్ని ‘‘చికిత్స స్థాయి నుండి రోగ నివారణ స్థాయికి చేరుస్తుంది అనేది నా ప్రఘాడ నమ్మకం. కనుక మనలో అట్టి ఉదాత్త భావన ఉదయించాలి.
ఆధ్యాత్మికత చికిత్స పై ప్రభావము చూపి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అనే విషయం వైబ్రియోనిక్స్ మార్గదర్శక సూత్రాలలో ముఖ్యమైనది. స్వామివారు బోధించిన 5 మానవతా విలువలైనట్టి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలను పాటించడమే ఆధ్యాత్మికత. వీటిని హృదయపుర్వకముగా ఆచరించడము ద్వారా ఆధ్యాత్మిక పురోగతి, తద్వారా ఒక మంచి వైబ్రియో అభ్యాసకుడిగా మారే అవకాశము కలుగుతుంది.
సాధారణంగా మన పెద్దలు ‘’అనారోగ్యం కలిగాక అవస్థ పడే దానికన్నా ముందు జాగ్రత్త మంచిదనీ ‘’ లేదా ‘’ ఒక పౌండు చికిత్స కన్నా ఒక ఔన్సు ముందు జాగ్రత్త మంచిది ‘’ ఇలా అనేక విధాలుగా సామెతలు చెపుతూ ఉంటారు. రోగనివారణ ప్రాముఖ్యం గురించి ఇంతకంటే ఎక్కువ నొక్కి చెప్పలేము. చాలా మంది అభ్యాసకులు రోగాలు భౌతికంగా ప్రస్పుటమయ్యే ముందే నివారించటానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఈ విషయంలో మాకు వ్రాత పూర్వకమైన నివేదికలు ఏవీ అందలేదు. కనుక ప్రివెంటివ్ కేర్ కు సంబంధించిన రోగచరిత్రలను మాతో పంచుకోవలసిందిగా ప్రాక్టీషనర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే మాకు చేరిన కొన్ని విజయవంతమైన ప్రివెంటివ్ కేర్ వివరాలను బట్టి 40 సంవత్సరాలు దాటిన వారికి వయస్సు రీత్యా చక్కర వ్యాధి వచ్చే అవకాశం ఉంది కనుక వారికి CC6.3 Diabetes ఇంకా 60 సంవత్సరాలు దాటిన మగవారికి ప్రోస్త్రేట్ యొక్క హైపర్ ట్రోఫీ లేదా అతి పెరుగుదల అభివ్యక్తికరణ ను నిరోధించడానికి CC14.2 Prostrate మరియు కేన్సర్ నేపథ్యం కలిగిన కుటుంబాలకు CC2.1 Cancer ను ఇవ్వటం జరిగింది. ఈ విధంగా పేషంటు యొక్క కుటుంబ చరిత్ర మరియు వైద్య చరిత్రను దృష్టిలో ఉంచుకొని వారికి దీర్ఘకాలిక వ్యాధులు సోకకుండా ముందుజాగ్రత్త కోసం వైబ్రో నివారణులను ఇవ్వవలసి ఉంటుంది.
మీ యొక్క మాస నివేదికిలను ఆన్ లైన్ లో పంపించమని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఈ విధంగా పంపేవారి సంఖ్య గత రెండు నెలలుగా క్రమంగా తగ్గుతూ వస్తోంది. బహుశా చికిత్సా నిపుణులకు తమ మాస నివేదికలను మన వెబ్సైట్ లో నమోదు చేయడం కష్టంగా ఉందేమో. ఈ ఇబ్బందిని అధిగమించడానికి మేమొక ప్రత్యేకమైన ఇమెయిల్ [email protected] ను ప్రారంభించాము. మీకు ఆన్లైన్ రిపోర్టు పంపడం ఇబ్బందికరంగా ఉంటే ఈ ఈమెయిలు ఎడ్రెస్ ద్వారా సులువుగా సమాచారం పంపవచ్చు. ఇది కూడా కష్టంగా ఉంటే మీ పాత పద్దతిలోనే సంక్షిప్త సమాచారం (sms) ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ రిపోర్టు పంపవచ్చు.
ప్రాక్టీషనర్ గా మీ స్థానాన్ని మెరుగుపరుచు కోవడానికి ఎవరైతే AVP గా మూడు నెలల అభ్యాసం పూర్తి చేసుకున్నారో వారిని వెంటనే [email protected] కి మెయిల్ పంపడం ద్వారా VP స్థాయికి దరఖాస్తు చేయవలసిందిగాను అదేవిధంగా IASVP లో సభ్యులు కావలసిందిగానూ విజ్ఞప్తి చేస్తున్నాము. VP మరియు పైస్థాయిలో ఉన్నవారికి IASVP లో సభ్యులు కావడం ఇప్పుడు తప్పనిసరి చేయబడింది.
మన భూ గ్రహం ఎంతో హానికరమైన అనేక స్థాయిలను తట్టుకుని నెట్టుకొని మనగలుగుతుంది. అదేవిధంగా మన వైబ్రియోనిక్స్ మిషన్ కూడా ఆధునికతా పోకడల ప్రమాదాలకు ప్రభావితమయ్యే మానవాళికి మాత్రమే కాక జంతువులకు, పక్షులకు కూడా ఉపశమనం కలిగించే రీతిలో చికిత్సా విధానాన్ని ముందుకు తీసుకు వెళుతోంది. ప్రస్తుత పరిస్థితిలో ఏది అవసరమో దానినే మనం అందించగలుగుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. కనుక మీ వ్యక్తిగత సాధనను మెరుగు పరుచుకొని జన బాహుళ్యానికి దగ్గరవుతూ ఆనందాన్ని అందరికీ పంచవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ !
ప్రేమతో సాయి సేవలో మీ,
జిత్. కె.అగ్గర్వాల్