దివ్య వైద్యుడి దివ్యవాణి
Vol 9 సంచిక 3
May/June 2018
“మనసుకు శాంతి లేకపోవడమే అతిపెద్ద రోగము. మనసుకు శాంతి చిక్కినప్పుడు సహజంగా శరీరము కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కనుక ఆరోగ్యము కావాలనుకొనేవారు తమ ఆలోచనలు, తలంపులు భావోద్వేగాలు, పవిత్రమైనవిగా ఉండేలా చూసుకోవాలి. బట్టలు ఏవిధంగా ఐతే శుభ్రపరుస్తామో మనసును కూడా మురికి చేరకుండా ఉండేటందుకు పదేపదే శుభ్రపరుస్తూ ఉండాలి. ఈ మురికి ఎక్కువై పొతే అది అలవాటుగా మారిపోతుంది. బట్టల పైన మచ్చలు పడితే రజకునికి వాటిని శుభ్రపరచడం కష్టమైనదే కాక దానిని శుభ్ర పరిచే ప్రక్రియలో బట్టలు కూడా పాడయిపోతాయి. కనుక మనసులో ఏమాత్రం మురికి చేరకుండా పవిత్రంగా ఉంచడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఆవిధంగా చెడుకు ఆస్కారం ఉన్న పరిస్థితుల నుండి, సాంగత్యం నుండి దూరంగా తొలగిపోవాలి. అసత్యము, అన్యాయము, క్రమశిక్షణా రాహిత్యము, క్రూరత్వము, జుగుప్స ఇవన్నీ మనసులో మురికిని పెంచేవి. సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు మనసును పవిత్ర పరిచేవి. వీటిని శ్వాసగా మలుచుకొని జీవిస్తున్నట్లయితే, నీ మనసు ఆ దుష్ట క్రిముల మురికి నుంచి బయట పడుతుంది, నీవు మానసికంగా దృఢంగా శారీరకంగా ఆరోగ్యంగా మారిపోతావు."
... సత్యసాయిబాబా, “ది బెస్ట్ టానిక్ ” దివ్యవాణి 21 సెప్టెంబర్ 1960 http://www.sssbpt.info/ssspeaks/volume01/sss01-28.pdf
"ఈ విశ్వంలో అరుదైన అవకాశము అవతారముతో సమకాలినులుగా జన్మించడం. … స్వామి ఇంకా వివరిస్తూ అట్టి అవతారమును తెలుసుకోవడం మరింత అరుదైనది...దీనికన్నా అరుదైనది అట్టి అవతారమును మానవకారములో ప్రేమించడం. దీనికన్నా అరుదైనది ఇంకా చెప్పాలంటే విశ్వంలో ఇంతకంటే మహా భాగ్యం ఉండదు అని చెప్పబడేది అట్టి అవతారమునకు సేవచేసుకొనే భాగ్యం కలగడం. "
... సత్యసాయిబాబా. కొడైకెనాల్ లో విద్యార్ధులతో సంభాషణలు http://www.theprasanthireporter.org/2013/07/follow-his-footprints/